Amazon Great Indian Festival : Acer Swift 3 Laptop Get 30,000 Discount - Sakshi
Sakshi News home page

Acer Swift 3 : ఈ ల్యాప్‌ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా..

Published Mon, Oct 11 2021 1:08 PM | Last Updated on Mon, Oct 11 2021 4:50 PM

Acer Swift 3 laptop get Rs 30,000 discount in Amazon Great Indian Festival - Sakshi

ల్యాప్‌ ట్యాప్‌ కొనుగోలుదారులకు బంపర్‌ ఆఫర్‌. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఏసర్‌ స్విఫ్ట్‌3 ల్యాప్‌ ట్యాప్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాదు వీటితో పాటు అమెజాన్‌ సేల్‌లో కొత్తగా విడుదలైన వెయ్యికి పైగా కొత్త గాడ్జెట్స్‌పై ఆఫర్లను అందిస్తుంది.


'ఏసర్ స్విఫ్ట్ 3' ఫీచర్లు 
ఏసర్‌ స్విఫ్ట్‌3 ల్యాప్‌ట్యాప్‌ 64బిట్‌,విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 1920x1080పి రెజెల్యూషన్‌తో 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే,18జీబీ డీడీఆర్‌4 ర్యామ్‌, 512జీబీ ఎస్‌ఎస్‌డీ, ఏఎండీ రైజెన్5 5500యూ హెక్సా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తుంది.

హైక్వాలిటీ వీడియోల్ని రెండరింగ్‌ చేసేందుకు వీలుగా ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్, ఫాస్ట్‌గా డేటాను స్టోర్‌ చేసేందుకు ఎస్‌ఎస్‌డీ డ్రైవ్‌ కూడా ఉంది. వీటితో పాటు కలర్‌ కాంట్రాస్ట్‌ కోసం ఎల్‌ఈడీ బ్యాక్‌ కంఫైవ్యూ టెక్నాలజీని అందిస్తుంది.సెక్యూరిటీ పర్పస్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ టెక్నాలజీ,వాయిస్‌ అలర్ట్‌ ఇచ్చేందుకు అలెక్సా సౌకర్యం కూడా ఉంది. 

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఆఫర్లు
ఇక ఏసర్‌ స్విఫ్ట్‌3 ల్యాప్‌ ట్యాప్‌ ధర రూ.89,999 ఉండగా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో రూ.30వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. పాత ల్యాప్‌ట్యాప్‌పై ఎక్ఛేంజ్‌ కింద రూ.18,100 వరకు ఆఫర్‌ పొందవచ్చు.


అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను రూ.1,750 వరకు పొందవచ్చు.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్‌ స్టంట్‌ డిస్కౌంట్‌, ఈఎంఐపై రూ.1,750, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ. 1,500 డిస్కౌంట్‌, రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్‌ స్టంట్‌ డిస్కౌంట్‌ రూ. 500వరకు,ఆర్బీఎల్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10శాతం ఇన్‌ స్టంట్‌ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1,750 వరకు, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ.1,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

చదవండి: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్‌ చేసుకోవద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement