కుటుంబ కలహాలు.. ఒక వ్యక్తి హత్యకు కారణమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంకోఠిలో ఆదివారం రాత్రి బొగ్గులకుంట ప్రాంతానికి చెందిన ఖాదర్‌పాషా(33)ని కొందరు దుండగులు అడ్డుకున్నారు. అతన్ని ఇనుప రాడ్‌తో కొట్టి, గొడ్డలితో నరకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, పాషాకు మూడేళ్ల క్రితం నేహా ఫాతిమా అనే యువతితో వివాహమైంది. వారిద్దరికీ మనస్పర్థలు రావటంతో విడిపోయారు. ఈ నేపథ్యంలోనే నేహా బంధువైన సర్ఫరాజ్ అతని స్నేహితులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాంకోఠిలో ఒకరి దారుణ హత్య
Published Mon, Sep 21 2015 9:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement