ఏసర్ ఇండియా శుక్రవారం ప్రీడేటర్ 21 ఎక్స్ పేరుతో నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. బెర్లిన్‌లో 2016లో ఐఎఫ్‌ఏలో తొలుత దీన్ని లాంచ్ చేసిన తర్వాత, నేడు మార్కెట్‌లోకి దీన్ని ప్రవేశపెట్టింది. కర్వ్‌డ్ స్క్రీన్ డిస్‌ప్లేతో వచ్చిన ప్రపంచపు తొలి గేమింగ్ ల్యాప్‌టాప్ ఇదే కావడం విశేషం.ఈ ల్యాప్ టాప్ లో వీడియో గేమ్ ఆడుతుంటే ధియేటర్ ఉన్నట్లు ఫీలింగ్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన ఈ ల్యాప్‌ట్యాప్, డిసెంబర్ 18 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ల్యాప్‌టాప్ ఖరీదు రూ.6,99,999గా కంపెనీ పేర్కొంది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉంది. అమెరికాలో దీని ధర 8,999 డాలర్లు అంటే సుమారు రూ.5,77,000గా ఉంది. విండోస్ 10 ఆధారితంగా ఇది రూపొందింది.
ఏసర్ ప్రిడేటర్ 21 ఎక్స్ ఫీచర్లు...
21 అంగుళాల కర్వ్‌డ్ ఫుల్-హెచ్‌డీ ఆల్ట్రావైడ్ ఐపీఎస్ డిస్‌ప్లే
జీ-సింక్ సపోర్టు
2560x1080 పిక్సెల్స్ రెజుల్యూషన్
7వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-7820హెచ్‌కే ప్రాసెసర్
64జీబీ ర్యామ్, 512GBతో వర్క్ చేసే నాలుగు సెపరేట్ డ్రైవ్స్, 1టీజీబీ 7200ఆర్‌పీఎం హార్డ్ డ్రైవ్
8.5 కిలోగ్రాముల బరువు
ఆరు బిల్ట్-ఇన్ స్టీరియో స్పీకర్లు
Comments
Please login to add a commentAdd a comment