సాక్షి, ముంబై: వాలెండైన్స్ డే అంటేనే బిజినెస్ వర్గాలకు సందడి. వాలెండైన్స్ డే డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ఆఫర్స్‌ను అందిస్తుంటాయి. అందులోనూ ఐఫోన్ల మీద తగ్గింపు అంటే ప్రేమికులు ఎగబడరూ! ఈ క్రేజ్ నేపథ్యంలో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపుధరలు అందుబాటులో ఉన్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ ఫోనలపై 12,195 దాకా తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ కార్డ్‌లపై తక్షణ తగ్గింపులతో పాటు తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కలిగి ఉన్నాయని గమనించాలి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14పై 6వేలు, ఐ ఫోన్ 14 ప్లస్‌పై 7వేల దాకా తక్షణ డిస్కౌంట్ లభ్యం.
ఐఫోన్ 14: ఐఫోన్ 14 ఇపుడు రూ. 67,705లకే కొనుగోలు చేయవచ్చు.
గత సెప్టెంబర్‌లో లాంచింగ్ ధర రూ. 79,900
ఐఫోన్ 14 ప్లస్: ఐఫోన్ 14 ప్లస్ రూ. రూ. 84,900
గత సెప్టెంబర్‌లో దీని లాంచింగ్ ధర రూ. 89,900
ప్రో మోడల్స్‌పై కూడా ఆఫర్
అలాగే ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పై డిస్కౌంట్ అందుబాటులోఉంది. రూ. 129,900వద్ద లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రోను ఈ సేల్‌లో రూ. 1,25,400కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ. 1,35,400కే లభ్యం. అసలు ధర రూ. 139,900
ఇతర ఉత్పతులపై కూడా ఫిబ్రవరి 28 వరకూ సేల్!
ఈ సేల్, తగ్గింపు ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఈ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఇతర ఉత్పత్తులపై కూడా తగ్గింపు లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment