Realme11 5G Realme11 X 5G: చైనా స్మార్గ్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ 11 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ 11 5జీ (Realme 11 5G), రియల్‌మీ 11ఎక్స్ 5జీ (Realme 11X 5G) పేరుతో తాజాగా ఆవిష్కరించింది. వీటితో పాటు రియల్‌మీ బడ్స్ ఎయిర్ 5, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌పోన్స్‌ని కూడా తీసుకొచ్చింది. రియల్‌మీ 11 5జీ ధరను రూ.20 వేల లోపు ధరను నిర్ణయించగా, రియల్‌మీ 11ఎక్స్ 5జీ మొబైల్ రూ.15 వేల బడ్జెట్ ధరగా నిర్ణయించడం గమనార్హం.
రియల్‌మీ 11ఎక్స్ 5జీ,ధరలు, లభ్యత
రియల్‌మి 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. మిడ్‌నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్స్‌లో లభ్యం.. ఆగస్ట్ 30న సేల్ ప్రారంభం. ఎస్‌బీఐ , హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్‌మీ 11ఎక్స్ 5జీ ఫీచర్లు
6.72-అంగుళాల డిస్‌ప్లే
MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
64+2ఎంపీ డ్యూయల్ రియర్‌కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
6/8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్
5000mAhబ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్
రియల్‌మి 11 5జీ ధర, లభ్యత
Realme 11 5G ప్రారంభ ధర రూ. 8 జీబీ ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ 18,999. 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999. గ్లోరీ గోల్డ్ , గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభ్యం. ఆగస్ట్ 29 నుండిసేల్.
రియల్‌మీ 11 5జీ ఫీచర్లు
6.72-అంగుళాల డిస్‌ప్లే
MediaTek డైమెన్సిటీ 6100+ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 132400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్
108 ఎంపీ+2 ఎంపీ రియర్ డ్యూయల్‌కెమెరా
16 ఎంపీ సెల్ఫీకెమరా
8జీబీ స్టోరేజ్, 128, 256జీబీ స్టోరేజ్
5000mAh బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్
రియల్‌మీ బడ్స్ ఎయిర్5: రూ.200 తగ్గింపుతో కేవలం రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు. తొలి సేల్ ఆగస్టు 26, మధ్యాహ్నం 12 గంటలకు
Experience the #realme11x5G and upgrade your style game. 🚀
With lightning-fast speed and unbeatable features, get ready to take the leap. Starting at ₹13,999/-*
Early bird sale will be live today at 6PM.
Know more: https://t.co/pfnyKqBsVD#LeapUpWith5G pic.twitter.com/nhroIFytf1
— realme (@realmeIndia) August 23, 2023
/>
Comments
Please login to add a commentAdd a comment