Valentine's Day 2023: Paytm cashback offer, check details - Sakshi
Sakshi News home page

Valentines day 2023:పేటీఎం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ చూశారా..!

Published Tue, Feb 14 2023 3:16 PM | Last Updated on Tue, Feb 14 2023 4:20 PM

Valentines day 2023 Paytm cash back award check details - Sakshi

సాక్షి,ముంబై: వాలెంటైన్‌ డే సందర్బంగా పేమెంట్‌ సంస్థ పేటీఎం లవర్స్‌కు వాలెంటైన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ప్రకటించింది రూ.140 దాకా  క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు ఈ  ఆఫర్‌ అందిస్తోంది. ఈ చెల్లింపుల ద్వారా  ఒక్కొక్కటి మూడు చొప్పున  మూడు రకాల  కార్డులను అందిస్తోంది. లవ్‌ అండ్‌ ఎఫెక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, డిన్నర్ కార్డ్ పేరుతో ఉన్న ఈ తొమ్మిది కార్డ్‌లను సేకరించిన తర్వాత, వినియోగదారులు రూ. 140 విలువైన 14,000 పేటీఎం క్యాష్‌బ్యాక్ పాయింట్‌లను పొందుతారు.

ఈ ఆఫర్ ఫిబ్రవరి 20 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌లను పొందాలంటే పేటీఎంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు డబ్బులు స్వీకరించినా, డబ్బును బదిలీ చేసినా, మొబైల్‌కి రీఛార్జ్,  యుటిలిటీ బిల్లులను చెల్లించినప్పుడు పాయింట్లను సంపాదించవచ్చు నన్న సంగతి తెలిసిందే. 

వాలెంటెన్స్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ పొందాలంటే
పేమెంట్‌ తరువాత పేటీఎం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌పై క్లిక్‌ చేయండి 
క్రిందికి స్క్రోల్ చేసి, 14వేల క్యాష్‌బ్యాక్ పాయింట్ల బ్యానర్‌లో ప్లే అండ్‌  విన్ నొక్కండి.
ఇలా వచ్చిన మొత్తం 9 తొమ్మిది కార్డ్‌లను  స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది.
వినియోగదారులు స్నేహితులనుంచి అదనపు కార్డ్‌ను తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు.
అన్‌లాక్ చేయకుంటే స్క్రాచ్ కార్డ్‌లు స్వీకరించిన 3 రోజుల తర్వాత పనికిరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement