గేమింగ్ ప్రియులకు అమెజాన్ శుభవార్త.. ల్యాప్‌టాప్స్ మీద అదిరిపోయే డిస్కౌంట్..! | Amazon Grand Gaming Days Sale Announced With Great Deals on Gaming Laptops | Sakshi
Sakshi News home page

గేమింగ్ ప్రియులకు అమెజాన్ శుభవార్త.. ల్యాప్‌టాప్స్ మీద అదిరిపోయే డిస్కౌంట్..!

Published Tue, Feb 22 2022 3:09 PM | Last Updated on Tue, Feb 22 2022 3:11 PM

Amazon Grand Gaming Days Sale Announced With Great Deals on Gaming Laptops - Sakshi

పముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ గేమింగ్ ప్రియులకు మంచి శుభవార్త తెలిపింది. గేమింగ్ ఔత్సాహికుల కోసం గేమింగ్ గాడ్జెట్‌లపై అనేక డీల్‌లు, ఆఫర్‌లను అందించడానికి అమెజాన్ ఈరోజు 'గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ని ప్రకటించింది. అమెజాన్ ఈ 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ని ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహిస్తుంది.

Lenovo, Acer, Asus, LG, HP, Sony, Dell, Corsair, Cosmic byte, JBL వంటి మొదలైన ప్రముఖ బ్రాండ్‌ కంపెనీలు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు & మానిటర్‌లు, అధునాతన హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, గ్రాఫిక్ కార్డ్‌లపై మంచి డీల్‌లను అందిస్తుంది. వినియోగదారులు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, మానిటర్‌లు వంటి వాటిపై గరిష్టంగా 50 శాతం తగ్గింపును పొందవచ్చు.

Acer Nitro 5 గేమింగ్ ల్యాప్‌టాప్:
Intel Core i5 11th gen ప్రాసెసర్‌తో పనిచేసే Acer Nitro 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌లో శక్తివంతమైన 8జీబీ DDR4SD RAM, 512GB SSD, Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్‌ ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌ మల్టీ టాస్కింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144 Hzగా ఉంది ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ ₹62,490కి అందుబాటులో ఉంది.

HP Victus FHD గేమింగ్ ల్యాప్‌టాప్:
HP Victus గేమింగ్‌ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ R7-5800H ప్రాసెసర్, Nvidia RTX 3050 4GB DDR6 డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్‌ సహాయంతో పనిచేస్తుంది. ఆఫర్‌లో భాగంగా ఈ గేమింగ్ బీస్ట్ రూ.20,000 తక్కువతో ₹83,990కి లభిస్తుంది. ఇలా వినియోగదారులు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, మానిటర్‌లు వంటి వాటిపై భారీగా తగ్గింపును పొందవచ్చు.

(చదవండి: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement