
హైదరాబాద్: ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బానోతు జగన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సైదప్ప బస్తీలో మంగళవారం తెల్లవారుజామున ఇంటిముందు గేటు శబ్ధం రావడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారన్న అనుమానంతో ఇంటి యజమానులు పైఅంతస్తుకు వెళ్లి చూడగా జగన్ చనిపోయి ఉన్నాడని, ఆ సమయంలో అక్కడే మరో వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడని భార్య దేవికని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పిందని, దీంతో అనుమానం వచ్చి ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోయాడని వారు చెబుతున్నారు. జగన్ చాలా మంచి వ్యక్తి అని, మరో వ్యక్తితో కలిసి భార్యనే హత్య చేసి ఉంటుందని వారు చెప్పారు. వెంటనే పోలీసులకు విషయం చేరవేశామని వారు తెలిపారు.
పెళ్లైననాటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. కాగా, జగన్ మద్యం మత్తులో ఉండగా, అతని పురుషాంగంపై దాడి చేసి, నోట్లో హిట్ కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య దేవికని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు జగన్ స్వస్థలం గుంటూరు జిల్లా మాచర్ల. జగన్ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment