
మీరు ఇటీవల కాలంలో ఈకామర్స్ సంస్థలు నిర్వహించిన స్పెషల్ సేల్స్‌ను మిస్సయ్యారా? అయితే మీకో బంపరాఫర్. ఈకామర్స్ సంస్థ అమెజాన్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. జులై 25 నుంచి ప్రారంభమమైన మొబైల్ సేవిండ్ డే సేల్స్‌ను జులై 29వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
జులై 25 నుంచి జులై 29 వరకు తాము నిర్వహిస్తున్న 'మొబైల్ సేవింగ్ డేస్ సేల్స్'లో వన్‌ప్లస్, షావోమీ, శాంసంగ్ ఎం13 సిరీస్,టెక్నో, ఒప్పో,రియల్‌మీ, వివోతో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ అమ్మకాలపై 40శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. పై వాటితో పాటు తాజాగా విడుదలైన రెడ్ మీ కే50ఐ 5జీ, శాంసంగ్ ఎం13 సిరీస్, టెక్నో స్పార్క్ 9, టెక్నో కామన్ 19నియో, ఐక్యూ నియో 6లపై కొనుగోలు దారులు ఆఫర్లతో పాటు డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.
డెబిట్/ క్రెడిట్ కార్డలపై ప్రత్యేక ఆఫర్లు
మొబైల్ సేవింగ్ డేస్ సేల్స్‌లో కొనుగోలు దారులు డెబిట్/ క్రెడిట్ కార్డలపై 10శాతం డిస్కౌంట్ పొందవచ్చని అమెజాన్ తెలిపింది. సిటీబ్యాంక్ కార్డ్‌పై మినిమం ట్రాన్సాక్షన్స్ రూ.5వేలు చేస‍్తే రూ.1000 డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ బరోడా కార్డ్‌పై మినిమం ట్రాన్సాక్షన్స్ రూ.7వేలు చేస్తే అదనంగా మరో రూ.1000డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు ఈరోజు (జులై27) మాత్రమే ప్రత్యేకంగా రూ.7,500 వరకు ట్రాన్సాక్షన్ చేస్తే రూ.2,500వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్, 12నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం అదనం.
ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు రూ.20వేలు ఆదా చేసుకునేలా 6నెలల వరకు ఫ్రీ స్క్రీన్ రిప్లెస్‌మెంట్, అదనంగా మరో 3నెలల పాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ, ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై అదనంగా కూపన్ కోడ్‌ను వినియోగించుకోవచ్చు.
యాపిల్ ఐఫోన్‌లపై బంపరాఫర్
ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 13,ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌పై రూ.10వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు.
వన్ ప్లస్ సిరీస్‌పై సైతం
వన్ ప్లస్ సిరీస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులు రూ.15వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం అమెజాన్ కల్పిచ్చింది. వన్ ప్లస్ 9సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 ఉండగా.. ఫోన్ కొనుగోలుపై అదనంగా ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, వన్ ప్లస్ 9 ప్రో పై రూ.5వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను దక్కించుకోవచ్చు.
ఈ ఫోన్‌లపై 53శాతం డిస్కౌంట్
అమెజాన్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ 5జీ ఫోన్‌పై 53శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. దీంతో పాటు శాంసంగ్ ఎం సిరీస్ రేంజ్‌పై అదనంగా ఆఫర్లు, ధరలు అత్యధికంగా ఉన్న ఫోన్‌లపై 30శాతం డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం 53, శాంసంగ్ గెలాక్సీ ఎం 33 పై రూ.9వేల వరకు ఆఫర్, లేటెస్ట్‌గా విడుదలైన శాంసంగ్ ఎం 13పై రూ.2వేల వరకు ఆఫర్ పొందవచ్చు. దీంతో పాటు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అమెజాన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment