
భర్త ఒంటిపై కారం పూసి చితకబాదిన భార్య
హైదరాబాద్ : ఓ భార్య తన సోదరునితో కలిసి భర్త ఒంటిపై కారం పూసి చితకబాదింది. ఈ సంఘటన మంగళవారం ఎల్బీనగర్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర రక్త స్రావంతో బాధితుడు మల్లేష్ స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు మల్లేష్‌ను ఆసుపత్రికి తరలించారు. గొడవకు కుటుంబకలహాలే కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.