Samsung Galaxy M04 Launched in India: Check Details Inside - Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ధరలో శాంసంగ్​ గెలాక్సీ ఎం04: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Published Sat, Dec 10 2022 6:51 PM | Last Updated on Sat, Dec 10 2022 9:26 PM

Samsung Galaxy M04 launched in India details inside - Sakshi

సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది.  గెలాక్సీ  ఎం04 పేరుతో  'M' సిరీస్‌లో బడ్జెట్‌ ధరలో దీన్ని తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్​ మొబైల్‌గా 10 వేల రూపాయల లోపు ధరలో అందిస్తోంది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తోపాటు, 64జీబీ ర్యామ్‌,  128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌(1 టీబీవరకువిస్తరించుకునే అవకాశం) కూడా శాంసంగ్‌  ప్రకటించింది.   (లగ్జరీ ఎస్‌యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్‌ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!)

శాంసంగ్​ గెలాక్సీ ఎం04 ఫీచర్లు 
6.5ఇంచ్​ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే 
మీడియాటెక్​ హీలియో పీ35 సాక్‌,ఆండ్రాయిడ్ 12
4జీబీ ర్యామ్​ + 64జీబీ స్టోరేజ్​ 
డ్యుయల్‌ రియర్‌ కెమెరా: 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ సెన్సార్స్​ 
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ

ధర, లభ్యత
మింట్ గ్రీన్, గోల్డ్, వైట్,  బ్లూ కలర్స్‌లో లభ్యంకానున్న శాంసంగ్​ గెలాక్సీ ఎం04  ధర రూ. 8,499గా ఉంది.  సేల్‌ ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌, శాంసంగ్​ ఇండియా ద్వారా  ప్రారంభమవుతుంది. (రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్‌పాట్‌!ఎలా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement