సిద్దిపేట జిల్లాలో విషాదం : దంపతుల ఆత్మహత్య | couple suicide in siddipet daulatpur village over Family strife | Sakshi
Sakshi News home page

సిద్దిపేట జిల్లాలో విషాదం : దంపతుల ఆత్మహత్య

Published Tue, Feb 7 2017 11:46 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

couple suicide in siddipet daulatpur village over Family strife

జగదేవ్‌పూర్‌ : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌ గ్రామంలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన సాయిలు(75), సరోజమ్మ(65)లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నా ఒకరు హైదరాబాద్‌లో, మరొకరు జగదేవ్‌పూర్‌లోనే ఉంటున్నారు. వీరిద్దరు గ్రామంలోని వేరే ఇంట్లో జీవనం గడుపుతున్నారు. సరోజమ్మకు ఆస్పత్రిలో చూపించుకొచ్చారని, మూడు రోజుల క్రితం నుంచి ఆమె కనిపించడంలేదని చుట్టుపక్కలవారు తెలిపారు. సాయిలు ఇంట్లో ఉరివేసుకుని కనిపించగా సరోజమ్మ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వృద్ధ దంపతుల ఆత్మహత్యతో స్థానికంగా విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement