exchange offers
-
బంపరాఫర్ : రూ.23వేల ఫోన్ రూ.10వేలకే సొంతం చేసుకోండిలా!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో సరికొత్త సేల్‌తో ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు జరిగే ఈ సేల్‌లో వైడ్ రేజ్ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్లపై 40 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్‌లో ఇటీవలే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ23పై బంపరాఫర్ ప్రకటించింది. రూ.10వేల కంటే ధరకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) తగ్గిన 5జీ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ ర్యామ్ అండ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ.23,990కే ఉండగా సేల్‌లో 27 శాతం డిస్కౌంట్‌తో రూ.17499కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కలుపుకుంటే రూ.16499కే సొంతం చేసుకోవచ్చు. చదవండి👉 అమెజాన్‌లో ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్! శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఎక్ఛేంజ్ ఆఫర్ పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద రూ.16300 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న ఫోన్ పనితీరు బాగుంటే శాంసంగ్ గెలాక్సీ ఏ23ని ఎక్ఛేంజ్ ఆఫర్, ఇతర బ్యాంక్ ఆఫర్లతో రూ.10వేలకే కొనుగోలు చేసే వెసలు బాటు కల్పించింది అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ఏ23లో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్- వీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 16జీబీ ర్యామ్, ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా వైడ్, డెప్త్, మ్యాక్రోలెన్సెస్లతో 50 ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో -
భారీ డిస్కౌంట్‌తో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ సేల్స్..ఓ లుక్కేయండి!
మీరు ఇటీవల కాలంలో ఈకామర్స్ సంస్థలు నిర్వహించిన స్పెషల్ సేల్స్‌ను మిస్సయ్యారా? అయితే మీకో బంపరాఫర్. ఈకామర్స్ సంస్థ అమెజాన్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. జులై 25 నుంచి ప్రారంభమమైన మొబైల్ సేవిండ్ డే సేల్స్‌ను జులై 29వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. జులై 25 నుంచి జులై 29 వరకు తాము నిర్వహిస్తున్న 'మొబైల్ సేవింగ్ డేస్ సేల్స్'లో వన్‌ప్లస్, షావోమీ, శాంసంగ్ ఎం13 సిరీస్,టెక్నో, ఒప్పో,రియల్మీ, వివోతో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ అమ్మకాలపై 40శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. పై వాటితో పాటు తాజాగా విడుదలైన రెడ్ మీ కే50ఐ 5జీ, శాంసంగ్ ఎం13 సిరీస్, టెక్నో స్పార్క్ 9, టెక్నో కామన్ 19నియో, ఐక్యూ నియో 6లపై కొనుగోలు దారులు ఆఫర్లతో పాటు డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. డెబిట్/ క్రెడిట్ కార్డలపై ప్రత్యేక ఆఫర్లు మొబైల్ సేవింగ్ డేస్ సేల్స్‌లో కొనుగోలు దారులు డెబిట్/ క్రెడిట్ కార్డలపై 10శాతం డిస్కౌంట్ పొందవచ్చని అమెజాన్ తెలిపింది. సిటీబ్యాంక్ కార్డ్‌పై మినిమం ట్రాన్సాక్షన్స్ రూ.5వేలు చేస్తే రూ.1000 డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ బరోడా కార్డ్‌పై మినిమం ట్రాన్సాక్షన్స్ రూ.7వేలు చేస్తే అదనంగా మరో రూ.1000డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు ఈరోజు (జులై27) మాత్రమే ప్రత్యేకంగా రూ.7,500 వరకు ట్రాన్సాక్షన్ చేస్తే రూ.2,500వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్, 12నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం అదనం. ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.20వేలు ఆదా చేసుకునేలా 6నెలల వరకు ఫ్రీ స్క్రీన్ రిప్లెస్మెంట్, అదనంగా మరో 3నెలల పాటు హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ, ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై అదనంగా కూపన్ కోడ్‌ను వినియోగించుకోవచ్చు. యాపిల్ ఐఫోన్లపై బంపరాఫర్ ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 13,ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌పై రూ.10వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. వన్ ప్లస్ సిరీస్‌పై సైతం వన్ ప్లస్ సిరీస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులు రూ.15వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం అమెజాన్ కల్పిచ్చింది. వన్ ప్లస్ 9సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 ఉండగా.. ఫోన్ కొనుగోలుపై అదనంగా ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, వన్ ప్లస్ 9 ప్రో పై రూ.5వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను దక్కించుకోవచ్చు. ఈ ఫోన్లపై 53శాతం డిస్కౌంట్ అమెజాన్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్‌పై 53శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. దీంతో పాటు శాంసంగ్ ఎం సిరీస్ రేంజ్‌పై అదనంగా ఆఫర్లు, ధరలు అత్యధికంగా ఉన్న ఫోన్లపై 30శాతం డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం 53, శాంసంగ్ గెలాక్సీ ఎం 33 పై రూ.9వేల వరకు ఆఫర్, లేటెస్ట్గా విడుదలైన శాంసంగ్ ఎం 13పై రూ.2వేల వరకు ఆఫర్ పొందవచ్చు. దీంతో పాటు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అమెజాన్ వెల్లడించింది. -
మహీంద్రా కార్లపై బంపరాఫర్, ఏకంగా రూ.80వేల వరకు డిస్కౌంట్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఫిబ్రవరి నెల వరకు పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌యూవీ300, స్కార్పియో, అల్ట్రాస్ జీ4, బొలెరో, మరాజో మోడళ్లపై డిస్కౌంట్లలో సొంతం చేసుకోవచ్చు. ►బొలెరో నియోపై ఆఫర్లు లేనప్పటికీ, బొలెరో ఎస్‌యూవీపై రూ.3వేల కార్పొరేట్ తగ్గింపు, రూ.15వేల వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.6వేల వరకు డిస్కౌంట్‌కే లభిస్తుంది. ►మరాజో మూడు వేరియంట్లలో ఆఫర్లో కొనుగోలు చేయోచ్చు. ఇందులో ఎం2,ఎం4 ప్లస్, ఎం6 ప్లస్ వేరియంట్లపై రూ.20,000 వరకు డిస్కౌంట్,రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్,రూ.5,200 కార్పొరేట్ ప్రయోజనాల్ని అందిస్తుంది. ►మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్ ఎస్యూవీ ఈ నెలలో రూ.30,003వరకు డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.4,000 వరకు కార్పొరేట్ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. రూ.10వేల వరకు ఇతర ఆఫర్లకే అందిస్తుంది. ►మహీంద్రా ఆల్ట్రాస్ జీ4పై భారీ డిస్కౌంట్‌కే అందిస్తుంది. ఎక్ఛేంజ్ బోనస్ రూ.50,000, రూ.11,500 వరకు కార్పొరేట్ తగ్గింపు, రూ.20,000 వరకు ఇతర అదనపు ఆఫర్లు ఉన్నాయి. ►ఇది కాకుండా స్కార్పియో రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.4,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు, రూ.15,000 వరకు ఇతర తగ్గింపులతో అందిస్తుంది. -
5జీ స్మార్ట్ ఫోన్ పై బంపరాఫర్, మరికొన్ని గంటలు మాత్రమే
5జీ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21వరకు 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' పేరుతో ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా 5జీ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42ను డిస్కౌంట్, భారీ ఎక్ఛేంజ్‌ను అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్‌లో ఫోన్ ధర రూ.20,999 ఉండగా డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా రూ. 3 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. తద్వారా రూ. 17,999కే స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు రూ.20,999 ఫోన్‌ను మీ పాత ఫోన్ పై రూ.15,450 భారీ ఎక్సేంజ్ ఆఫర్ తో సొంతం చేసుకోవచ్చు.అంటే ఫోన్ ను రూ.5,549కే కొనుగోలు చేయొచ్చు . శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫోన్ ఫీచర్లు ఈఫోన్ లో 5000ఏఎంహెచ్ బ్యాటరీ 6జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మీడియా టెక్ డైమన్షన్ 700 ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మాట్ బ్లాక్ వేరియంట్ కలర్లో అందుబాటులో ఉంది. చదవండి: రూ.30-40 వేల బడ్జెట్లో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే! -
ఈ ల్యాప్ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా..
ల్యాప్ ట్యాప్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాదు వీటితో పాటు అమెజాన్ సేల్‌లో కొత్తగా విడుదలైన వెయ్యికి పైగా కొత్త గాడ్జెట్స్‌పై ఆఫర్లను అందిస్తుంది. 'ఏసర్ స్విఫ్ట్ 3' ఫీచర్లు ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్‌ట్యాప్ 64బిట్,విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. 1920x1080పి రెజెల్యూషన్‌తో 14 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే,18జీబీ డీడీఆర్4 ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ, ఏఎండీ రైజెన్5 5500యూ హెక్సా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తుంది. హైక్వాలిటీ వీడియోల్ని రెండరింగ్ చేసేందుకు వీలుగా ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్, ఫాస్ట్‌గా డేటాను స్టోర్ చేసేందుకు ఎస్ఎస్డీ డ్రైవ్ కూడా ఉంది. వీటితో పాటు కలర్ కాంట్రాస్ట్ కోసం ఎల్ఈడీ బ్యాక్ కంఫైవ్యూ టెక్నాలజీని అందిస్తుంది.సెక్యూరిటీ పర్పస్ కోసం ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ,వాయిస్ అలర్ట్ ఇచ్చేందుకు అలెక్సా సౌకర్యం కూడా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు ఇక ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్ ధర రూ.89,999 ఉండగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.30వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ల్యాప్‌ట్యాప్‌పై ఎక్ఛేంజ్ కింద రూ.18,100 వరకు ఆఫర్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను రూ.1,750 వరకు పొందవచ్చు.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, ఈఎంఐపై రూ.1,750, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ. 1,500 డిస్కౌంట్, రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 500వరకు,ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1,750 వరకు, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ.1,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. చదవండి: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు..
ఐఫోన్ లవర్స్‌కు టెక్ దిగ్గజం యాపిల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ కొనుగోలుదారులకు రూ.46 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే ఐఫోన్ 13 లవర్స్ 'ట్రేడ్ ఇన్ ఆఫర్'లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్సేంజ్ ఆఫర్లు ఎలా ఉన్నాయి ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్ ఎక్ఛేంజ్‌లో రూ.46,120 వరకు, ఐఫోన్ 12 ప్రో పై రూ.43,255, బేసిక్ ఐఫోన్ 12పై రూ.31,120, ఐఫోన్ 12 మినీ పై రూ.25,565, ఆండ్రాయిడ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫోన్ పై రూ.13,085వరకు సొంతం చేసుకోవచ్చు. ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఎలా పాల్గొనాలి యాపిల్ ఆన్లైన్ షాప్ ద్వారా ఐఫోన్13 ఫోన్ బుక్ చేసుకునే ముందు.. కొనుగోలు దారులు ట్రేడ్ ఇన్ ఆఫర్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో జరిగే ట్రేడ్ ఇన్ ఆఫర్లో యాపిల్ సంస్థ మీ పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా మీకు ఐఫోన్ 13 ఫోన్‌కు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటిస్తుంది. మీరు కరెక్ట్‌గా సమాధానం చెప్పి ఐఫోన్ 13 ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. అనంతరం ఆన్లైన్లో మీకు ఐఫోన్ 13ఫోన్ డెలివరీ టైం, డేట్ చూపిస్తుంది. ఆ టైం కు ఐఫోన్ ప్రతినిధులు ఐఫోన్ 13 ఫోన్‌ను మీరు ఇచ్చిన అడ్రస్‌కు డెలివరీ చేస్తారు. ఎక్ఛేంజ్ ఆఫర్లో ఐఫోన్ 13ను తీసుకోవాలి ఐఫోన్ 13 డెలివరీ టైంకు ట్రేడ్ ఇన్ ఆప్షన్లో ఇచ్చిన అడ్రస్‌కు ఆపిల్ ప్రతినిధులు వస్తారు. వచ్చే ముందు మీరు ఏ ఫోన్ పై ట్రేడ్ ఇన్ ఆప్షన్ నిర్వహించారో ఆ ఫోన్లను సిద్ధం చేసుకోవాలి. ప్రతినిధులు మీ అడ్రస్‌కు వచ్చిన వెంటనే మీ పాత ఐఫోన్ 12 సిరీస్ ఫోన్, ఆండ్రాయిండ్ ఫోన్లను వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు మీరు ట్రేడ్ ఇన్ ఆప్షన్ లో మీరు మీఫోన్ గురించి చెప్పినట్లుగా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అనంతరం మీరు చెప్పింది నిజమే అయితే ఆన్లైన్ లో అప్రూవల్ ఇస్తారు. ఐఫోన్ 13ను మీకు ఆఫర్ ప్రైస్‌కే అందిస్తారు. చదవండి: ఐఫోన్-14 ఫీచర్స్ లీక్.. మాములుగా లేవుగా! -
రూ.13వేలకే రియల్మీ ఎక్స్7 ప్రో
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ ఇటీవలే ప్రీమియం రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ను భారత్ లో విడుదల చేసిన సంగతి మనకు తెలిసందే. రియల్మీ నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. కొద్దీ రోజుల క్రితం ఫస్ట్ సేల్ కి వచ్చిన అవుట్ అఫ్ స్టాక్ వెళ్లింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఎక్స్ఛేంజ్ కింద రూ.30వేలు విలువైన రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సగం ధరకే కొనవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.16,500 తగ్గిస్తే మీరు చెల్లించాల్సింది రూ.13,499 మాత్రమే. మీ దగ్గర యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా 7 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.13,499 ధరపై 5 శాతం అంటే రూ.674 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ లెక్కన మీకు రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.13,000 లోపే కొనవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ బట్టి ఎక్స్ఛేంజ్ రేటు మారే అవకాశం ఉంది. అందుకే కొనే ముందు ఒకసారి మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ ఎంత వస్తుందో ఓసారి చెక్ చేసుకోండి. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకి హెచ్చరిక -
దసరా దమాకా
సాక్షి, రంగారెడ్డి: జిల్లా దసరా సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మందుబాబులు యమ కిక్కు పొందారు. ఒకవైపు పండుగ.. మరోవైపు ఎన్నికల వాతావరణంతో మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. సాధారణ రోజులతో పోల్చుకుంటే పండుగ ఒక్క రోజు వంద శాతం అదనంగా విక్రయాలు జరిగినట్టు ఎౖక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 412 వైన్సులు, 405 బార్లు మద్యం ప్రియులతో కిటకిటలాడాయి. వీటి ద్వారా సాధారణ రోజుల్లో నిత్యం రూ.13 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుంది. పండుగ సందర్భంగా ఏకంగా రూ.26 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు అంచనా. అంటే రూ.13 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా తాగేశారన్నమాట. నిత్యం 53వేల పైచిలుకు ఐఎంఎల్, బీర్ల కాటన్లు అమ్ముడవుతున్నాయి. దసరాను పురస్కరించుకుని లక్షా రెండు వేల కాటన్లు విక్రయించినట్టు ఆబ్కారీ శాఖ వర్గాలు తెలిపాయి. -
అమెజాన్ ఫ్రీడం సేల్ ప్రారంభం, ఆఫర్ల వెల్లువ
అమెజాన్ ఇండియా తన ఫ్రీడం సేల్‌ను నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ సేల్, ఆగస్టు 12 అర్థరాత్రి వరకు కొనసాగనుంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు అమెజాన్ ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్, నోట్‌బుక్స్, హోమ్ ఎంటర్టైన్మెంట్ గాడ్జెట్లు, ఆడియో యాక్ససరీస్ ఉత్పత్తులపై డజన్ల కొద్దీ డీల్స్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ స్కీమ్‌లు ఈ సేల్‌లో భాగం కానున్నాయి. ఈ సేల్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, ఇతర ఆన్లైన్ పేమెంట్ విధానాల ద్వారా జరిపే అమెజాన్ పే బ్యాలెన్స్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. అమెజాన్ ఫ్రీడం సేల్‌లో స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు హానర్ 7ఎక్స్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ ధరలో రూ.10,999కే లభ్యమవుతుంది. దీని ఎంఆర్పీ 16,999 రూపాయలు. పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్పై 7600 రూపాయల తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను, అమెజాన్ తన సేల్‌లో రూ.55,900కు ఆఫర్ చేస్తోంది. హువావే పీ20 లైట్ కూడా డిస్కౌంట్ ధరలో రూ.16,999కు అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 6, రియల్‌మి 1 6జీబీ, హానర్ 7ఎక్స్, మోటో జీ6, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, హువావీ పీ20 లైట్, హానర్ 7సీ, మోటో ఈ5 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, వివో నెక్స్, నోకియా 6.1, ఒప్పో ఎఫ్5, ఎల్జీ వీ30లాంటి మొబైల్స్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పీసీ యాక్ససరీస్‌పై ప్రైమ్ మెంబర్లకు 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ అంతకముందే టీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40 శాతం వరకు, రోజువారీ వస్తువులు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్‌లపై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్, అవుట్డోర్ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. -
ఫోన్ కొట్టు.. క్వార్టర్ పట్టు!
ఫోన్ కొడితే చాలు.. క్షణాల్లో కావాల్సిన మద్యం బ్రాండ్ ఇంటి దగ్గరికి వస్తుంది. కోడుమూరు నియోజకవర్గంలో ఈ తంతు ఎక్కువగా సాగుతోంది. టీడీపీ నాయకులే గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు పెట్టుకొని అక్రమ మద్యం అమ్ముతున్నారు. ఓ వైపు బెల్ట్ దుకాణాలు కొనసాగితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరిస్తూ.. పరోక్షంగా ఎక్సైజ్ అధికారులు బెల్ట్ దుకాణాలను ప్రోత్సహిస్తున్న తీరు ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపైపు కోడుమూరు కేంద్రంగా కల్తీ మద్యం తయారవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కోడుమూరు (కర్నూలు): కోడుమూరు నియోజకవర్గంలో తెలంగాణ, కర్ణాటక మద్యం ఏరులై పారుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం బెల్టు దుకాణాల నిర్వహణపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పంటపొలాలు, వాముదొడ్లలో మద్యం బాటిళ్లను నిల్వ ఉంచుతున్నారు. మందు కావాల్సిన వారు ఫోన్ చేస్తే క్షణాల్లో కావాల్సిన బ్రాండ్ తెచ్చిస్తున్నారు. అడపాదడపా దాడులు చేసి, తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అమడగుంట్ల గ్రామంలో గత నెల చంద్ర అనే మద్యం బెల్టు దుకాణ యజమాని పట్టుబడ్డాడు. అతడిని వది లేసి 80 ఏళ్ల వృద్ధురాలిని మద్యం అమ్మకాల్లో ఏ1గా చూపించి కేసు నమోదు చేశారంటే ఎక్సైజ్ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్యాలకుర్తిలో కేఈ సోదరుల బంధువునంటూ బెల్టు దుకాణాన్ని నడుపుతున్న ఓ వ్యక్తి ఇటీవల కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ పట్టుబడ్డాడు. భారీ ఎత్తున ఒత్తిళ్లు రావడంతో ఎక్సైజ్ పోలీసులు అతడిని తప్పించి సంబంధంలేని వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఏరులై పారుతున్న నాటుసారా అల్లినగరం, రామాపురం, కొండాపురం, లద్దగిరి, కొత్తపల్లె గ్రామాల్లో నాటుసారా ఏరులైపారుతోంది. ఉల్లిందకొండ తండా వాసులు ఈ గ్రామాలకు ప్లాస్టిక్ బిందెల్లో నాటుసారాను తీసుకొచ్చి బెల్టు దుకాణదారులకు విక్రయిస్తున్నారు. బెల్టు దుకాణదారులు నాటుసారాను ప్యాకెట్లుగా తయారుచేసి అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదు. కోడుమూరు కేంద్రంగా కల్తీ మద్యం తయారీ కోడుమూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఓ ఇంట్లో పుట్టపాశం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్తీ మద్యాన్ని తయారుచేసి పల్లెలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కల్తీ మద్యం తయారు చేయడంలో సదరు వ్యక్తి జిల్లాలోనే పేరు మోసిన నేరస్తుడు. కల్తీ మద్యం ఎక్కడ పట్టుబడినా ఎక్సైజ్ పోలీసులు పుట్టపాశం కల్తీ మద్యం తయారుచేసే వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు. కోడుమూరు కేంద్రంగా కల్తీ మద్యాన్ని తయారుచేసి ఫుల్బాటిళ్లలోకి నింపి పెళ్లిళ్లు, జాతరలు, తిరుణాలలు జరిగే ప్రాంతాల కు సరఫరా చేసి అక్రమార్కులు యథేచ్చగా తమ దందా కొనసాగిస్తున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. -
ఈ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ ఇటీవల లాంచ్ చేసిన ‘పీ20 ప్రో, పీ 20లైట్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. మే 2వతేదీనుంచి 7వరకు మెగా సేల్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కస్టమర్లకు అమెజాన్ ద్వారా ప్రత్యేక క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లు 2 మే నుండి 7 మే, 2018 వరకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు 100 జీబీ అదనపు డేటాను అందించడానికి వొడాఫోన్తో కూడా కంపెనీ భాగస్వామ్యం ఉంది. కస్టమర్ సంతృప్తిపై తమకు పూర్తి విశ్వాసం వుందని హువావే ఇండియా-కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ సంజీవ్ ప్రకటించారు. ప్రపంచంలో మొట్టమొదటి లైకా ట్రిపుల్ కెమెరా, అపూర్వమైన కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను కలిగి ఉన్న హువావే పీ 20 ప్రొ పై 5వేలరూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్. అంతేకాక వినియోగదారులకు 6,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పరికరం నెలకు రూ.5417 వద్ద 12 నెలలకు నో కాస్ట్ ఈఎంఐ. ఈ ఆఫర్ యాక్సిస్ బ్యాంక్ కార్డులకు మాత్రమే వర్తిస్తుంది. పీ 20 లైట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారాకొనుగోల చేస్తే 1500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై నెలకు 1667 నుంచి 12 నెలలు వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే 2వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ . మరోవైపు వోడాఫోన్ భాగస్వామ్యంతో ఈ రెండు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 199 పైన 10 నెలల పాటు 10 రీఛార్జ్లపైన 100 జీబీ డేటా అదనంగా అందిస్తుంది. దీంతోపాటు పోస్ట్ పోయిడ్ కస్టమర్లకు వోడాఫోన్ రెడ్ ప్లాన్ రూ. 399 రీచార్జ్‌పై 10 నెలల పాటు 10జీబీ ఉచిత డేటా అదనంగా పొందవచ్చు. కాగా హువావే పీ 20 ప్రొ ,ప్రీ20 లైట్ లాంచింగ్ ధరలు వరుసగా రూ.64,999, ధర 19,999గా ఉన్నాయి. -
ఎక్స్చేంజ్ లో ఫోన్ కొనాలనుకుంటున్నారా?
ముంబై : ఎక్స్చేంజ్ ఆఫర్లతో వస్తువులు కొనుకొని ఇన్ని రోజులు పన్ను భారాన్ని తగ్గించుకుంటున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఎక్స్చేంజ్ లో ఓ వస్తువు కొన్నా ఇక జీఎస్టీ మోత మోగనుంది. ఇన్ని రోజులు ఎక్స్చేంజ్ ఆఫర్లపై మార్కెట్ విలువ కంటే తక్కువకు లభిస్తున్న ధరకు మాత్రమే పన్ను కట్టేవారు. కానీ ఇకనుంచి అలా ఉండదట. జీఎస్టీ కింద సప్లయి విలువను లెక్కకట్టే డ్రాఫ్ట్ రూల్స్ ను ప్రభుత్వం ఏప్రిల్ 1న విడుదల చేసింది. సప్లయ్ అనేది సమగ్ర పదమని, దీనిలో కేవలం విక్రయం మాత్రమే ఆధారపడి ఉండదని, దీనిలోనే ఎక్స్చేంజ్, సరుకు బదలాయింపు కూడా కలిసి ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం.. కొత్త 24వేల రూపాయలున్న కొత్త ఫోన్ ను ఎక్స్చేంజ్ లో రూ.20వేలకు కొంటున్నామనుకోండి... అసలు ధర రూ.24 వేలపైనే ప్రస్తుతం జీఎస్టీని లెక్కకట్టనున్నారు. ఇన్నిరోజులు కేవలం 20వేల రూపాయల పైనే పన్ను చెల్లించేవారు. ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫర్లను పాత మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ సెట్లు, కార్లపై ప్రకటిస్తుంటారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింట్లోనూ ఈ ఎక్స్చేంజ్ లపై వివిధ స్కీమ్ లు అందుబాటులో ఉంటుంటాయి. సప్లయి విలువ, మార్కెట్ విలువ ఆధారంగానే ఉండాలని జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్ లో పొందుపరచడంతో, ఇక ఎక్స్చేంజ్ ఆఫర్లపై కొనే వస్తువులపైనా జీఎస్టీ మోత మోగించనుంది. ఏజెంట్ ద్వారా ఏయిర్ ట్రావెల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు చెల్లించే సర్వీసులపైనా జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్ ను పొందుపరిచారు. బేసిక్ ఫేర్ పై 5 శాతం చెల్లించాలని డ్రాఫ్ట్ రూల్స్ పేర్కొన్నాయి. అదే ఇంటర్నేషనల్ ట్రావెల్ కు అయితే 10 శాతం చెల్లించాలి. . -
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ : భారీ డిస్కౌంట్లివే!
ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్(ఎఫ్ఈఎస్)ను ప్రారంభించింది. నిన్నటి నుంచి మార్చి 24 వరకు మూడు రోజుల పాటు ఈ ఎక్స్‌క్లూజివ్ 3-డే ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో భాగంగా మొబైల్స్, టెలివిజన్స్, ల్యాప్టాప్స్, ఎయిర్‌కండీషనర్స్, ఎలక్ట్రానిక్ డివైజస్, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్, స్మార్ట్ గ్యాడ్జెట్లపై ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రూ.5,999 కనీసమొత్తంలో ఫ్లిప్ కార్ట్ పై కొనుగోలు చేసిన ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు తక్షణమే 10శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్ కార్ట్ కల్పిస్తోంది. ఈ తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ఈవెంట్ ముగిసేవరకు ఉంటుంది. ఐఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు... ప్రస్తుతం నడుస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో , ఐఫోన్ 7 అన్ని వేరియంట్ల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,500 ధర తగ్గింపును ఈ ఈ-కామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధరపై కూడా రూ.7000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇదే మొత్తంలో ఉంటుందని తెలిపింది. ఐఫోన్ 6 16జీబీ వేరియంట్ ధరను రూ.10,500 తగ్గించేసింది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. గూగుల్ పిక్సెల్, మోటో జెడ్, శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ డీల్స్.... ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ కింద ఎక్స్చేంజ్ ఆఫర్లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై రూ.20వేల వరకు, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ పై రూ.13,500 వరకు ధర తగ్గిపోయింది. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,500 డిస్కౌంట్ కల్పిస్తోంది. ఇలా శాంసంగ్ సీ9 ప్రొ, హానర్ 8, హ్యువాయ్ పీ9, సోని ఎక్స్‌పీరియా ఎక్స్ఏ ఆల్ట్రా వంటి స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ రేట్లను తగ్గించేసి, డిస్కౌంట్ ఆఫర్లను కల్పిస్తోంది. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఆపిల్ ఐప్యాడ్, లెనోవో యోగా3, లెనోవో ఫ్యాబ్ 2 ప్రొ పాబ్లెట్, ఆపిల్ వాచ్, ఆసుస్ జెన్‌వాచ్3 వంటి వాటిపై కూడా డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. -
ఐ ఫోన్ 7ప్లస్, 7లపై డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: అప్‌గ్రేడ్ చేసిన ఆపిల్ ఐ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 5శాతం తగ్గింపుతోపాటు, రూ. 25వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ లో ఆపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్ స్టార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అయితే పాత ఐఫోన్ హ్యాండ్సెట్లు ఎక్సేంజ్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా ఐఫోన్ 4, 4, 5, -5, 5 సి, 6, 6 ప్లస్, 6ఎస్ ప్లస్ , ఎస్ఈ ఫోన్లకు ఎక్సేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఐఫోన్ 7 32జీబీ 5శాతం డిస్కౌంట్ తో రూ 57,000కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర. రూ 60,000. దీనికి అదనంగా ఇతర ఐఫోన్ మోడల్స్‌తో మార్పిడి చేసుకున్న వినియోగదారులు రూ.21.800 తగ్గింపు ఆఫర్ తో రూ. 35,200 ల వరకు ఈ హ్యాండ్ సెట్ ధర తగ్గనుంది. అదే విధంగా, ఐఫోన్ 7 (128జీబీ) మరియు ఐఫోన్ 7 (256జీబీ ) వరుసగా రూ.43,200,రూ. 51,200 ఫ్లాట్ డిస్కౌంట్ . దీనికి ఎక్సేంజ్ ఆఫర్ అదనం. కాగా వీటి అసలు ధరలు వరుసగా రూ 70,000 , రూ .80,000లుగా ఉన్నాయి. ఐఫోన్ 7 ప్లస్ , 32జీబీ వెర్షన్ 5 శాతం డిస్కౌంట్ తర్వాత రూ 44, 800కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్అసలు ధరరూ. 72,000. అదేవిధంగా, 128జీబీ వెర్షన్ రూ. 52,800 (అసలు ధర రూ 82,000) కొనుగోలు చేయవచ్చు.256జీబీ రూ.60,800గా ఉండనుంది. అసలు ధర రూ. 92,000గాఉంది. (ఈ ధరలు 5 శాతం డిస్కౌంట్ + ఎక్సేంజ్ ఆఫర్ రూ.26,600 కలిపి మొత్తం రూ.31,200 తగ్గింపు తర్వాత) దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్బిఐ, కోటక్ బ్యాంక్, సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు లాంటి పలు బ్యాంకుల ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అలాగే, ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ గోల్డ్ కలర్ వేరియంట్, 32జీబీ, ఐఫోన్ 7 128జీబీ ఈ అప్గ్రేడ్ప్రోగ్రాం నుంచి మినహాయించిన సంగతిని గమనించగలరు. మరోవైపు తను కొనుగోలు చేసి ఐఫోన్ కు వెనుక చిన్న గీతలు పడడంతో ఎక్సేంజ్‌ను నిరాకరించారనీ, టైం వేస్ట్ అంటూ కోలకత్తాకు చెందిన మనోహర్ ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో.. కొనుగోలుదారులూ..బీ కేర్‌ఫుల్..