ఫ్లిప్‌హార్ట్‌ సేల్‌..రెడ్‌ మి నోట్‌5 గెలుచుకోవచ్చు | Flipkart to sell smartphones, gadgets at 14 per cent discount on Valentine's Day | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌హార్ట్‌ సేల్‌..రెడ్‌ మి నోట్‌5 గెలుచుకోవచ్చు

Published Tue, Feb 13 2018 6:15 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

Flipkart to sell smartphones, gadgets at 14 per cent discount on Valentine's Day - Sakshi


సాక్షి,ముంబై:  ఇపుడు ఎక్కడ చూసినా వాలెంటైన్స్‌ డే ఫీవర్‌ కనిపిస్తోంది. ఈకామర్స్‌  దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ 'ది ఫ్లిప్‌హార్ట్ డే'  పేరుతో స్పెషల్‌ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న స్మార్ట్‌ఫోన్లపై 14శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్పెషల్‌ సేల్‌ ఫిబ్రవరి 14 అర్థరాత్రినుంచి   ప్రారంభం కానుంది. అంతేకాదు షావోమి  లాంచ్‌ చేయనున్న రెడ్‌మి నోట్‌ 5ను ఉచితంగా అందుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. 

స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గాడ్టెట్‌లపైనా 14శాతం రాయితీ ఆఫర్‌ చేస్తోంది. అలాగే దుస్తులు, పాదరక్షలు, ఇతర ఉపకరణాలు, సౌందర్య ఉత్పత్తులు, బొమ్మలు, గేమ్స్‌, పుస్తకాలపై  80 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తుంది.  ఫర్నిచర్, ల్యాప్‌టాప్స్‌, కెమెరా  తదితరాలపై  40 నుండి 80 శాతందాకా డిస్కౌంట్. టీవీలు, ఇతర గృహోపకరణాలపై కొనుగోలుదారులు 70 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

గివ్‌ మీ5 హ్యష్‌ట్యాగ్‌ ద్వారా  రెడ్‌మీ ఫోన్‌ను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు రెడ్‌మి నోట్‌ 5ను ఫిబ్రవరి 14న  లాంచ్‌  చేయనుంది అంచనా. ఇండియాలోనెం.1 బ్రాండ్‌స్మార్ట్‌ ఫోన్‌ను తమ వెబ్‌సైట్‌లో లాంచ్‌ చేయనున్నామన్న  ప్రకటనతో.. అది రెడ్‌ మి నోట్‌ 5  కావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు వినియోగదారులు ఫ్రీ గిఫ్ట్‌లను గెలుచుకునేందుకు ప్రత్యేకమైన యాప్‌ గేమ్స్‌ నిర్వహిస్తోంది.

గత కొన్ని దశాబ్దాలుగా కస్టమర్లే తమకు బలమైన మూలస‍్థంభాలుగా నిలుస్తున్నారని, వారి ప్రేమతోనే ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌లీడర్‌గా ఎదిగిందని సీనియర్‌ డైరెక్టర్‌ స్మృతి రవిచంద్రన్  పేర్కొన్నారు. వారి ప్రేమను  మరింత గెలుచుకోవడానికి , ఫ్లిప్‌హార్ట్‌  సేల్స్‌ ద్వారా   ప్రేమికుల రోజున  తమ కస్టమర్లకు మంచి అనుభూతినివ్వాలని భావిస్తున్నామన్నారు. ఈ ఆఫర్లు కేవలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు వినియోగదారులకు మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement