సాక్షి, ముంబై: మోటరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో ఈ32 పేరుతో కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. మీడియా టెక్ హీలియో జీ 37 ప్రాసెసర్‌ను ఇందులో జోడించింది. ఇంకా IP52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో స్టాక్ ఆండ్రాయిడ్ 12తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ధర, ఆఫర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక వేరియంట్‌లో లభిస్తుంది. ధర రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో కొనుగోలుదారులకు రూ. 2,549 విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలను ఉచితం. రూ. 2వేల రూపాయల క్యాష్‌బ్యాక్, వార్షిక Zee5 సభ్యత్వంపై రూ. 549 తగ్గింపు ఇందులో భాగం.
మోటో ఈ32 ఫీచర్లు
6.5 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్
4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం
2MP డెప్త్ సెన్సార్, 50MP రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ,10W ఛార్జింగ్
Comments
Please login to add a commentAdd a comment