ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌: ‍ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు | Big Discounts on Flipkart Big Diwali sale | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ : స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు

Published Thu, Nov 1 2018 12:41 PM | Last Updated on Thu, Nov 1 2018 1:07 PM

Big Discounts on Flipkart Big Diwali sale - Sakshi

సాక్షి, ముంబై: రానున్న దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దివాలీసేల్‌ను ప్రారంభించింది. నేటి (గురువారం,నవంబరు 1) నుంచి అయిదురోజుల పాటు నవంబరు 5 దాకా వివిధ ఉత్సత్తులపై భారీ  డిస్కౌంట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ఎస్‌బీఐ   క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10శాతం తగ్గింపు.  రెడ్‌మి నోట్‌ 5 ప్రొ, పోకో ఎఫ్‌ 1, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ : 2 వేల రూపాయల తగ్గింపుతో రూ. 12,999 లకే లభ్యం. 
పోకో ఎఫ్‌1: షావోమి సబ్‌బ్రాండ్‌ తీసుకొచ్చిన పోకో ఎఫ్‌1 (6జీబీ/128 జీబీ స్టోరేజ్‌) పై 3వేల రూపాయల డిస్కౌంట్‌. రూ.21.999లకు అందుబాటులో ఉంది. పోకో ఎఫ్‌ 1 (8జీబీ/1256 జీబీ స్టోరేజ్‌)  4వేల  రూపాయల తగ్గింపు అనంతరం  రూ.26,999 లభిస్తోంది. 
గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ ఎల్‌: రూ. 5499 డిస్కౌంట్‌తో  40,999లకే అందిస్తోంది. దీనికి అదనంగా ఎస్‌బీఐకార్డుపై 10శాతం డిస్కౌంట్‌ కలుపుకుని ఈ సేల్‌ లో ఫ్లిప్‌కార్ట్‌ రూ. 36,999ల​కే అందిస్తోంది.  
హానర్  9 ఎన్‌: 4వేల రూపాయల తగ్గింపుతో  9999 రూపాయలకు లభ్యం.

వీటితోపాటు హానర్‌10, ఆసుస్‌జెన్‌ ఫోన్లపై కూడా డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇంకా టీవీలు, ఎలక్రానిక్స్‌ ఉత్పత్తులు, ఫర్నిచర్‌పై  80శాతంగా దాకా తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement