
భార్యను కత్తితో నరికిన భర్త
అమరావతి : మండల పరిధిలోని నరుకుళ్లపాడులో గురువారం భార్యను కత్తి నరికి భర్త గాయపరిచిన సం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కొల్లిపర మండలం తూములూరుకు చెందిన మామిడి వెంకటేశ్వరరావుకు నరుకుళ్లపాడుకు చెందిన లక్ష్మీకి కొన్నేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గత నాలుగు నెలలుగా లక్ష్మి తల్లిదండ్రుల ఊరైన నరుకుళ్లపాడులో ఉంటోంది. ఈ క్రమంలో గురువారం వెంకటేశ్వరరావు ఆవేశంతో నరుకుళ్లపాడు చేరుకున్నాడు.
పొలం వెళ్లిన లక్ష్మిని గ్రామ శివారులో తనతో తెచ్చుకున్న కత్తితో నరికాడు. ఆమె ఎడమ చెవి, కుడి గడ్డం పైన, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అమరావతి పోలీ సులు కమ్యూనిటీ హెల్త్ సెంట ర్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.