Tecno Pop 7 Pro with 5000mAh Battery Launched in India - Sakshi
Sakshi News home page

Tecno Pop 7 Pro: ఫీచర్లు అదుర్స్‌! ధర మాత్రం రూ. 7వేల లోపే

Published Thu, Feb 16 2023 8:35 PM | Last Updated on Thu, Feb 16 2023 9:08 PM

Tecno Pop 7 Pro with 5000mAh battery launched in India - Sakshi

సాక్షి,ముంబై: టెక్నో మొబైల్‌ సంస్థ  కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో పాప్‌ 7ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వరుసలో పాప్‌ 6 ప్రో తరువాత ఇండియాలో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 6.56 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో టెక్నో పాప్ 7 ప్రో,  ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ప్రత్యేక ఫీచర్లు నిలుస్తున్నాయి. రెండు కలర్ వేరియంట్‌లు, రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను  విడుదల చేసింది.

టెక్నో పాప్‌  7ప్రో   ఫీచర్లు
6.56 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే
క్వాడ్-కోర్ MediaTek Helio A22 SoC 
ఆండ్రాయిడ్ 12-ఆధారిత HiOS 11.0
12మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా 
5మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా
 5 000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్‌ సపోర్ట్‌ 


ధర,లభ్యత
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ధర  6,799,
6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ రూ. 7,299
ఫిబ్రవరి 22 నుండి అమెజాన్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement