
యాపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. దివాళీ సేల్‌లో భాగంగా ఐఫోన్‌లను డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.69,990 ఉండగా రూ.59,990కే అందిస్తుంది. ఇక 256జీబీ, 512జీబీ ఫోన్‌ల ధరల్ని సైతం తగ్గించింది.
ఐఫోన్ కొనుగోలుదారులు ఎస్‌బీఐ, కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగిస్తే రూ.1250 అదనంగా ఆఫర్‌ను పొందవచ్చు. దీంతో పాటు యూజర్లు ఎక్స్ఛేంజ్ డీల్ కింద రూ 16,990 వరకూ పొందుతారు.
ఐఫోన్ 13 ఫీచర్లు
యాపిల్ సంస్థ ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో ఐఫోన్ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ల ఫీచర్ల విషయానికొస్తే.. ఫోన్‌ల వెనుకవైపు అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్‌సెట్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
ఐఫోన్ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment