మేడ్చల్‌లో దారుణం | girl brutal murdered in ranga district medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో దారుణం

Published Wed, Oct 12 2016 6:10 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

girl brutal murdered in ranga district medchal

మేడ్చల్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరింగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న కృష్ణమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దసరా సందర్భంగా బుధవారం మధ్యాహ్నం కృష్ణమూర్తి దంపతులు ఇద్దరు కూతుళ్లను ఇంట్లో వదిలేసి బంధువులను కలిసి రావడానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇద్దరు పిల్లలు నిద్రిస్తుండగా.. ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు ప్రసన్న(7)ను బాత్రూమ్‌లోకి ఎత్తుకెళ్లి గొంతు, కాళ్లు కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement