new smartphone 5000mAh
-
అద్భుతమైన రియల్మీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే ఫిదా!
Realme11 5G Realme11 X 5G: చైనా స్మార్గ్ఫోన్ దిగ్గజం రియల్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. రియల్మీ 11 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకొచ్చింది. రియల్మీ 11 5జీ (Realme 11 5G), రియల్మీ 11ఎక్స్ 5జీ (Realme 11X 5G) పేరుతో తాజాగా ఆవిష్కరించింది. వీటితో పాటు రియల్మీ బడ్స్ ఎయిర్ 5, రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్పోన్స్ని కూడా తీసుకొచ్చింది. రియల్మీ 11 5జీ ధరను రూ.20 వేల లోపు ధరను నిర్ణయించగా, రియల్మీ 11ఎక్స్ 5జీ మొబైల్ రూ.15 వేల బడ్జెట్ ధరగా నిర్ణయించడం గమనార్హం. రియల్మీ 11ఎక్స్ 5జీ,ధరలు, లభ్యత రియల్‌మి 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. మిడ్నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్స్‌లో లభ్యం.. ఆగస్ట్ 30న సేల్ ప్రారంభం. ఎస్బీఐ , హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రియల్మీ 11ఎక్స్ 5జీ ఫీచర్లు 6.72-అంగుళాల డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 64+2ఎంపీ డ్యూయల్ రియర్‌కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 6/8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 5000mAhబ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ రియల్‌మి 11 5జీ ధర, లభ్యత Realme 11 5G ప్రారంభ ధర రూ. 8 జీబీ ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ 18,999. 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999. గ్లోరీ గోల్డ్ , గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం. ఆగస్ట్ 29 నుండిసేల్. రియల్మీ 11 5జీ ఫీచర్లు 6.72-అంగుళాల డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 6100+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 132400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 108 ఎంపీ+2 ఎంపీ రియర్ డ్యూయల్కెమెరా 16 ఎంపీ సెల్ఫీకెమరా 8జీబీ స్టోరేజ్, 128, 256జీబీ స్టోరేజ్ 5000mAh బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ రియల్మీ బడ్స్ ఎయిర్5: రూ.200 తగ్గింపుతో కేవలం రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు. తొలి సేల్ ఆగస్టు 26, మధ్యాహ్నం 12 గంటలకు Experience the #realme11x5G and upgrade your style game. 🚀 With lightning-fast speed and unbeatable features, get ready to take the leap. Starting at ₹13,999/-* Early bird sale will be live today at 6PM. Know more: https://t.co/pfnyKqBsVD#LeapUpWith5G pic.twitter.com/nhroIFytf1 — realme (@realmeIndia) August 23, 2023 /> -
ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Oppo A78 4g: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లో మరో మొబైల్‌ను లాంచ్ చేసింది. మిడ్ రేంజ్లో ఒప్పో ఏ సిరీస్‌లో 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఏ78 4జీ స్మార్ట్‌ఫోన్ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్లో 50MP ప్రధాన కెమెరా, భారీ బ్యాటరీ,చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను జోడించింది. ఒప్పో ఏ78 మోడల్ 5జీ వెర్షన్ ఎనిమిది నెలల క్రితమే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) కస్టమర్లు మెయిన్‌లైన్ రిటైల్ అవుట్లెట్ల నుండి గరిష్టంగా 10శాతం (రూ. 1,500) క్యాష్‌బ్యాక్ , SBI కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డ్ వంటి ప్రముఖ బ్యాంకుల నుండి 3 నెలల వరకు నో-కాస్ట్ EMI. ఆన్లైన్ స్టోర్ల నుండి రూ. 500 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. (హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్, ఏకంగా పదివేలు!) ధర, ఆఫర్స్ ఒప్పో ఏ78 4జీ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.22,999. ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.17,499కే లభిస్తోంది. ఆక్వాగ్రీన్, మిస్ట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. Check out the incredible OPPO A78! 🌟, having exquisite Style with its Diamond matrix design to make you look stylish wherever you go!!#OPPOA78 Know More: https://t.co/j0DeX3xW4Q pic.twitter.com/C313pb2co2 — OPPO India (@OPPOIndia) August 2, 2023 ఒప్పో ఏ78 4జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ColorOS 13.1 8 జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ పొట్రెయిట్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్ వూక్ చార్జర్ Check out the incredible OPPO A78! 🌟, having exquisite Style with its Diamond matrix design to make you look stylish wherever you go!!#OPPOA78 Know More: https://t.co/j0DeX3xW4Q pic.twitter.com/C313pb2co2 — OPPO India (@OPPOIndia) August 2, 2023 -
హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!
Honor 90 Coming Soon చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మళ్లీ భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఇప్పటికే ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90ని ఇక్కడ లాంచ్ చేయనుంది. దీనికి తోడు రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. ఇటీవల దుబాయ్ లాంచ్ ఈవెంట్లో మాధవ్ సందడి చేశారు. అలాగే 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్ఎస్ నివేదించిన నేపథ్యంలో ఈ వార్తలకు బరింత బలం చేకూరింది. (జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?) ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం హానర్ 90 లాంచ్ సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేలలోపు ఉంటుందట. అంటే సెగ్మెంట్లో వన్‌ప్లస్ 11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ ఫోన్ 2 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పో వ్వనుందని అంచనా. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న రంగులలో అందుబాటులోకి రానుంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ 90 ఫీచర్లు అంచనాలు 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ 200+12+2 ఎంపీ ట్రిపుల్ రియర్‌కెమెరా 50ఎంపీ సెల్పీ కెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ,66వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కాగా కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్,అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించ కుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. కానీ హానర్ ఇండియాలో మాత్రం కొత్త ఉత్పత్తులను కొనసాగించింది. Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్‌వాచ్‌లు టాబ్లెట్లపై దృష్టి సారించింది. మరోవైపు ఇండియాలో హానర్ విడుదల చేసిన చివరి స్మార్ట్‌ఫోన్. రూ.10వేల బడ్జెట్ ధరలో హానర్ 9ఏ. -
టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం!
చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో (Tecno) భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. టెక్నో కామన్ 20 (Tecno Camon 20) సిరీస్ పేరుతో మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అపియరెన్స్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగిన టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో స్మార్ట్ఫోన్లను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్‌లో రావాల్సిన కామన్ 20 ప్రీమియర్ 5జీ (Camon 20 Premier 5G)ని మాత్రం ఇంకా ఆవిష్కరించలేదు. జూన్ నెలాఖరున ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్లలో కెమెరానే ప్రత్యేకతగా తెలుస్తోంది. ఈ కొత్త కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ఫోన్లు అధునాతన పోర్ట్రెయిట్, వీడియో సామర్థ్యాలతో యూజర్లకు వినూత్న ఇమేజింగ్ అందిస్తాయని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో తెలిపారు. అందుబాటు ధరలోనే.. టెక్నో కామన్ 20 16జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్ వేరియంట్ ధర రూ.14,999. ప్రీడాన్ బ్లాక్, గ్లేసియర్ గ్లో, సెరెనిటీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. అమ్మకాలు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. టెక్నో కామన్ 20 ప్రో 16జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.19,999. 16జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఈ మోడళ్లు డార్క్ వెల్కిన్, సెరెనిటీ బ్లూ కలర్స్‌లో వస్తున్నాయి. జూన్ రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. డిజైన్, స్పెసిఫికేషన్లు ప్రత్యేకమైన కామన్ పజిల్ డిజైన్ 6.67 అంగుళాల AMOLED డాట్ ఇన్ డిస్ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్‌కు సపోర్ట్ 99.8 శాతం గుర్తింపు ఖచ్చితత్వం, 0.35 సెకన్ల వేగవంతమైన అన్‌లాక్‌తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వనిల్లా కామన్ 20 వేరియంట్ మీడియాటెక్ హీలియో G85 చిప్సెట్తో పాటు ఆర్మ్ మాలి-G52 యూనిట్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ (మెమొరీ ఫ్యూజన్‌తో 16జీబీ) 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ప్రో మోడల్లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ 256 జీబీ స్టోరేజ్ తక్కువ కాంతి పరిస్థితులలో సహాయపడే RGBW ప్రో టెక్నాలజీ, పోర్ట్రెయిట్ మాస్టర్, ఇన్-బాడీ స్టెబిలైజేషన్ సెన్సార్ షిఫ్ట్ OIS యాంటీ షేకింగ్ టెక్నాలజీ కామన్ 20లో 64MP+2MP+AI లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ప్రో వేరియంట్లో 64MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 4K వీడియో రికార్డింగ్ 45W వరకు ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 5000mAh బ్యాటరీ యూనిట్ ఇదీ చదవండి: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్! -
టెక్నో పాప్ 7ప్రో: ఫీచర్లు అదుర్స్! ధర మాత్రం రూ. 7వేల లోపే
సాక్షి,ముంబై: టెక్నో మొబైల్ సంస్థ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. టెక్నో పాప్ 7ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వరుసలో పాప్ 6 ప్రో తరువాత ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేతో టెక్నో పాప్ 7 ప్రో, ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ప్రత్యేక ఫీచర్లు నిలుస్తున్నాయి. రెండు కలర్ వేరియంట్లు, రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. టెక్నో పాప్ 7ప్రో ఫీచర్లు 6.56 అంగుళాల HD ప్లస్ డిస్ప్లే క్వాడ్-కోర్ MediaTek Helio A22 SoC ఆండ్రాయిడ్ 12-ఆధారిత HiOS 11.0 12మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా 5 000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ ధర,లభ్యత 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ధర 6,799, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 7,299 ఫిబ్రవరి 22 నుండి అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. -
బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ ఎం04: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం04 పేరుతో 'M' సిరీస్‌లో బడ్జెట్ ధరలో దీన్ని తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ మొబైల్గా 10 వేల రూపాయల లోపు ధరలో అందిస్తోంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తోపాటు, 64జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్(1 టీబీవరకువిస్తరించుకునే అవకాశం) కూడా శాంసంగ్ ప్రకటించింది. (లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!) శాంసంగ్ గెలాక్సీ ఎం04 ఫీచర్లు 6.5ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ35 సాక్,ఆండ్రాయిడ్ 12 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ డ్యుయల్ రియర్ కెమెరా: 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ సెన్సార్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర, లభ్యత మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్‌లో లభ్యంకానున్న శాంసంగ్ గెలాక్సీ ఎం04 ధర రూ. 8,499గా ఉంది. సేల్ ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, శాంసంగ్ ఇండియా ద్వారా ప్రారంభమవుతుంది. (రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్‌పాట్!ఎలా?) -
వివో వైఓ2, ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే!
సాక్షి, ముంబై: వివో బడ్జెట్ ధరలో కొత్తస్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్ కింద వివో వైఓ2 పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ణయించడం విశేషం. ఐ ప్రొటెక్షన్ మోడ్, ఆండ్రాయిడ్ 12, మీడియా టెక్ చిప్, 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో జోడించింది, vivo ఇండియా ఇ-స్టోర్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వివో వైఓ2 ఫీచర్లు 6.51-అంగుళాల హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 720x1600 పిక్సెల్ రిజల్యూషన్ MediaTek ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో Android 12 గో ఎడిషన్-ఆధారిత Funtouch OS 12 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ Trendy style and unmatched vibe. Unveiling the new #vivoY02 Buy Now : https://t.co/eDzazkRLla#ItsMyStyle #BuyNow pic.twitter.com/Pziuht03RY — vivo India (@Vivo_India) December 5, 2022 -
మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్, ధర తక్కువ, ఇక జియో ఆఫర్ తెలిస్తే!
సాక్షి, ముంబై: మోటరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో ఈ32 పేరుతో కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. మీడియా టెక్ హీలియో జీ 37 ప్రాసెసర్‌ను ఇందులో జోడించింది. ఇంకా IP52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్తో స్టాక్ ఆండ్రాయిడ్ 12తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర, ఆఫర్లు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక వేరియంట్లో లభిస్తుంది. ధర రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో కొనుగోలుదారులకు రూ. 2,549 విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలను ఉచితం. రూ. 2వేల రూపాయల క్యాష్‌బ్యాక్, వార్షిక Zee5 సభ్యత్వంపై రూ. 549 తగ్గింపు ఇందులో భాగం. మోటో ఈ32 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 2MP డెప్త్ సెన్సార్, 50MP రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ,10W ఛార్జింగ్ -
మోటరోలా జి 8 పవర్ లైట్ రేపే లాంచింగ్: ధర?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్డౌన్ ఆంక్షల్లో క్రమంగా సడలింపుల నేపథ్యంతో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త ఉత్పత్తుల లాంచింగ్ సిధ్దపడుతున్నాయి. ముఖ్యంగా మోటరోలా తన ఎడ్జ్ + ఫ్లాగ్‌షిప్‌ను భారత మార్కెట్లో రేపు (గురువారం) లాంచ్ చేయనుంది. మోటో జి సిరీస్‌లో భాగంగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. జీ 8 పవర్ లైట్ పేరుతో తీసుకొస్తున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,ట్రిపుల్ రియర్ కెమెరా, అద్భుతమైన డిజైన్ తో రానుందని కంపెనీ చెప్పింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రారంభించనుంది. బడ్జెట్ ధరలో రానున్న ఇది రెడ్ మి 8, రియల్ మి నార్జాలకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. మోటరోలా జీ8 పవర్ లైట్ ఫీచర్స్ 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ35ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16+2+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.10,000 -
ఆసుస్ నుంచి రెండు కొత్త ఫోన్లు
తైవాన్ టెక్ దిగ్గజం ఆసుస్ డిసెంబర్ 11న రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లోకి తెచ్చిన ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్1 కి కొనసాగింపుగా జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్2ను నాచ్ డిజైన్‌తో తీసుకురానుంది. ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ద్వారా డిసెంబర్ 11న మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ చేయనుంది. దీనితోపాటే సర్ప్రైజ్ లాంచ్‌గా జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2ని కూడా రిలీజ్ చేయనుంది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎమ్2 ఫీచర్లు 6.3 ఇంచ్‌ల డిస్ప్లే 2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12+5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 13 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : దాదాపు రూ.19,100 జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2 ఫీచర్లు 6.3 ఇంచ్‌ల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : దాదాపు రూ. 13,800 -
ఆపిల్‌కు సవాల్: దుమ్ము రేపిన హువావే, లక్ష దాటిన ధర
భారీ స్క్రీన్లు, బ్యారీ స్టోరేజ్, భారీ బ్యాటరీ, అద్భుతైన లైకా ట్రిపుల్ కెమెరా , అధునాతన టెక్నాలజీ మేళవింపులో చైనా మొబైల్ తయారీ దారు హువావే దుమ్ము రేపింది. హైఎండ్ స్మార్ట్‌ఫోన్ ధరను లక్షకుపైగా రూపాయలుగా నిర్ణయించి లగ్జరీ ఫోన్లకు పెట్టింది పేరైన ఆపిల్‌కు సరికొత్త సవాల్ విసిరింది. హువావే 20 సిరీస్‌లో అంచనాలకు మించి వరుసగా నాలుగు అద్భుతమైన స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. హువావే మేట్, 20, మేట్ 20 ప్రొ, మేట్ 20 ఎక్స్, మేట్ 20 ఆర్ఎస్ డివైఎస్లను లండన్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలు రూ. 67,900నుంచి ప్రారంభం కానున్నాయి. మేట్ 20ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను 7.12 అల్ట్రా లార్జ్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. మేట్ 20ఎక్స్ ఫీచర్లు 7.12 ఓఎల్ఈడీ అతిపెద్ద డిస్ప్లే 40 ఎంపీ ట్రిపుల్ కెమెరా 6జీబీ, 128జీబీ స్టోరేజ్ 5000 బ్యాటరీ ధర : సుమారు రూ. 76, 500 అక్టోబర్ 26నుంచి విక్రయానికి లభ్యం. దీంతోపాటు లగ్జరీ కస్టమర్లకోసం పోర్షే డిజైన్‌తో మేట్ ఆర్ఎస్ను హై ఎండ్ వేరియంట్‌గా తీసుకొచ్చింది. హువావే మేట్ ఆర్ఎస్: 8జీబీర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 8జీబీ, 512 స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేసింది. 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర సుమారు రూ. 1,44,000 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 1,80,000 -
అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో పి 75 స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: పానసోనిక్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను గురువారం భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. అత్యధిక బ్యాటరీ పవర్ తో పాటు ఎఫర్డబుల్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది. 5000ఎంఏహెచ్ అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో రూ 5,990 ల సరసమైన ధరకే పి 75 ను లాంచ్ చేశామని బిజినెస్ హెడ్ పంకజ్ రాణా వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ సామర్ధ్యం గల మొబైల్ ను వినియోగదారుల సేవలకోసం అందుబాటులోకి తెచ్చామన్నారు. పానసోనిక్ పి 75 ఫీచర్లు ఇలా ఉన్నాయి 5-అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే 5.1 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ 1.3 గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1 జీబీ రాం, 1జీబీ రామ్ 32జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ, 8 జీబి ఇంటర్నల్ మొమరీ 5మెగా పిక్సెల ఫ్రంట్ కెమెరా, విత్ నైన్ బ్యూటీ మోడెస్ 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్ షాంపైన్ గోల్డ్, సాండ్ బ్లాక్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. మరోవైపు రూ. 399 విలువగల స్క్రీన్ గార్డును ఉచితంగా అందిస్తోంది.