సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లా టీడీపీలో కీలక నేతల ఆశలు గల్లంతయ్యాయి. అందరి కన్నా రేసులో తామే ముందున్నామని భావించిన వారికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అందరి అంచనాలను తలకిందులు చేసి ఎస్టీ కోటాలో సంధ్యారాణి పేరు ఖరారు చేయడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఎన్నో ఆశలతో ఉన్న పార్వతీపురం డివిజన్ నేతలు మరింత నిరాశకు గురయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ దక్కే పరిస్థితి ఉండటంతో జిల్లాలోని ఆశావహులంతా వారం రోజులగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. ఎవరికివారు లాబీయింగ్ చేసుకుని అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అరకు ఎంపీగా పోటీ చేసి నష్టపోయానన్న వాదనతో, ఎస్టీ కేటగిరీలో ప్రాధాన్యం కల్పించాలని గుమ్మడి సంధ్యారాణి కోరారు.
పార్వతీపురం డివిజన్‌లో పార్టీ పటిష్టం కావాలంటే తమకే ఇవ్వాలని ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు తెంటు లక్ష్ముంనాయుడు, భంజ్‌దేవ్ తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. అలాగే, విజయనగరం డివిజన్‌కొచ్చేసరికి మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి,గద్దే బాబూరావు, చీపురుపల్లికి చెందిన త్రిమూర్తులురాజు, విజయనగరానికి చెందిన ఐవీపీరాజు ఆశించారు. ఎవరికి వారు తమదైన శైలీలో ప్రయత్నాలు చేశారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధిష్టానం గుమ్మడి సంధ్యారాణి పేరును ఖరారు చేసింది. దీంతో మిగతా ఆశావహులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, నిరాశ చెందారు. చేసేది లేక గవర్నర్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల కోటాపైనే ఆశలు పెట్టుకోవల్సిన పరిస్థితి నెలకొంది. పార్వతీపురం
డివిజన్ నేతలకు సంక్లిష్టం : తాజాగా తీసుకున్న నిర్ణయంతో పార్వతీ పురం డివిజన్ నేతల పరిస్థితిసంక్లిష్టంగా తయారైంది.ఇది కాకపోతే మరొకటి అనుకునే పరిస్థితి ఈ డివిజన్ నేతలకు లేకుం డాపోయింది. ఎమ్మెల్యేల కోటాలో పార్వతీపురం డివిజన్‌కు చెందిన సంధ్యారాణి పేరు ఖరారు చేయడంతో వచ్చే గవర్నర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఆ డివి జన్‌కు దక్కే అవకాశం తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం అదే డివి జన్‌కు చెందిన నేత ఎమ్మెల్సీ కానుండడం తో వచ్చేసారి విజయనగరం డివిజన్‌కు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడీ విషయంపై టీడీపీలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనందున ఎమ్మెల్సీ తప్పకుండా వస్తుందని చివరి వరకు రేసులో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు అధిష్టానం నిర్ణయం మింగుడు ప డడం లేదు. ఇక,మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు, భంజ్‌దేవ్ పరిస్థితి కూ డా అంతే. చిరకాలంగా పార్టీకి పనిచేస్తున్న కారణంగా తమను గుర్తిస్తారని, డివిజన్‌లో పార్టీ పటిష్టతను దృష్టిలో ఉం చుకుని తమకే ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఆ ఆశలు ప్రస్తుత ఎమ్మెల్సీ కోటాలో నెరవేరకపోగా భవిష్యత్‌లో చా న్స్ వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. అదే డివిజన్‌కు చెందిన సంధ్యారాణిని ఇప్పటికే ఎంపిక చేయడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీపైనే విజయనగరం డివిజన్ నేతల దృష్టి
ఎలాగూ, ఎమ్మెల్యేల కోటాలో పార్వతీ పురం డివిజన్‌కు చెందిన గుమ్మడి సంధ్యారాణిని ఎంపిక చేయడంతో భవిష్యత్‌లో స్థానిక సంస్థల కోటాలో విజయనగరం డివిజన్‌కు చెందిన వారినే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ దిశగా పార్టీలో చర్చ నడుస్తోంది.మళ్లీ పార్వతీపురం డివిజన్‌కు కేటాయిస్తే తప్పనిసరిగా వ్యతిరేకత వస్తుందన్న దృష్టితో ఆ దిశగా అధిష్టానం కూడా ముందుకెళ్లదనే ధృఢమైన నమ్మకంతో ఇక్కడి నేతలు ఉన్నారు. ఈ క్రమం లో గత ఎన్నికల్లో అధిష్టానం హామీతో పో టీకి దూరంగా ఉన్న చీపురుపల్లికి చెందిన త్రిమూర్తులరాజు, సీనియర్ నేతలగా ఐవీ పీ రాజు, గద్దే బాబూరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని శోభా హైమావతి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందు లో ఐవీపీ రాజు కేవలం ఆశోక్ గజపతి రాజుపైనే ఆశలు పెట్టుకోగా, మిగతా వా రు అశోక్ ఆశీస్సులతో పాటు తమకున్న పలుకుబడి, లాబీయింగ్‌తో ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
కీలకనేతల ఆశలు గల్లంతు
Published Wed, Mar 18 2015 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM
Advertisement
Advertisement