Valentines Day Offers
-
Valentines day 2023:పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ చూశారా..!
సాక్షి,ముంబై: వాలెంటైన్ డే సందర్బంగా పేమెంట్ సంస్థ పేటీఎం లవర్స్‌కు వాలెంటైన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది రూ.140 దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ చెల్లింపుల ద్వారా ఒక్కొక్కటి మూడు చొప్పున మూడు రకాల కార్డులను అందిస్తోంది. లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంటర్టైన్మెంట్, డిన్నర్ కార్డ్ పేరుతో ఉన్న ఈ తొమ్మిది కార్డ్‌లను సేకరించిన తర్వాత, వినియోగదారులు రూ. 140 విలువైన 14,000 పేటీఎం క్యాష్‌బ్యాక్ పాయింట్లను పొందుతారు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 20 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌లను పొందాలంటే పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు డబ్బులు స్వీకరించినా, డబ్బును బదిలీ చేసినా, మొబైల్‌కి రీఛార్జ్, యుటిలిటీ బిల్లులను చెల్లించినప్పుడు పాయింట్లను సంపాదించవచ్చు నన్న సంగతి తెలిసిందే. వాలెంటెన్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే పేమెంట్ తరువాత పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌పై క్లిక్ చేయండి క్రిందికి స్క్రోల్ చేసి, 14వేల క్యాష్‌బ్యాక్ పాయింట్ల బ్యానర్లో ప్లే అండ్ విన్ నొక్కండి. ఇలా వచ్చిన మొత్తం 9 తొమ్మిది కార్డ్‌లను స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు స్నేహితులనుంచి అదనపు కార్డ్‌ను తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు. అన్‌లాక్ చేయకుంటే స్క్రాచ్ కార్డ్‌లు స్వీకరించిన 3 రోజుల తర్వాత పనికిరావు This Valentine's, win over love & cashback with #PaytmValentinesCashback!🤩 Send money, recharge, pay bills & more to collect cards & win up to 14000 Cashback points!* Play now to win: https://t.co/fE1siDe2Ko *Offer ends on 20th February 2023 #PaytmSeUPI — Paytm (@Paytm) February 13, 2023 -
Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్
సాక్షి,ముంబై: వాలెంటైన్స్ డే సందర్భంగా టెలికాం దిగ్గజం ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. అదనపు డేటాతో మరికొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. ముఖ్యంగా డిస్కౌంట్ కూపన్లు ,ఫెర్న్ & పెటల్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్ల నుండి ఆఫర్ ఉన్నాయి. జియో వాలెంటైన్ ఆఫర్ ♦ రూ. 121 విలువైన అదనపు డేటా యాడ్-ఆన్ (12 జీబీ డేటా). ♦ రూ. 1,000 విలువైన ప్రత్యేక తగ్గింపు వోచర్లు. ♦ ఫెర్న్ & పెటల్స్ రూ. 799 కొనుగోలుపై రూ. 150 తగ్గింపు. ♦ మెక్‌డొనాల్డ్స్ - రూ. 199 కొనుగోలుపై రూ. 105 తగ్గింపు (సౌత్ & వెస్ట్ రీజియన్ మాత్రమే). ♦ ఇక్సిగో - రూ. 4,500 విమాన బుకింగ్‌పై రూ. 750 తగ్గింపు. ఈ ఆఫర్‌ను పొందడానికి, “కూపన్ కోడ్ల వివరాల కోసం మై జియో యాప్‌లో కూపన్లు & విన్నింగ్‌లు” ట్యాబ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. రూ. 349, రూ.899 రూ. 2999 రీఛార్జ్‌పై జియో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం, ఫిబ్రవరి 10న లేదా తర్వాత పైన పేర్కొన్న రీఛార్జ్‌ని చేస్తే అదనపు 12జీబీ 4జీ డేటా కూపన్‌కు అర్హులు. అలాగే రూ. 2999 ప్లాన్‌తో, అయితే, పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో పాటు, కస్టమర్లు 75జీబీ అదనపు డేటాతో పాటు 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా పొందుతారు. అంటే రూ. 2399 ప్లాన్‌తో అందించే మొత్తం అదనపు డేటా 87జీబీ అన్నట్టు. -
వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్స్
-
ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్!
వాలంటైన్ డే సందర్భంగా స్మార్ట్ఫోన్లపై ఈ కామర్స్ సైట్లు కళ్లు చెదిరే ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అయితే ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్‌ను ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 12మినీ, యాపిల్ ఐఫోన్ 14 ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.59,999 వేలు ఉండే ఐఫోన్ 12మినీ ఫోన్‌ను రూ.21,999లకు, రూ.79,900 ఉన్న ఐఫోన్ 14ను రూ.44,999లకే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 12మినీ ధర ప్రస్తుతం రూ.59,999. కానీ ఫ్లిప్‌కార్ట్ వాలంటైన్ డే సేల్‌లో దీని ధర రూ.41,999. అంతేకాకుండా కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్‌పై అత్యధికంగా రూ.20,000 డిస్సౌంట్ అందిస్తోంది. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటే యాపిల్ ఐఫోన్ 12మినీ ఫోన్ మీకు రూ.21,999కే లభిస్తుందన్న మాట. అలాగే యాపిల్ ఐఫోన్ 14 ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా రూ.34,901 భారీ తగ్గింపు ఉంది. అంటే ఈ ఫోన్ కేవలం రూ.44,999లకే లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 13,901 తగ్గింపు తర్వాత రూ.65,999 ఉన్నప్పటికీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్డీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా 10 శాతం గరిష్టంగా రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక పాత స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్‌పై అత్యధికంగా రూ.20,000 డిస్సౌంట్ కలుపుకొంటే ఐఫోన్ 14ను కేవలం రూ.44,999కే కొనుక్కోవచ్చు. -
అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్...స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్స్
వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ స్మార్ట్ఫోన్లపై మరో సేల్‌కి సిద్దమైంది. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అని పిలిచే అమెజాన్ కొత్త సేల్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో ఈ-కామర్స్ దిగ్గజం కొనుగోలుదారులకు ఎస్బీఐ, మాక్స్ క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐతో పాటు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ & ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 వరకు స్మార్ట్‌ఫోన్ ఉపకరణాలపై మేడ్ ఫర్ ఈచ్ అదర్ డీల్‌లను పొందవచ్చు. వాలెంటైన్స్ డే డీల్‌లో బడ్జెట్ ఫోన్లైన రెడ్మీ10 పవర్, రెడ్మీ 10ఏ, రెడ్మీ ఏ1లపై ఫెడరల్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తుంది. వీటి ధరలు రూ. 10,749, రూ. 7,862, రూ. 6,499 నుండి అందుబాటులో ఉన్నాయి. మరో స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లపై ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఆఫర్లు పొందవచ్చు. గెలాక్సీ ఎం13, గెలాక్సీ ఎం 33, గెలాక్సీ ఎం04 లను వరుసగా రూ. 8,699, రూ. 13,999, రూ. 7,499కి కొనుగోలు చేయొచ్చు. అదనంగా, ఈ ఫోన్లపై 3 లేదా 6 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు. ఐక్యూ లేటెస్ట్ 5జీ ఫోన్లను సైతం అమెజాన్ ఈ సేల్‌లో విక్రయానికి పెట్టింది. ఐక్యూ జెడ్6 5జీ, ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ, ఐక్యూ నియో 6 5జీలను రూ. 14,499, రూ. 11,999, రూ. 24,990లలో పొందవచ్చు. ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్‌లు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సందర్భంగా టెక్నో ఫోన్లపై భారీ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. 4జీబీ ర్యాబ్, 64జీబీ స్టోరేజ్, 13 ఎంపీ, ఏఐ మోడ్‌తో వచ్చే టెక్నో స్పార్క్ 9 రూ. 7,019 నుండి అందుబాటులో ఉండగా.. టెక్నో పాప్ 6 ప్రో ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ నుండి డిస్కౌంట్లతో రూ. 5,399కి కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక సెల్లో రియల్మీ 50 సిరీస్‌పై కస్టమర్లు అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. రియల్మీ 50ఐ ప్రైమ్, రియల్మీ 50ఏ ప్రైమ్ ధరలు వరుసగా రూ. 6,299, రూ. 8,999ఉన్నాయి. వీటిపై 3 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90హెచ్‌జెడ్ డిస్ప్లేతో కూడిన రియల్మీ 50 5జీ ఫోన్‌పై 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో రూ. 12,999కి అందుబాటులో ఉంది. -
Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: వాలెండైన్స్ డే అంటేనే బిజినెస్ వర్గాలకు సందడి. వాలెండైన్స్ డే డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ఆఫర్స్‌ను అందిస్తుంటాయి. అందులోనూ ఐఫోన్ల మీద తగ్గింపు అంటే ప్రేమికులు ఎగబడరూ! ఈ క్రేజ్ నేపథ్యంలో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపుధరలు అందుబాటులో ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ ఫోనలపై 12,195 దాకా తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ కార్డ్‌లపై తక్షణ తగ్గింపులతో పాటు తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కలిగి ఉన్నాయని గమనించాలి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14పై 6వేలు, ఐ ఫోన్ 14 ప్లస్‌పై 7వేల దాకా తక్షణ డిస్కౌంట్ లభ్యం. ఐఫోన్ 14: ఐఫోన్ 14 ఇపుడు రూ. 67,705లకే కొనుగోలు చేయవచ్చు. గత సెప్టెంబర్‌లో లాంచింగ్ ధర రూ. 79,900 ఐఫోన్ 14 ప్లస్: ఐఫోన్ 14 ప్లస్ రూ. రూ. 84,900 గత సెప్టెంబర్‌లో దీని లాంచింగ్ ధర రూ. 89,900 ప్రో మోడల్స్‌పై కూడా ఆఫర్ అలాగే ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పై డిస్కౌంట్ అందుబాటులోఉంది. రూ. 129,900వద్ద లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రోను ఈ సేల్‌లో రూ. 1,25,400కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ. 1,35,400కే లభ్యం. అసలు ధర రూ. 139,900 ఇతర ఉత్పతులపై కూడా ఫిబ్రవరి 28 వరకూ సేల్! ఈ సేల్, తగ్గింపు ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఈ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఇతర ఉత్పత్తులపై కూడా తగ్గింపు లభ్యం. -
జోయాలుక్కాస్ వాలెంటైన్స్‌డే ఆఫర్, వజ్రాలపై 25శాతం డిస్కౌంట్
హైదరాబాద్: వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ వజ్రాభరణాల సంస్థ జోయాలుక్కాస్ జ్యూవెలరీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తన సుప్రసిద్ధ ‘‘బీ మెయిన్’’ కలెక్షన్ పరంపరలో కొత్త శ్రేణి డిజైన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రోజ్ గోల్డ్, ఎల్లో గోల్డ్, డైమండ్‌తో రూపొందించిన హార్ట్-థీమ్డ్ జ్యువెలరీ రింగులు, లాకెట్లు, పెండెంట్లు, బ్రాస్లెట్లను అందుబాటులో ఉంచింది. ఆఫర్లో భాగంగా వజ్రాలపై 25శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫిబ్రవరి మూడోతేదీన మొదలైన ఈ ప్రత్యేక ఆఫర్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని గ్రూప్ ఎండీ వెల్లడించారు. -
రిలయన్స్ వాలెంటైన్స్ డే స్పెషల్ కాన్సెప్టు ఇదే
న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవం (వేలంటైన్స్ డే) సందర్భంగా రిలయన్స్ జ్యుయల్స్ ‘ఫ్లోరియో’ పేరుతో ప్రత్యేక శ్రేణి వజ్రాభరణాలను విడుదల చేసింది. ‘ప్రేమ పరిమళిస్తుంది, కాలం గడించే కొద్దీ బలంగా మారుతుంది’ అన్న కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఆభరణాలను డిజైన్ చేసింది. రోజురోజుకూ పెరుగుతూ వెళ్లే మొక్కలు, పువ్వులను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసినట్టు సంస్థ తెలిపింది. రూ.12,000 నుంచి వీటి ధరలు మొదలు కానున్నాయి. ఈ నెల 28 వరకు కొనుగోళ్లపై 25 శాతం తగ్గింపును సంస్థ ఆఫర్ చేస్తోంది. -
ప్రేమికులకు తాజ్ హోటల్ బంపర్ ఆఫర్?
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే ఈ వాలంటైన్స్ డే సందడి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్లు ప్రియురాలికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి? ఎక్కడకు తీసుకెళ్లాలి? అని ప్లానింగ్స్ వేస్తుండగా.. ఇంకా ఇప్పుడే ప్రేమలో దిగుతున్నవాళ్లు నచ్చిన అమ్మాయి మనసు ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేమించినవాళ్లను సర్ప్రైజ్ చేసేందుకు ఏం చేయాలా? అని గూగుల్ తల్లిని అడుగుతున్న క్రమంలో ఓ మెసేజ్ చాలామందిని ఆకర్షిస్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా తాజ్ హోటల్ మీకో బంపర్ ఆఫర్ ఇస్తోందంటూ యూత్‌ను ఊరిస్తోంది. (చదవండి: 7 లక్షల మందికి వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అన్న బిల్‌గేట్స్?) "ఇప్పుడే నేను తాజ్ గిఫ్ట్ కార్డ్‌ను గెల్చుకున్నాను. తద్వారా తాజ్ హోటల్లో ఏడు రోజుల పాటు ఉచితంగా ఉండే అవకాశం లభించింది. మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి" అంటూ ఓ లింక్ కనిపిస్తోంది. దీన్ని క్లిక్ చేయగానే 'మీరు కరెక్ట్ గిఫ్ట్ బాక్స్‌ను ఎంపిక చేసుకుంటే తాజ్ హోటల్లో నివసించే ఛాన్స్ మీ సొంతం, గుడ్ లక్' అని ప్రత్యక్షమవుతుంది. మళ్లీ ఓకే నొక్కగానే అక్కడ చిన్న ప్రశ్నలేవో అడుగుతుంది. వాటికి సమాధానం చెప్పిన వెంటనే స్క్రీన్ మీద పన్నెండు గిఫ్ట్ బాక్సులు ప్రత్యక్షమవుతాయి. వీటిలో ఏదైనా క్లిక్ చేసినప్పుడు గిఫ్ట్ కార్డు గెలుచుకున్నారే అనుకోండి. దాన్ని ఓ ఐదు వాట్సాప్ గ్రూపులకు లేదా 20 మందికి షేర్ చేయమని అడుగుతుంది. అవన్నీ పూర్తి చేశాక కథ మళ్లీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇదో ఫేక్ మెసేజ్. ఈ వైరల్ మెసేజ్‌పై తాజ్ హోటల్ స్పందిస్తూ ప్రేమ జంటల కోసం తాము ఎలాంటి గిఫ్ట్ కార్డులు పంపించడం లేదని స్పష్టం చేసింది. కాబట్టి మీకు కనక ఆ మెసేజ్ ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే తాజ్ హోటల్లో ఏడు రోజులు ఉచితంగా గడపొచ్చని కలల్లో తేలిపోకండి. అదంతా ఓ మోసమని ఇతరులకు తెలియజేయండి. (చదవండి: దంపతుల డ్యాన్స్.. మనసు దోచేయడం ఖాయం) -
సెలెక్ట్ మొబైల్స్ ‘గ్రాండ్ వాలంటైన్స్ డే ఆఫర్స్’
హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్ రిటైల్ కంపెనీ సెలెక్ట్ మొబైల్స్ గ్రాండ్ వాలంటైన్స్ డే ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ సీఎండీ వై గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్ మొబైల్ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభ్యమవుతాయని పేర్కొన్నారు. రూ.25,500 విలువ చేసే శాంసంగ్ ఏ6 కేవలం రూ.8,999లకు, రూ.8,999 విలువ చేసే 4జీ మొబైల్ రూ.3,999లకు, రూ.6,999 విలువ చేసే స్మార్ట్‌ఫోన్ రూ.3,999లకు వంటి రకరకాల ఆఫర్లున్నాయని తెలిపారు. -
వాలెంటైన్స్ డే: శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు
వాలెంటైన్స్ డే సమీపిస్తున్న తరుణంలో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఈ కోవలో దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ చేరిపోయింది. ‘బెస్ట్ డేస్ పేరు’ స్పెషల్ సేల్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా గెలాక్సీ నోట్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్ఫోన్లపై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, బండిల్ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ నోట్ 9 గెలాక్సీ నోట్ 9 (8 జీబీ ర్యామ్+ 512 జీబీ స్టోరేజ్) రూ.77,900లకు లభ్యం. దీని ఎంఆర్పీ రూ.84,900. రూ.7,000 క్యాష్‌బ్యాక్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారా కొనుగోలు చేస్తే రూ.8,000 క్యాష్‌బ్యాక్ అదనం. అంతేకాదు.. అప్‌గ్రేడ్ ఆఫర్ కింద ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో అదనంగా రూ.9,000 తగ్గింపు పొందొచ్చు. దీంతో మొత్తంగా గెలాక్సీ నోట్ 9 ధర భారీగా దిగి వచ్చింది. 8 జీబీ ర్యామ్/512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.68,900లకు అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్ రూ.58,900కు లభ్యం. 512 జీబీ, 286 జీబీస్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికే అతి తక్కువ ధరకే అందిస్తోంది. 42ఎంఎం గెలాక్సీ వాచ్ రూ.9,999లకు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.24,990. గెలాక్సీ ఎస్9 ప్లస్ 64 జీబీ వేరియంట్ ధరను రూ.7వేల తగ్గింపుతో రూ.57,900లకు దిగి వచ్చింది. 128 జీబీ మోడల్ ధర రూ.61,900. ఎంఆర్పీ రూ.68,900 256 జీబీ వేరియంట్ ధర రూ.65,900లకు లభ్యం. దీని అసలు ధర రూ.72,900 అలాగే ఈ ఫోన్‌పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులు రూ.6,000 క్యాష్‌బ్యాక్ అదనంగా ఆఫర్ చేస్తోంది. లేదా ఎక్స్జేంజ్ ఆఫర్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్‌పై కూడా రూ.9,000 అప్‌గ్రేడ్ బోనస్ పొందొచ్చు. -
విస్తారా వాలెంటైన్స్ డే సేల్
సాక్షి, ముంబై : వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని విస్తారా ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.899కే విమాన టికెట్లను అందిస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ సేల్ లో ప్రీమియం, ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్లపై 80శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు తెలిపింది. రేపు( ఫిబ్రవరి 13) అర్థర్రాతి తరువాత ఈ సేల్ ముగియనుంది. అన్ని రకాల ట్యాక్సులు కలిపి ప్రారంభ ధర కింద రూ.899కే టికెట్ లభిస్తుందని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక వైపు ప్రయాణానికి మాత్రమే. ఇలా బుక్ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 27నుంచి సెప్టెంబరు 18వరకు ప్రయాణించవచ్చు. బాగ్దోగ్రా, గువహటి మధ్య రూ.899, ప్రీమియం కేటగిరీలో ఢిల్లీ -ముంబై మధ్య రూ.2599 మాత్రమే నని తెలిపింది. వీటితోపాటు ఇతర ప్రాంతాలకు కూడా తక్కువ ధరల్లోనే విమాన ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. Don't miss the Vistara Valentine’s Day Sale! Book your tickets now and enjoy discounts of up to 80%, with fares starting at ₹899/- all inclusive. Hurry, limited seats available. Visit https://t.co/XlzoThWX1m pic.twitter.com/P3fIadX1XF — Vistara (@airvistara) February 12, 2019 -
'ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్స్' : 80 శాతం డిస్కౌంట్స్
దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్ల వెల్లువ ప్రారంభించబోతుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'ది ఫ్లిప్‌హార్ట్ డే' సేల్ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. సర్ప్రైజ్లతో రోజంతా అలరించనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 14 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనుంది. యూజర్లు ఎవరైతే 'ది ఫ్లిప్‌హార్ట్ డే' ఆఫర్లో సైన్-అప్ అవుతారో వారికి వస్త్రాలు, బ్యూటీ, యాక్ససరీస్, హోమ్ డెకర్లపై 14 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఒకవేళ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, టాబ్లెట్లు, ఇతర యాక్ససరీస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి, 80 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే డిస్కౌంట్లు ఆఫర్ చేసే ఉత్పత్తుల పేర్లను మాత్రం కంపెనీ రివీల్ చేయలేదు. మొబైల్ ఫోన్లపై కూడా 'గ్రేట్ డీల్స్' ఉంటాయని పేర్కొంది. ఈ కేటగిరీ ఉత్పత్తుల పేర్లను కూడా వెల్లడించలేదు. బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్, బుక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లనుపొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. టీవీ, హోమ్ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు, ఫర్నీచర్, డెకర్, ఫర్నీషింగ్ వాటిపై 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. కనీసం 40 శాతం, 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లతో 'ఫెంటాస్టిక్ డీల్స్' ను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. -
వాలెంటైన్స్ డేకి కంపెనీలు స్పెషల్ ఆఫర్లు
వాలెంటైన్స్ డే సందర్భంగా ఆన్లైన్ మార్కెట్ సంస్థలు, ప్రొడక్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లతో వినియోగదారులు ముందుకొచ్చాయి. ఆపిల్, మోటోరోలా, శాంసంగ్, అమెజాన్ వంటి కంపెనీలు క్యాష్ బ్యాక్, ఉచిత మూవీ టిక్కెట్ ఆఫర్లతో వినియోగదారులను మురిపిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీతో జతకట్టిన ఆపిల్, ఐఫోన్ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐఫోన్ 5ఎస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ క్యాష్ బ్యాక్ కస్టమర్ అకౌంట్లోకి అదేరోజు లేదా కొనుగోలు చేసిన 90రోజుల్లో క్రెడిట్ కానున్నాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 14 వరకే అందుబాటులో ఉండనుంది. తర్వాత ఐఫోన్ 5ఎస్ కొనుగోలు చేసిన వారికి ఇది వర్తించదు. కేవలం హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపైనే కాకుండా మిగతా బ్యాంకు కార్డులపై కూడా ఆపిల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. అయితే మిగతా బ్యాంకు కార్డుదారులకు రూ.2000లనే ఆఫర్ చేయనుంది. ఈ బ్యాంకుల్లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టెడ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, యస్ బ్యాంకులు దీనిలో ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా తన ప్రొడక్ట్లన్నింటిపై కపుల్ పీవీఆర్ టిక్కెట్లను అందిస్తోంది. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో మోడ్స్, మోటో ఎం, మోటో జే4 ప్లే, మోటో ఈ3 పవర్, మోటో ఎక్స్ ఫోర్స్‌లను ఫిబ్రవరి 14కు ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేస్తే ఈ టిక్కెట్లను పొందవచ్చు. లీ ఎకో కూడా మరో సేల్‌ను ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం మధ్యలో లీమాల్.కామ్‌లో తమ స్మార్ట్‌టీవీ సూపర్3 ఎక్స్55 ఆల్ట్రా హెచ్డీవీని కొనుగోలు చేసిన వారికి అన్ని డెబిల్, క్రెడిట్ కార్డులపై రూ.4000 క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. మరో రూ.1500 నగదు బహుమతిని గెలుచుకునే ఆఫర్ ను అందిస్తోంది.