విస్తారా వాలెంటైన్స్‌ డే సేల్‌ | Vistara Offers Flight Tickets From 899 Rupees  | Sakshi
Sakshi News home page

విస్తారా వాలెంటైన్స్‌ డే సేల్‌

Published Wed, Feb 13 2019 2:08 PM | Last Updated on Wed, Feb 13 2019 2:13 PM

Vistara Offers Flight Tickets From 899 Rupees  - Sakshi

సాక్షి, ముంబై : వాలెంటైన్స్ డేని  పురస్కరించుకుని విస్తారా ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.899కే విమాన  టికెట్లను అందిస్తోంది. పరిమిత కాల  ఆఫర్గా తీసుకొచ్చిన ఈ సేల్‌ లో  ప్రీమియం, ఎకానమీ, బిజినెస్‌ ​ క్లాస్‌ టికెట్లపై 80శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్టు తెలిపింది.  రేపు( ఫిబ్రవరి 13) అర్థర్రాతి తరువాత  ఈ సేల్‌ ముగియనుంది.

అన్ని రకాల ట్యాక్సులు కలిపి ప్రారంభ ధర కింద రూ.899కే టికెట్ లభిస్తుందని విస్తారా ఒక ప్రకటనలో  తెలిపింది. ఇది ఒక వైపు ప్రయాణానికి మాత్రమే. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 27నుంచి సెప్టెంబరు 18వరకు ప్రయాణించవచ్చు. బాగ్దోగ్రా, గువహటి మధ్య   రూ.899, ప్రీమియం  కేటగిరీలో ఢిల్లీ -ముంబై  మధ్య రూ.2599 మాత్రమే నని తెలిపింది.  వీటితోపాటు ఇతర ప్రాంతాలకు కూడా తక్కువ ధరల్లోనే విమాన ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement