
సాక్షి,ముంబై: మోటరోలా తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌ను తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 65,000 గా నిర్ణయించింది.
(Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్‌లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా?)
ధర, లాంచింగ్ ఆఫర్
ఫ్లిప్‌కార్ట్ సహా, ఇతర ఆన్‌లైన్‌స్టోర్లలో రూ. 64,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్‌గా 56,999 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు ఎస్‌బీఐ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపుకూడా లభ్యం. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 8జీబీ వేరియంట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండియాలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్)
మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్స్
6.67 FHD+ OLED డిస్‌ప్లే
144Hz రిఫ్రెష్ రేట్, 1500నిట్స్
స్నాప్‌డ్రాగన్ 8+ Gen1, ఆండ్రాయిడ్ 12
200+50+12ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
60 ఎంపీ సెల్ఫీ కెమెరా
4610 mAh బ్యాటరీ 125 వాట్ ఛార్జింగ్