సాక్షి,ముంబై: వాలెంటైన్స్ డే సందర్భంగా టెలికాం దిగ్గజం ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. అదనపు డేటాతో మరికొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. ముఖ్యంగా డిస్కౌంట్ కూపన్‌లు ,ఫెర్న్ & పెటల్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్‌ల నుండి ఆఫర్ ఉన్నాయి.
జియో వాలెంటైన్ ఆఫర్
♦ రూ. 121 విలువైన అదనపు డేటా యాడ్-ఆన్ (12 జీబీ డేటా).
♦ రూ. 1,000 విలువైన ప్రత్యేక తగ్గింపు వోచర్లు.
♦ ఫెర్న్ & పెటల్స్ రూ. 799 కొనుగోలుపై రూ. 150 తగ్గింపు.
♦ మెక్‌డొనాల్డ్స్ - రూ. 199 కొనుగోలుపై రూ. 105 తగ్గింపు (సౌత్ & వెస్ట్ రీజియన్ మాత్రమే).
♦ ఇక్సిగో - రూ. 4,500 విమాన బుకింగ్‌పై రూ. 750 తగ్గింపు.
ఈ ఆఫర్‌ను పొందడానికి, “కూపన్ కోడ్‌ల వివరాల కోసం మై జియో యాప్లో కూపన్‌లు & విన్నింగ్‌లు” ట్యాబ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. రూ. 349, రూ.899 రూ. 2999 రీఛార్జ్‌పై జియో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం, ఫిబ్రవరి 10న లేదా తర్వాత పైన పేర్కొన్న రీఛార్జ్‌ని చేస్తే అదనపు 12జీబీ 4జీ డేటా కూపన్‌కు అర్హులు. అలాగే రూ. 2999 ప్లాన్‌తో, అయితే, పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో పాటు, కస్టమర్‌లు 75జీబీ అదనపు డేటాతో పాటు 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా పొందుతారు. అంటే రూ. 2399 ప్లాన్‌తో అందించే మొత్తం అదనపు డేటా 87జీబీ అన్నట్టు.
Comments
Please login to add a commentAdd a comment