వాలెంటైన్స్ డేకి కంపెనీలు స్పెషల్ ఆఫర్లు
వాలెంటైన్స్ డేకి కంపెనీలు స్పెషల్ ఆఫర్లు
Published Mon, Feb 13 2017 1:45 PM | Last Updated on Thu, Aug 9 2018 7:20 PM
వాలెంటైన్స్ డే సందర్భంగా ఆన్లైన్ మార్కెట్ సంస్థలు, ప్రొడక్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లతో వినియోగదారులు ముందుకొచ్చాయి. ఆపిల్, మోటోరోలా, శాంసంగ్, అమెజాన్ వంటి కంపెనీలు క్యాష్ బ్యాక్, ఉచిత మూవీ టిక్కెట్ ఆఫర్లతో వినియోగదారులను మురిపిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీతో జతకట్టిన ఆపిల్, ఐఫోన్ 5ఎస్ స్మార్ట్ఫోన్పై డిస్కౌంట్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐఫోన్ 5ఎస్ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ.6000 క్యాష్బ్యాక్ను అందించనున్నట్టు తెలిపింది. ఈ క్యాష్ బ్యాక్ కస్టమర్ అకౌంట్లోకి అదేరోజు లేదా కొనుగోలు చేసిన 90రోజుల్లో క్రెడిట్ కానున్నాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 14 వరకే అందుబాటులో ఉండనుంది. తర్వాత ఐఫోన్ 5ఎస్ కొనుగోలు చేసిన వారికి ఇది వర్తించదు.
కేవలం హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపైనే కాకుండా మిగతా బ్యాంకు కార్డులపై కూడా ఆపిల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. అయితే మిగతా బ్యాంకు కార్డుదారులకు రూ.2000లనే ఆఫర్ చేయనుంది. ఈ బ్యాంకుల్లో అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టెడ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, యస్ బ్యాంకులు దీనిలో ఉన్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా మరో స్మార్ట్ఫోన్ కంపెనీ మోటోరోలా తన ప్రొడక్ట్లన్నింటిపై కపుల్ పీవీఆర్ టిక్కెట్లను అందిస్తోంది. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో మోడ్స్, మోటో ఎం, మోటో జే4 ప్లే, మోటో ఈ3 పవర్, మోటో ఎక్స్ ఫోర్స్లను ఫిబ్రవరి 14కు ముందు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేస్తే ఈ టిక్కెట్లను పొందవచ్చు. లీ ఎకో కూడా మరో సేల్ను ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం మధ్యలో లీమాల్.కామ్లో తమ స్మార్ట్టీవీ సూపర్3 ఎక్స్55 ఆల్ట్రా హెచ్డీవీని కొనుగోలు చేసిన వారికి అన్ని డెబిల్, క్రెడిట్ కార్డులపై రూ.4000 క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. మరో రూ.1500 నగదు బహుమతిని గెలుచుకునే ఆఫర్ ను అందిస్తోంది.
Advertisement
Advertisement