
వాలంటైన్ డే సందర్భంగా స్మార్ట్‌ఫోన్లపై ఈ కామర్స్ సైట్లు కళ్లు చెదిరే ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అయితే ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్‌ను ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 12మినీ, యాపిల్ ఐఫోన్ 14 ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.59,999 వేలు ఉండే ఐఫోన్ 12మినీ ఫోన్‌ను రూ.21,999లకు, రూ.79,900 ఉన్న ఐఫోన్ 14ను రూ.44,999లకే సొంతం చేసుకోవచ్చు.
యాపిల్ ఐఫోన్ 12మినీ ధర ప్రస్తుతం రూ.59,999. కానీ ఫ్లిప్‌కార్ట్ వాలంటైన్ డే సేల్‌లో దీని ధర రూ.41,999. అంతేకాకుండా కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్‌పై అత్యధికంగా రూ.20,000 డిస్సౌంట్ అందిస్తోంది. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటే యాపిల్ ఐఫోన్ 12మినీ ఫోన్ మీకు రూ.21,999కే లభిస్తుందన్న మాట.
అలాగే యాపిల్ ఐఫోన్ 14 ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా రూ.34,901 భారీ తగ్గింపు ఉంది. అంటే ఈ ఫోన్ కేవలం రూ.44,999లకే లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 13,901 తగ్గింపు తర్వాత రూ.65,999 ఉన్నప్పటికీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌డీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా 10 శాతం గరిష్టంగా రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక పాత స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్‌పై అత్యధికంగా రూ.20,000 డిస్సౌంట్ కలుపుకొంటే ఐఫోన్ 14ను కేవలం రూ.44,999కే కొనుక్కోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment