సాక్షి, న్యూఢిల్లీ: హువావే రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. నోవా 3 సిరీస్లో నోవా 3, నోవా 3ఐ పేరుతో రెండు డివైస్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రధానంగా నాలుగు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ఇతర ప్రధాన ఫీచర్లతో వీటిని న్యూఢిల్లీలో గురువారం విడుదల చేసింది. నాలుగు ఆర్టిఫిషియల్ క్వాడ్ కెమెరాలు, సొంతంగా 3డీ క్యు(ఎ)మోజీల సృష్టి తమ డివైస్‌ల ప్రత్యేకత అని లాంచింగ్ సందర్భంగా కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు అమెజాన్‌లో ప్రత్యేకంగా లభించనున్నామని హువావే ఇండియా ప్రతినిధి అనుపమ్ యాదవ్ తెలిపారు.
హానర్ నోవా 3 ఫీచర్లు
6.3 ఆంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా
3750 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: 34,999 రూపాయలు
నోవా 3ఐ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా
3340 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: 20,990 రూపాయలు
ప్రీ ఆర్డర్లు ఈ మధ్యాహ్నం రెండుగంటల నుంచి ప్రారంభం. హానర్ 3 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 23 నుంచి, హానర్ 3ఐ ఆగస్టు 7వ తేదీ నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. అలాగే 2 వేల రూపాయల ఎక్సేంజ్, రూ.1000 క్యాష్‌బ్యాక్‌తో పాటు జియో యూజర్లకు ఉచిత డేటా లాంటి లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment