టెన్షన్ భరించలేకపోతున్న..
- భార్య, కూతురును చంపి.. తానూ చావాలని నిర్ణయం
- కుటుంబకలహాలే కారణం?
- తహశీల్దార్ శ్రీనివాస్ ఆత్మహత్య ఉదంతం
భీమారం: వారిది అన్యోన్య దాంపత్యం.. ఓ సారి చిన్నగా గొడవ పడినా తర్వాత సర్దుకుపోతారు.. ఆ తర్వాత హ్యాపీగా ఉంటారు.. వారే మంచికట్ల శ్రీనివాస్- లావణ్య దంపతులు. మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు వైష్ణవి(ఇరవై నెలలు). శ్రీనివాస్(32) చిట్యాల తహశీల్దార్. శనివారం మధ్యాహ్నం వరకు హన్మకొండలో వినాయక నిమజ్జన విధినిర్వహణలో ఉన్నారు. ఆ తర్వాత నగరంలోని తన ఇంటికి చేరారు. కారణం ఏదో తెలియదుగానీ.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలతో మనస్తాపం చెందిన శ్రీనివాస్.. భార్యాకూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణరుుంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈక్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవజరిగింద, గాయప డ్డ భార్య చనిపోరుుందని షాక్‌తిన్న శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ‘భా ర్య వేధింపులు భరించలేకపోతున్న.. టెన్షన్ ఎక్కువైంది.. చావాలని నిర్ణయించుకున్న.. నా చావుకు భార్య మాత్రం కారణం కాదు.. అయినా నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని శ్రీనివాస్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ యా దయ్య, హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్, ఆర్డీవో మహేందర్‌జీ, సీఐ అలీ, ఎస్సై నాగబాబు, తహశీల్దార్ చెన్నయ్య తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లావణ్య, వైష్ణవిని ఆస్పత్రికి తరలించారు.
చిట్యాలలో విషాదం
చిట్యాల : తహశీల్దార్ శ్రీనివాస్ ఆత్మహత్య చిట్యాలలో విషాదం నింపింది. కరీంనగర్ జి ల్లా రామడుగు మండలం వెదిరెకు చెందిన శ్రీనివాస్ 21 ఫిబ్రవరి 2014లో చిట్యాల తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10 నుంచి రాత్రి10గంటల వరకూ ఆఫీసులోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై నే దృష్టి సారించారు. ముక్కుసూటి స్వభావం గలవారు. ప్రజల్లో చెరగని ముద్రవేసుకున్నా రు. సీఐ, ఎస్సైతో ప్రతీవారం సమీక్ష జరుపు తూ ఇసుక అక్రమ రవాణాను నియంత్రిం చారు. పంచాయతీ కార్యదర్శుల అనుమతి తోనే ఇసుక పర్మిట్లు ఇచ్చేవారు.
గుడుంబా నిర్ములన, ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రజల్ని చైతన్యవంతం చేశారు. 2014, 2015 జూన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రజల్ని భాగస్వాములను చేశారు. తెలంగాణ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. శ్రీనివాస్ గాయకుడిగానూ రాణించారు. తహశీల్దార్ శ్రీనివాస్ మృతిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని సీఐ రవీందర్, ఎస్సై వెంకట్రావు, ఎంపీడీఓ త్రివిక్రమరావు, ఏవో రఘుపతి, ఎంపీపీ బందెల స్నేహలత, జెడ్పీటీసీ కాట్రేవుల సాయిలు, రాజకీయపార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తెలిపారు.