ఏసర్‌ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! | Acer Kicks Off Year End Online Sale In India To Offer Discounts On Gaming Laptops Accessories | Sakshi
Sakshi News home page

Acer: ఏసర్‌ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!

Published Thu, Dec 16 2021 6:06 PM | Last Updated on Thu, Dec 16 2021 6:07 PM

Acer Kicks Off Year End Online Sale In India To Offer Discounts On Gaming Laptops Accessories - Sakshi

తైవాన్‌కు చెందిన ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ తయారీదారు ఏసర్‌ భారత్‌లో ఇయర్‌ ఎండ్‌ సేల్‌ను ప్రారంభించింది. ‘లూట్‌ అవర్‌ స్టోర్‌ సేల్‌’ పేరుతో గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌, ఉపకరణాలపై, కంప్యూటర్‌ గాడ్జెట్స్‌పై ఏసర్‌ భారీ ఆఫర్లను ప్రకటించింది. గేమింగ్‌ ల్యాప్‌ట్యాప్స్‌పై సుమారు రూ. 40 వేల వరకు, గేమింగ్‌ ఉపకరణాలపై 67శాతం మేర తగ్గింపును ఏసర్‌ ప్రకటించింది.  ఈ సేల్‌ ఏసర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో డిసెంబర్‌ 16-17 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 
చదవండి: వారం రోజుల పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్‌..! సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైన ఐబీఎమ్‌, శాంసంగ్‌

ఏసర్‌ ల్యాప్‌ట్యాప్స్‌ రూ. 23,990 నుంచి తక్కువ ధరలోనే ప్రారంభంకానున్నాయి. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ, బ్రాండ్ వారంటీని ఏసర్‌  అందిస్తుంది. ఏసర్‌ మానిటర్స్‌ రూ. 7,690 నుంచే ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు సంవత్సరాల వారంటీ,  ఒక ఏడాది పాటు యాక్సిడెంటర్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ను కొనుగోలుదారులు పొందవచ్చును.  

ఈ సేల్‌లో భాగంగా ఏసర్‌ నైట్రో హెడ్‌సెట్స్‌, బ్యాక్‌ప్యాక్స్‌, అడాప్టర్స్‌పై 67 శాతం వరకు తగ్గింపును ఏసర్‌ అందించనుంది. దాంతో పాటుగా ఎక్సేచేంజ్‌ ఆఫర్లను కూడా ఏసర్‌ అందిస్తోంది. ఏసర్‌ ట్యాబ్‌ కొనుగోలుపై రూ. 2,999 విలువైన ఏసర్‌ నైట్రో హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు ఉచితంగా పొందవచ్చును. ఈ టాబ్లెట్ ధర రూ. 11,999.

చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌..! శాంసంగ్‌ కంటే తక్కువ ధరకే..! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement