
వాలెంటైన్స్ డే సమీపిస్తున్న తరుణంలో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఈ కోవలో దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ చేరిపోయింది. ‘బెస్ట్ డేస్ పేరు’ స్పెషల్ సేల్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా గెలాక్సీ నోట్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, బండిల్ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.
గెలాక్సీ నోట్ 9
గెలాక్సీ నోట్ 9 (8 జీబీ ర్యామ్+ 512 జీబీ స్టోరేజ్) రూ.77,900లకు లభ్యం. దీని ఎంఆర్‌పీ రూ.84,900. రూ.7,000 క్యాష్‌బ్యాక్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారా కొనుగోలు చేస్తే రూ.8,000 క్యాష్‌బ్యాక్ అదనం. అంతేకాదు.. అప్‌గ్రేడ్ ఆఫర్ కింద ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో అదనంగా రూ.9,000 తగ్గింపు పొందొచ్చు. దీంతో మొత్తంగా గెలాక్సీ నోట్ 9 ధర భారీగా దిగి వచ్చింది.
8 జీబీ ర్యామ్/512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.68,900లకు అందుబాటులో ఉంది.
6 జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్ రూ.58,900కు లభ్యం.
512 జీబీ, 286 జీబీస్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికే అతి తక్కువ ధరకే అందిస్తోంది. 42ఎంఎం గెలాక్సీ వాచ్ రూ.9,999లకు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.24,990.
గెలాక్సీ ఎస్9 ప్లస్
64 జీబీ వేరియంట్ ధరను రూ.7వేల తగ్గింపుతో రూ.57,900లకు దిగి వచ్చింది.
128 జీబీ మోడల్ ధర రూ.61,900. ఎంఆర్‌పీ రూ.68,900
256 జీబీ వేరియంట్ ధర రూ.65,900లకు లభ్యం. దీని అసలు ధర రూ.72,900
అలాగే ఈ ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులు రూ.6,000 క్యాష్‌బ్యాక్ అదనంగా ఆఫర్ చేస్తోంది. లేదా ఎక్స్జేంజ్ ఆఫర్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్‌పై కూడా రూ.9,000 అప్‌గ్రేడ్ బోనస్ పొందొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment