ఓ కుటుంబ వివాదం చినికి చినికి గాలివానలా మారి ఓ భర్త భార్యను హత్యచేసిన సంఘటన నల్లగొండ జిల్లా రాజాపేటలోని పాముకుంట గ్రామంలో మంగళవారం జరిగింది.
రాజాపేట (నల్లగొండ) : ఓ కుటుంబ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఓ భర్త.. భార్యపై హత్యాయత్నం చేసిన సంఘటన నల్లగొండ జిల్లా రాజాపేటలోని పాముకుంట గ్రామంలో మంగళవారం జరిగింది. వీరాస్వామి, రమా అనే దంపతులు పాముకుంటలో నివాసం ఉంటున్నారు. వారి మధ్య ఓ చిన్నపాటి వివాదం చెలరేగింది.
ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో ఉన్న భర్త.. భార్యపై కత్తితో దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. చికిత్స కోసం అమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.