భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త రాక్షసుడిలా మారి ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటన విజయవాడ లబ్బిపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది.
విజయవాడ : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త రాక్షసుడిలా మారి ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటన విజయవాడ లబ్బిపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ లబ్బిపేటకు చెందిన నాగరాజు(30) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా భార్య రాజకుమారి(24)పై నాగరాజు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే అనుమానం పెనుభూతంగా మారి గురువారం భార్యపై కత్తితో దాడికి దిగాడు. కత్తిపోట్లకు ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.