Acer
-
ఈవీ రంగంలోకి ప్రముఖ ల్యాప్‌టాప్ కంపెనీ.. తొలి ఈ-స్కూటర్ విడుదల
తైవాన్‌కు చెందిన ప్రముఖ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ (Acer) ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. భారతీయ మార్కెట్లో తన మొదటి ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. MUVI 125 4G పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఈ MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించింది, తయారు చేసింది ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్ థింక్ ఈబైక్‌గో. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఏసర్ అడుగుపెట్టడంతో ఇప్పటికే ఆ రంగంలో ఉన్న ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు గట్టిపోటీ ఎదురుకానుంది. MUVI 125 4G ప్రత్యేకతలు ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 80 కిలోమీటర్లు గరిష్ట వేగం 75 kmph. ఛార్జింగ్ కోసం స్వాప్ చేయగల బ్యాటరీ తేలికపాటి ఛాసిస్ 16-అంగుళాల చక్రాలు, కాంపాక్ట్ డిజైన్ డబుల్ డిస్క్ బ్రేక్స్ MUVI 125 4G సాంకేతిక వివరాలను మాత్రం ఏసర్ వెల్లడించలేదు. అయితే, ఇది మార్చుకోదగిన (స్వాపింగ్) బ్యాటరీలతో వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హత పొందుతుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రీ-బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్‌లు, డీలర్‌షిప్‌పై ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 🚨 Taiwanese laptop maker 'Acer' has entered into the electric scooter market in India by launching its e scooter at ₹99,999/- pic.twitter.com/Fa3sqEjOVr — Indian Tech & Infra (@IndianTechGuide) October 16, 2023 -
హాట్ కేకుల్లా డెస్క్ టాప్ సేల్స్!! భారత్‌లో కింగ్ మేకర్ ఎవరంటే!
కోవిడ్ కారణంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్‌హోమ్ తో దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ-డెస్క్‌టాప్),ల్యాప్‌ట్యాప్‌ల వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన క్యూ4 ఫలితాల్లో దేశీయంగా పర్సనల్ కంప్యూటర్లు 14.8 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్ జరిగినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. 1.3 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో హెచ్‌పీ సంస్థ మార్కెట్లో కింగ్ మేకర్‌గా నిలిచింది. ►2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగింది. ►క్యూ4లో వరుసగా రెండో త్రైమాసికంలో 1మిలియన్ యూనిట్లకు పైగా షిప్పింగ్ చేస్తూ 23.6శాతం షేర్‌తో డెల్ దేశీయ మార్కెట్లో రెండో స్థానంలో నిలించింది. ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నుండి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెల్ 38శాతం వాటాతో ఎంటర్ప్రైజ్ విభాగంలో ముందుంది. ►మరో టెక్ సంస్థ లెనోవో పీసీ సెగ్మెంట్లో 22.8శాతం వృద్ధిని సాధించింది. 24.7శాతం వాటాతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగం నుండి డిమాండ్ పెరగడంతో లెనోవో..,హెచ్‌పీ కంటే మందంజతో రెండవ స్థానంలో ఉంది. ►ఏసర్ 8.2శాతం, ఆసుస్ 5.9శాతం మార్కెట్ వాటాతో నాలుగు, ఐదవ స్థానాల్ని సంపాదించుకున్నాయి. డెస్క్‌టాప్ విభాగంగాలో ఏసర్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఇది 25.8శాతం మార్కెట్ వాటా ఉంది. ►ఆసుస్ సంవత్సరానికి 36.1శాతం వృద్ధి చెందింది. ఈ సందర్భంగా ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ (పీసీ డివైజెస్) భరత్ షెనాయ్ మాట్లాడుతూ వరుసగా రెండో సంవత్సరం సైతం విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది విద్యార్ధులు మాత్రం పెద్దస్క్రీన్, వాడుకలో సౌలభ్యం వంటి ఇతర ప్రయోజనాల కారణంగా పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
గేమింగ్ ప్రియులకు అమెజాన్ శుభవార్త.. ల్యాప్టాప్స్ మీద అదిరిపోయే డిస్కౌంట్..!
పముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ గేమింగ్ ప్రియులకు మంచి శుభవార్త తెలిపింది. గేమింగ్ ఔత్సాహికుల కోసం గేమింగ్ గాడ్జెట్లపై అనేక డీల్‌లు, ఆఫర్లను అందించడానికి అమెజాన్ ఈరోజు 'గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ని ప్రకటించింది. అమెజాన్ ఈ 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ని ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహిస్తుంది. Lenovo, Acer, Asus, LG, HP, Sony, Dell, Corsair, Cosmic byte, JBL వంటి మొదలైన ప్రముఖ బ్రాండ్ కంపెనీలు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు & మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డ్‌లపై మంచి డీల్‌లను అందిస్తుంది. వినియోగదారులు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, మానిటర్లు వంటి వాటిపై గరిష్టంగా 50 శాతం తగ్గింపును పొందవచ్చు. Acer Nitro 5 గేమింగ్ ల్యాప్‌టాప్: Intel Core i5 11th gen ప్రాసెసర్‌తో పనిచేసే Acer Nitro 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌లో శక్తివంతమైన 8జీబీ DDR4SD RAM, 512GB SSD, Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144 Hzగా ఉంది ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ ₹62,490కి అందుబాటులో ఉంది. HP Victus FHD గేమింగ్ ల్యాప్‌టాప్: HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ R7-5800H ప్రాసెసర్, Nvidia RTX 3050 4GB DDR6 డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ సహాయంతో పనిచేస్తుంది. ఆఫర్లో భాగంగా ఈ గేమింగ్ బీస్ట్ రూ.20,000 తక్కువతో ₹83,990కి లభిస్తుంది. ఇలా వినియోగదారులు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, మానిటర్లు వంటి వాటిపై భారీగా తగ్గింపును పొందవచ్చు. (చదవండి: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
చైనాకు కోలుకోని దెబ్బ, శరవేగంగా కేంద్రం కీలక నిర్ణయాలు!!
దేశంలో సెమీకండక్టర్ల తయారీలో కేంద్రం వడివడి అడుగులు వేస్తుంది. చైనా కోలుకోలేని విధంగా షాకిస్తూ కేంద్రం మరో రెండేళ్ల తర్వాత దేశంలో చిప్‌లు తయారయ్యే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశీయ టెక్ కంపెనీలు వేలకోట్లు పెట్టుబడులు పెట్టేలా కేంద్రం ప్రోత్సహిస్తుంది. కేంద్రం దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్ప్లే తయారీకి రూ.76వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకానికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో భాగంగా సెమీకండక్టర్ల తయారీ కోసం దేశీయ టెక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూకడుతున్నాయి. మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని ఆటోమొబైల్స్ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం ఈ చిప్‌లు విదేశీ కంపెనీలు తయారు చేస్తుంటే..వాటిని కొనుగోలు చేస్తున్నాం. అయితే ఇకపై అలాంటి సమస్య లేకుండా కేంద్రం పీల్ఐ స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో 10% వాటా లక్ష్యంగా పెట్టుకుంది.సెమీకండక్టర్లలో రూ.90వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. చిప్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిప్ ఉత్పత్తి తయారీ సంస్థలతో మాట్లాడుతోందని ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇక దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి విషయానికొస్తే మరో రెండేళ్ల తర్వాత సాధ్యమవుతుంది" అని గౌర్ చెప్పారు. అంతేకాదు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్‌లో హెచ్‌పీ, డెల్, యాక్సర్ వంటి టెక్ సంస్థలు వేల పెట్టుబడులు పెట్టనున్నాయని గౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. చైనాకు గట్టి ఎదురుదెబ్బ! చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చదవండి: మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్‌పర్టా? అయితే మీకు జాబులే జాబులు!! -
ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!
తైవాన్‌కు చెందిన ప్రముఖ ల్యాప్‌ట్యాప్ తయారీదారు ఏసర్ భారత్‌లో ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రారంభించింది. ‘లూట్ అవర్ స్టోర్ సేల్’ పేరుతో గేమింగ్ ల్యాప్టాప్స్, ఉపకరణాలపై, కంప్యూటర్ గాడ్జెట్స్‌పై ఏసర్ భారీ ఆఫర్లను ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌ట్యాప్స్‌పై సుమారు రూ. 40 వేల వరకు, గేమింగ్ ఉపకరణాలపై 67శాతం మేర తగ్గింపును ఏసర్ ప్రకటించింది. ఈ సేల్ ఏసర్ అధికారిక వెబ్సైట్లో డిసెంబర్ 16-17 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: వారం రోజుల పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్..! సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైన ఐబీఎమ్, శాంసంగ్ ఏసర్ ల్యాప్‌ట్యాప్స్ రూ. 23,990 నుంచి తక్కువ ధరలోనే ప్రారంభంకానున్నాయి. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ, బ్రాండ్ వారంటీని ఏసర్ అందిస్తుంది. ఏసర్ మానిటర్స్ రూ. 7,690 నుంచే ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు సంవత్సరాల వారంటీ, ఒక ఏడాది పాటు యాక్సిడెంటర్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్‌లో భాగంగా ఏసర్ నైట్రో హెడ్‌సెట్స్, బ్యాక్‌ప్యాక్స్, అడాప్టర్స్‌పై 67 శాతం వరకు తగ్గింపును ఏసర్ అందించనుంది. దాంతో పాటుగా ఎక్సేచేంజ్ ఆఫర్లను కూడా ఏసర్ అందిస్తోంది. ఏసర్ ట్యాబ్ కొనుగోలుపై రూ. 2,999 విలువైన ఏసర్ నైట్రో హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు ఉచితంగా పొందవచ్చును. ఈ టాబ్లెట్ ధర రూ. 11,999. చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..! -
ఏసర్ యూజర్లకు భారీ షాక్..!
ప్రముఖ తైవాన్ టెక్ దిగ్గజం ఏసర్ భారతదేశంలోని తమ సర్వర్లను హ్యాక్ చేసినట్లు దృవీకరించింది. 60జీబీ వినియోగదారుల డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ డేటాను దొంగలించడం ఇది రెండవ సారి. యూజర్ల వ్యక్తిగత సమాచారం, కార్పొరేట్ కస్టమర్ డేటా, సున్నితమైన ఖాతాల సమాచారం, ఆర్థిక డేటాను యాక్సెస్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. భారతదేశంలోని 10,000 మంది కస్టమర్ల రికార్డులను కలిగి ఉన్న ఫైళ్లు, డేటాబేస్ కూడిన వీడియోను హ్యాకర్ గ్రూపు పోస్ట్ చేశారు. (చదవండి: ఇక మీ పని అయిపోయినట్లే.. మేము వచ్చేస్తున్నాం!) భారతదేశం అంతటా ఏసర్ రిటైలర్లు, పంపిణీదారుల 3,000 సెట్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్ తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని హ్యాకర్ బృందం పేర్కొంది. భారతదేశంలో తన స్థానిక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సిస్టమ్ పై దాడి చేసినట్లు ఏసర్ పేర్కొంది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఏసర్ ధృవీకరించినట్లు నివేదిక తెలిపింది. ఈ విషయం గురుంచి దేశంలోని ఖాతాదారులందరిని అలర్ట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ దాడి గురుంచి స్థానిక అధికారులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఇఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు ఏసర్ పేర్కొంది. ఏడు నెలల్లో ఏసర్ పై జరిగిన రెండో సైబర్ సెక్యూరిటీ దాడి ఇది. మార్చిలో ఆర్ ఈవిల్ చేసిన రాన్సమ్ వేర్ దాడితో కంపెనీ వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకులయి. దొంగిలించిన డేటాను తిరిగి పొందడం కోసం 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని అప్పట్లో ఏసర్ ను హ్యాకర్లు కోరారు. ఆ సమయంలో హ్యాకర్లు డిమాండ్ చేసిన అతిపెద్ద డిమాండ్ అది. -
ఈ ల్యాప్ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా..
ల్యాప్ ట్యాప్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాదు వీటితో పాటు అమెజాన్ సేల్‌లో కొత్తగా విడుదలైన వెయ్యికి పైగా కొత్త గాడ్జెట్స్‌పై ఆఫర్లను అందిస్తుంది. 'ఏసర్ స్విఫ్ట్ 3' ఫీచర్లు ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్‌ట్యాప్ 64బిట్,విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. 1920x1080పి రెజెల్యూషన్‌తో 14 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే,18జీబీ డీడీఆర్4 ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ, ఏఎండీ రైజెన్5 5500యూ హెక్సా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తుంది. హైక్వాలిటీ వీడియోల్ని రెండరింగ్ చేసేందుకు వీలుగా ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్, ఫాస్ట్‌గా డేటాను స్టోర్ చేసేందుకు ఎస్ఎస్డీ డ్రైవ్ కూడా ఉంది. వీటితో పాటు కలర్ కాంట్రాస్ట్ కోసం ఎల్ఈడీ బ్యాక్ కంఫైవ్యూ టెక్నాలజీని అందిస్తుంది.సెక్యూరిటీ పర్పస్ కోసం ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ,వాయిస్ అలర్ట్ ఇచ్చేందుకు అలెక్సా సౌకర్యం కూడా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు ఇక ఏసర్ స్విఫ్ట్3 ల్యాప్ ట్యాప్ ధర రూ.89,999 ఉండగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.30వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ల్యాప్‌ట్యాప్‌పై ఎక్ఛేంజ్ కింద రూ.18,100 వరకు ఆఫర్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను రూ.1,750 వరకు పొందవచ్చు.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, ఈఎంఐపై రూ.1,750, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ. 1,500 డిస్కౌంట్, రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 500వరకు,ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1,750 వరకు, ఈఎంఐ సౌకర్యం లేని ట్రాన్సాక్షన్లపై రూ.1,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. చదవండి: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూల్, కాలేజీ వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం క్లాస్ లు అన్నీ ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్దులకు ల్యాప్‌టాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, కొనే ముందు ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి. బడ్జెట్ రూ.50,000 లోపు ఉండాలి కేవలం స్కూల్ లేదా కాలేజీ విద్యార్దుల కోసం విండోస్ ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటే దానిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హెచ్ పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు రూ.30,000-రూ.50,000 ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ లు తీసుకొస్తున్నాయి. ఫుల్హెచ్డీ డిస్ప్లే సరిపోతుంది ల్యాప్‌టాప్ అధిక రిజల్యూషన్ డిస్ ప్లే ప్యానెల్ వల్ల భారీగా ధర పెరుగుతుంది కనుక అలాంటి డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ అవసరం లేదు. ఫుల్ హెచ్ డీ(1920 8 1080 పీక్సెల్స్) డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ తీసుకున్న సరిపోతుంది. ఇంకా తక్కువ ధరకు ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనుకుంటే 1366 * 768 పీక్సెల్స్ ల్యాపీ తీసుకోవచ్చు. ప్రాసెసర్ ముఖ్యమే ఇంటెల్ కోర్ ఐ3 వంటి ల్యాప్‌టాప్ లు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని సంవత్సరాల పాటు మీరు వాడుతారు కాబట్టి కోర్ ఐ5 ప్రాసెసర్ గల ల్యాప్‌టాప్ తీసుకుంటే మంచిది. ర్యామ్ ఎంత అవసరం మీ ల్యాప్‌టాప్ లో కనీసం 8జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు మీకు ఇది మంచిగా సరిపోతుంది. 4 జీబీ ర్యామ్ మాత్రం తీసుకోకండి. హార్డ్ డ్రైవ్ ఎంత ఉండాలి మీ అవసరాల కోసం 512జీబీ హెచ్ డీడీ లేదా 256జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ సరిపోతుంది. మీ దగ్గర కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే 512జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్ మీ ల్యాప్‌టాప్ లో ఒరిజినల్ విండోస్ 10 ఓఎస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీ ఉచితంగా విండోస్ 10 ఓఎస్ ను అందిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం మంచిది. దీని వల్ల మీరు సైబర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ఉంటే మంచిది. చదవండి: సైబర్ పవర్లో ఇజ్రాయిల్ కంటే వెనుకనే భారత్! -
సోనూ సూద్‌కు మరో ఆఫర్
ముంబై: దేశంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో సోనూ సూద్ ప్రజల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఏసర్ ఇండియా అనే ప్రముఖ ల్యాప్‌టాప్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని సంస్థ ప్రకటించింది. ఏసర్‌లో ఉన్న సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూ సూద్ కీలక పాత్ర పోషిస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ సాంకేతికతతో ఏసర్ ఇండియా అకట్టుకుంటుందని సంస్థ పేర్కొంది. ఏసర్ ఇండియా ఎండీ హరీష్ కోహ్లి స్పందిస్తూ.. తమ సంస్థకు సోనూ సూద్ లాంటి మానవతావాది, రియల్ హీరో బ్రాండ్ ప్రమోషన్ చేయడం సంతోషకరమని అన్నారు. వినియోగదారులకు సరికొత్త సాంకేతికతను అందించడానికి ఏసర్ ఇండియా కృషి చేసినట్లు హరీష్ కోహ్లి పేర్కొన్నారు. మరోవైపు దేశంలో టెక్నాలజీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లెందుకు సోనుసూద్ లాంటి టాలెంటడ్ నటుడు తమ సంస్థ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం సంతోషకరమని ఏసర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫిసర్ సుదీర్ గోయల్ పేర్కొన్నారు. కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఏసర్ ఇండియా 1976లో స్థాపించబడింది. మెరుగైన సేవలతో ప్రపంచ వ్యాప్తంగా ఏసర్ ఇండియా దిగ్గజ కంపెనీల జాబితాలో చేరింది. ప్రస్తుతం160 దేశాలలో ఏసర్ తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (చదవండి: ‘నన్ను విమర్శించే బదులు ఎవరికైన సాయం చేయండి’) -
ఈ ల్యాప్‌టాప్ ఖరీదు రూ.7 లక్షలు
ఏసర్ ఇండియా శుక్రవారం ప్రీడేటర్ 21 ఎక్స్ పేరుతో నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. బెర్లిన్‌లో 2016లో ఐఎఫ్‌ఏలో తొలుత దీన్ని లాంచ్ చేసిన తర్వాత, నేడు మార్కెట్లోకి దీన్ని ప్రవేశపెట్టింది. కర్వ్డ్ స్క్రీన్ డిస్ప్లేతో వచ్చిన ప్రపంచపు తొలి గేమింగ్ ల్యాప్‌టాప్ ఇదే కావడం విశేషం.ఈ ల్యాప్ టాప్ లో వీడియో గేమ్ ఆడుతుంటే ధియేటర్ ఉన్నట్లు ఫీలింగ్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన ఈ ల్యాప్‌ట్యాప్, డిసెంబర్ 18 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ల్యాప్‌టాప్ ఖరీదు రూ.6,99,999గా కంపెనీ పేర్కొంది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉంది. అమెరికాలో దీని ధర 8,999 డాలర్లు అంటే సుమారు రూ.5,77,000గా ఉంది. విండోస్ 10 ఆధారితంగా ఇది రూపొందింది. ఏసర్ ప్రిడేటర్ 21 ఎక్స్ ఫీచర్లు... 21 అంగుళాల కర్వ్డ్ ఫుల్-హెచ్డీ ఆల్ట్రావైడ్ ఐపీఎస్ డిస్ప్లే జీ-సింక్ సపోర్టు 2560x1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ 7వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-7820హెచ్‌కే ప్రాసెసర్ 64జీబీ ర్యామ్, 512GBతో వర్క్ చేసే నాలుగు సెపరేట్ డ్రైవ్స్, 1టీజీబీ 7200ఆర్పీఎం హార్డ్ డ్రైవ్ 8.5 కిలోగ్రాముల బరువు ఆరు బిల్ట్-ఇన్ స్టీరియో స్పీకర్లు -
మొబైల్ నుంచేపెట్ కి హాయ్ చెప్పండి..!
♦ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అందే ఫీడ్ ♦ ఏసర్ పాబో ప్లస్‌తో పెట్ ట్రాకింగ్ ♦ త్వరలో భారత్‌లో విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెంపుడు జంతువునుఅన్ని సందర్భాల్లో వెంట తీసుకువెళ్లలేం. అలా అని అన్ని సమయాల్లోనూ తెలిసిన వాళ్ల ఇంట్లో ఉంచలేం. అలాంటప్పుడు ఇంట్లోనే వదిలి వెళ్లాల్సి వస్తుంది. అయినా మీ పెట్‌తో మొబైల్ నుంచే హాయ్ అంటూ మాట్లాడొచ్చు. అంతేకాదు ఆహారమూ వేయవచ్చు. పెట్‌ను ఆడించొచ్చు కూడా అని అంటోంది టెక్నాలజీ కంపెనీ ఏసర్. ఇందుకోసం పాబో ప్లస్ పేరుతో ఒక ప్రత్యేక పరికరాన్ని ఏసర్ అనుబంధ కంపెనీ అయిన పాబో రూపొందించింది. ఆన్‌డ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ ఉంటే చాలు. నెట్ సహాయంతో పాబో ప్లస్‌కు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అనుసంధానం అవొచ్చు. ఇటీవలే బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ-2016 టెక్నాలజీ షోలో దీనిని ఆవిష్కరించారు. త్వరలో భారత్‌లో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఏసర్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ సీనియర్ డెరైక్టర్ చంద్రహాస్ పాణిగ్రాహి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పాబో ప్లస్ ఇలా పనిచేస్తుంది.. పెంపుడు జంతువును పర్యవేక్షించే పరికర మే పాబో ప్లస్. ఇది వైఫైతో పనిచేస్తుంది. మొత్తం 8 మంది కనెక్ట్ అయి లైవ్ వీడియోను చూడొచ్చు. ఇలా అనుసంధానమైన వారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ చేతిలోకి స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ద్వారా పెట్‌ను పలకరించొచ్చు. ఇందుకోసం పాబో ప్లస్‌లో స్పీకర్‌తోపాటు మైక్రోఫోన్‌ను ఏర్పాటు చేశారు. యజమాని కనపడకపోయినా గొంతు వింటే చాలు పెంపుడు జంతువుకు ఊరట లభిస్తుందని కంపెనీ అంటోంది. దీనికి ఉన్న కెమెరాతో 130 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఒక క్లిక్ చేయగానే ఈ పరికరం నుంచి కొంత ఫీడ్ (ఆహారం) బయటకు వస్తుంది. దీనికి ఉన్న మోటరైజ్డ్ లేజర్ పాయింట్ గేమ్‌తో పెట్‌ను ఆడించొచ్చు. భారత్‌లో పాబో ప్లస్ ధర రూ.12-15 వేలు ఉండొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,34,000 కోట్ల వ్యాపార అవకాశమని ఏసర్ చీఫ్ జేసన్ ఛెన్ అభిప్రాయపడ్డారు. యూఎస్‌లో అయితే చిన్న పిల్లల సంఖ్య కంటే పెంపుడు జంతువులు రెండు రెట్లు ఉంటాయని అన్నారు.