Flipkart Big Bachat Dhamaal Sale: Deals on smartphones like Google Pixel 7a, iPhone 14 and more - Sakshi
Sakshi News home page

Flipkart Big Bachat Dhamaal Sale: స్మార్ట్‌ఫోన్లపై సూపర్‌ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్స్‌!

Published Sat, May 20 2023 5:51 PM | Last Updated on Sat, May 20 2023 6:05 PM

flipkart bigbachat dhamal sale - Sakshi

Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బచత్ డమాల్ సేల్ మళ్లీ వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్లపై సూపర్‌ డిస్కౌంట్లు నడుస్తున్నాయి.  ఈ సేల్ మే 19న ప్రారంభమైంది.  మే 21 వరకు కొనసాగుతుంది. గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ (Google Pixel 7a), ఐఫోన్‌ 14 (iPhone 14)తో పాటు కొత్తగా లాంచ్‌ అయిన మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. స్మార్ట్‌ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర గాడ్జెట్‌లపై సూపర్‌ డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్‌ అయిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్లపై ఈ సేల్‌లో ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేయండి..

ఇదీ చదవండి: Redmi A2 Series: రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్‌ఫోన్లు.. లాంచ్‌ చేసిన షావోమీ

గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ
కొత్తగా లాంచ్‌ అయిన గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ (Google Pixel 7a) ధర రూ. 43,999లుగా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ల ఎక్స్చేంజ్‌ ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపు లభిస్తుంది. గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ 6.1అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఉంది. Tensor G2 SoC చిప్‌తో జోడించారు.

ఐఫోన్ 14
యాపిల్‌ ఐఫోన్‌ 14 (Apple iPhone 14) 128 GB వేరియంట్‌ రూ. 69,999 వద్ద లభిస్తుంది . హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్‌ వస్తుంది. ఇక పాత స్మార్ట్‌ఫోన్‌ల ఎక్స్ఛేంజ్‌పై రూ. 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల  సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది . Apple A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. 

ఒప్పో రెనో 8 ప్రో 5G
ఒప్పో రెనో (OPPO Reno) 8 Pro 5G (12 జీబీ ర్యామ్‌, 256 జీబీ రోమ్‌) ఫోన్‌ను రూ. 45,999లకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని వాడుకుంటే 10 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్‌ ఉన్న ఈ ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది.

ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23.. ధర ఎంతంటే..

వివో T1X 
వివో (Vivo) T1X ఫోన్‌  4GB ర్యామ్‌,  128GB రోమ్‌ వేరియంట్‌ ఫ్లిప్‌ కార్ట్‌ ఆఫర్‌ సేల్‌లో రూ. 12,999 కే లభిస్తుంది. మరోవైపు కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇక పాత ఫోన్‌ల ఎక్స్చేంజ్‌పై గరిష్టంగా రూ. 12,450 లభిస్తుంది.

పోకో F5 5G
ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో పోకో (Poco) F5 5G ఫోన్‌ 8GB వేరియంట్‌ రూ. 29,999లకు లభిస్తోంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే,  Qualcomm Snapdragon 7+ Gen2 చిప్‌సెట్‌ ఉన్నాయి.

కొత్తగా లాంచ్‌ అయిన స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, వాటిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు సాక్షి బిజినెస్‌ పేజీని చూడండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement