పీ 20 ప్రొ
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ ఇటీవల లాంచ్ చేసిన ‘పీ20 ప్రో, పీ 20లైట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. మే 2వతేదీనుంచి 7వరకు మెగా సేల్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కస‍్టమర్లకు అమెజాన్ ద్వారా ప్రత్యేక క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లు 2 మే నుండి 7 మే, 2018 వరకు అందుబాటులో ఉంటాయి.
వినియోగదారులకు 100 జీబీ అదనపు డేటాను అందించడానికి వొడాఫోన్‌తో కూడా కంపెనీ భాగస్వామ్యం ఉంది. కస్టమర్ సంతృప్తిపై తమకు పూర్తి విశ్వాసం వుందని హువావే ఇండియా-కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ సంజీవ్ ప్రకటించారు.
ప్రపంచంలో మొట్టమొదటి లైకా ట్రిపుల్ కెమెరా, అపూర్వమైన కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను కలిగి ఉన్న హువావే పీ 20 ప్రొ పై 5వేలరూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్. అంతేకాక వినియోగదారులకు 6,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పరికరం నెలకు రూ.5417 వద్ద 12 నెలలకు నో కాస్ట్ ఈఎంఐ. ఈ ఆఫర్ యాక్సిస్ బ్యాంక్ కార్డులకు మాత్రమే వర్తిస్తుంది.
పీ 20 లైట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారాకొనుగోల చేస్తే 1500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై నెలకు 1667 నుంచి 12 నెలలు వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే 2వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ . మరోవైపు వోడాఫోన్ భాగస్వామ్యంతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 199 పైన 10 నెలల పాటు 10 రీఛార్జ్‌లపైన 100 జీబీ డేటా అదనంగా అందిస్తుంది. దీంతోపాటు పోస్ట్ పోయిడ్ కస్టమర్లకు వోడాఫోన్ రెడ్ ప్లాన్ రూ. 399 రీచార్జ్‌పై 10 నెలల పాటు 10జీబీ ఉచిత డేటా అదనంగా పొందవచ్చు. కాగా హువావే పీ 20 ప్రొ ,ప్రీ20 లైట్ లాంచింగ్ ధరలు వరుసగా రూ.64,999, ధర 19,999గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment