- కొనుగోళ్లపై నాఫెడ్ అధికారుల తాత్సారం
పెసర రైతులకు నిరాశ
Published Fri, Sep 16 2016 12:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో పెసళ్ల కొనుగోలు విషయమై నాఫెడ్ అధికారులు తాత్సారం చేయడంతో ఎంతో ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని నాలుగు ప్రధాన మార్కెట్ల ల్లో గురువారం నుంచి నాఫెడ్‌తో కలసి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.5225కు పెసళ్లు కొనుగోలు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వై.రంజిత్‌రెడ్డి ఈనెల 12న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు క్వాలిటీ కంట్రోలర్ రవీందర్‌రెడ్డి, నాఫెడ్ సర్వే అధికారి హుస్సేన్‌తో కలిసి గురువారం మార్కెట్ వచ్చిన రంజిత్‌రెడ్డి పెసళ్లు కొనుగోలు చేయడానికి చాలా సమయం వరకు తటపటాయించారు. అప్పటికే ప్రైవేట్ వ్యాపారు లు క్వింటాలుకు రూ.5071 ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థల అధికారులు మచ్చులు చూçస్తూ కాలయాపన చేయడం తో నిరాశ చెందిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు సరుకు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన వ్యాపారులు ధర తగ్గించి రూ.4900లతో కొనుగోలు చేసినట్లు చాలా మంది రైతులు తెలి పారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుతో సమావేశమైన నాఫెడ్, మార్క్‌ఫెడ్ అధికారులు శుక్రవారం నుంచి కొనుగోళ్లు చేపడతామని వెల్ల్లడించారు. పర్యవేక్షణలో మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శి జగన్మోçßæ ¯ŒS, సూపర్ వైజర్లు లకీ‡్ష్మనారాయణ, వేణు పాల్గొన్నారు.
Advertisement