అమెజాన్ ఫ్రీడం సేల్ ప్రారంభం
అమెజాన్ ఇండియా తన ఫ్రీడం సేల్‌ను నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ సేల్, ఆగస్టు 12 అర్థరాత్రి వరకు కొనసాగనుంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు అమెజాన్ ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్, నోట్‌బుక్స్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ గాడ్జెట్లు, ఆడియో యాక్ససరీస్ ఉత్పత్తులపై డజన్ల కొద్దీ డీల్స్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ స్కీమ్‌లు ఈ సేల్‌లో భాగం కానున్నాయి. ఈ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, ఇతర ఆన్‌లైన్ పేమెంట్ విధానాల ద్వారా జరిపే అమెజాన్ పే బ్యాలెన్స్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది.
అమెజాన్ ఫ్రీడం సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు
హానర్ 7ఎక్స్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ ధరలో రూ.10,999కే లభ్యమవుతుంది. దీని ఎంఆర్‌పీ 16,999 రూపాయలు. పాత స్మార్ట్‌ఫోన్ల ఎక్స్చేంజ్‌పై 7600 రూపాయల తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను, అమెజాన్ తన సేల్‌లో రూ.55,900కు ఆఫర్ చేస్తోంది. హువావే పీ20 లైట్ కూడా డిస్కౌంట్ ధరలో రూ.16,999కు అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 6, రియల్‌మి 1 6జీబీ, హానర్ 7ఎక్స్, మోటో జీ6, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, హువావీ పీ20 లైట్, హానర్ 7సీ, మోటో ఈ5 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, వివో నెక్స్, నోకియా 6.1, ఒప్పో ఎఫ్5, ఎల్జీ వీ30లాంటి మొబైల్స్‌పై ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
పీసీ యాక్ససరీస్‌పై ప్రైమ్ మెంబర్లకు 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ అంతకముందే టీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40 శాతం వరకు, రోజువారీ వస్తువులు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్‌లపై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్, అవుట్‌డోర్ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment