
రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, పూసపాటిరేగ(విజయనగరం): మండల కేంద్రమైన పూసపాటిరేగలో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే...శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం యాగాటిపేటకు చెందిన గుడబల్ల సోనియా (26)ని శ్రీకాకుళం జిల్లా బూర్జకు చెందిన మడపాన సుధీర్‌కు ఇచ్చి ఏడు నెలల కిందట వివాహం చేశారు. పూసపాటిరేగలోని రెడ్డీస్ ఫుడ్ క్యాంటీన్‌లో ఉద్యోగం నిమిత్తం భార్యతో కలిసి పూసపాటిరేగ సాలిపేటలో సుధీర్ నివాసం ఉంటున్నాడు. పది రోజులు కిందట కన్నవారి ఊరైన యాగాటిపేట వెళ్లిన సోనియా ఈ నెల 14న పూసపాటిరేగకు వచ్చింది.
ఇంట్లో ఎవరూలేని సమయంలో బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తరుచూ అదనపు కట్నం కోసం అల్లుడు వేధించడం వల్లే తమ కుమార్తె తనువు చాలించిందని సోనియా తల్లిదండ్రులు పైడమ్మ, ఈశ్వరరావు, సోదరుడు కూర్మారావులు బోరున విలపించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. ఈమేరకు పూసపాటిరేగ ఎస్‌ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: డిన్నర్ @ఫ్లైట్.. ఈ ఫోటోలు చూస్తే మీకూ వెళ్లి తినాలనిపిస్తుంది..
Comments
Please login to add a commentAdd a comment