
ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్స్ (ప్రతీకాత్మక చిత్రం)
దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్ల వెల్లువ ప్రారంభించబోతుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'ది ఫ్లిప్‌హార్ట్ డే' సేల్ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. సర్‌ప్రైజ్‌లతో రోజంతా అలరించనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 14 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనుంది. యూజర్లు ఎవరైతే 'ది ఫ్లిప్‌హార్ట్ డే' ఆఫర్‌లో సైన్-అప్ అవుతారో వారికి వస్త్రాలు, బ్యూటీ, యాక్ససరీస్, హోమ్ డెకర్‌లపై 14 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఒకవేళ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, టాబ్లెట్లు, ఇతర యాక్ససరీస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి, 80 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే డిస్కౌంట్లు ఆఫర్ చేసే ఉత్పత్తుల పేర్లను మాత్రం కంపెనీ రివీల్ చేయలేదు. మొబైల్ ఫోన్లపై కూడా 'గ్రేట్ డీల్స్' ఉంటాయని పేర్కొంది. ఈ కేటగిరీ ఉత్పత్తుల పేర్లను కూడా వెల్లడించలేదు. బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్, బుక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లనుపొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. టీవీ, హోమ్ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు, ఫర్నీచర్, డెకర్, ఫర్నీషింగ్ వాటిపై 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. కనీసం 40 శాతం, 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లతో 'ఫెంటాస్టిక్ డీల్స్' ను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment