వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై మరో సేల్‌కి సిద్దమైంది. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అని పిలిచే అమెజాన్ కొత్త సేల్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో ఈ-కామర్స్ దిగ్గజం కొనుగోలుదారులకు ఎస్‌బీఐ, మాక్స్ క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐతో పాటు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ & ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 వరకు స్మార్ట్‌ఫోన్ ఉపకరణాలపై మేడ్ ఫర్ ఈచ్ అదర్ డీల్‌లను పొందవచ్చు.
వాలెంటైన్స్ డే డీల్‌లో బడ్జెట్ ఫోన్‌లైన రెడ్‌మీ10 పవర్, రెడ్‌మీ 10ఏ, రెడ్‌మీ ఏ1లపై ఫెడరల్ బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తుంది. వీటి ధరలు రూ. 10,749, రూ. 7,862, రూ. 6,499 నుండి అందుబాటులో ఉన్నాయి.
మరో స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్‌లపై ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఆఫర్లు పొందవచ్చు. గెలాక్సీ ఎం13, గెలాక్సీ ఎం 33, గెలాక్సీ ఎం04 లను వరుసగా రూ. 8,699, రూ. 13,999, రూ. 7,499కి కొనుగోలు చేయొచ్చు. అదనంగా, ఈ ఫోన్‌లపై 3 లేదా 6 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు.
ఐక్యూ లేటెస్ట్ 5జీ ఫోన్‌లను సైతం అమెజాన్ ఈ సేల్‌లో విక్రయానికి పెట్టింది. ఐక్యూ జెడ్6 5జీ, ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ, ఐక్యూ నియో 6 5జీలను రూ. 14,499, రూ. 11,999, రూ. 24,990లలో పొందవచ్చు. ఎస్‌బీఐ, ఫెడరల్ బ్యాంక్‌లు డిస్కౌంట్‌లు ఇస్తున్నాయి.
ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సందర్భంగా టెక్నో ఫోన్‌లపై భారీ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. 4జీబీ ర్యాబ్, 64జీబీ స్టోరేజ్, 13 ఎంపీ, ఏఐ మోడ్‌తో వచ్చే టెక్నో స్పార్క్ 9 రూ. 7,019 నుండి అందుబాటులో ఉండగా.. టెక్నో పాప్ 6 ప్రో ఎస్‌బీఐ, ఫెడరల్ బ్యాంక్ నుండి డిస్కౌంట్లతో రూ. 5,399కి కూడా అందుబాటులో ఉంది.
ఈ ప్రత్యేక సెల్‌లో రియల్‌మీ 50 సిరీస్‌పై కస్టమర్‌లు అద్భుతమైన ఆఫర్‌లను పొందవచ్చు. రియల్‌మీ 50ఐ ప్రైమ్, రియల్‌మీ 50ఏ ప్రైమ్ ధరలు వరుసగా రూ. 6,299, రూ. 8,999ఉన్నాయి. వీటిపై 3 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90హెచ్‌జెడ్ డిస్‌ప్లేతో కూడిన రియల్‌మీ 50 5జీ ఫోన్‌పై 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో రూ. 12,999కి అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment