గుంటూరులో వివాహిత దారుణ హత్య | woman murdered in guntur district over Family strife | Sakshi
Sakshi News home page

గుంటూరులో వివాహిత దారుణ హత్య

Published Wed, Jun 22 2016 9:51 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

woman murdered in guntur district over Family strife

ముప్పాళ్ల: గుంటూరు జిల్లాలో కుటుంబకలహాల కారణంగా ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన సాంబిరెడ్డి, లక్ష్మి(35) దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా సాంబిరెడ్డి అతడి తండ్రి బక్కిరెడ్డి కలసి లక్ష్మితో గొడవపెట్టుకున్నారు. తండ్రి, కొడుకు కలసి లక్ష్మిని రోకలిబండతో కొట్టి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement