Motorola India
-
ప్రపంచంలో పలుచని స్మార్ట్‌ఫోన్
మొబైల్స్ తయారీ దిగ్గజం మోటరోలా భారత్‌లో ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్ ధ్రువీకరణతో ప్రపంచంలో అతి పలుచని స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. 7.79 మిల్లీమీటర్ల మందంతో దీన్ని తయారుచేశారు.ఇందులో ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 6.67 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్–5, క్వాల్కామ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. డాల్బీ అట్మోస్ సౌండ్, 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి హంగులు ఉన్నాయి. మార్కెట్లో దీని ధర రూ.27,999గా ఉంది.ఇదీ చదవండి: భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడే విభాగం..! -
5జీ సేవలు: రిలయన్స్ జియోతో జతకట్టిన మోటరోలా
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో ,స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటరోలా భాగస్వామ్యం కుదుర్చుకుని తన కస్టమర్లకు 'ట్రూ 5 జీ' అనుభవాన్ని అందిస్తోంది. ఈ భాగస్వామ్యంతో మోటరోలా వినియోగదారులు 5G పోర్ట్‌ఫోలియోలో జియో ట్రూ 5జీ సేవలను ఉపయోగించవచ్చు. అందుకోసం మోటరోలా తమ సాఫ్ట్వేర్ అప్డేట్లను కూడా విడుదల చేసింది. రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ దీనిపై మాట్లాడుతూ.. ‘మోటరోలా క్యారియర్ అగ్రిగేషన్, 4x4 Mimo, 5G బ్యాండ్లకు సపోర్ట్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ, 5జీ ఫీచర్లతో వస్తుందన్నారు. ఈ ఫీచర్లు జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో పాటు భారతదేశంలో 5జీ సేవలకు సంబంధించిన నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయన్నారు. మోటరోలా స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్న జియో యూజర్లు ఇకపై Jio True 5G సేవలు అందిస్తున్న ప్రాంతాలలో జియో వెల్కమ్ ఆఫర్ కింద అన్లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా పొందగలరని చెప్పారు. ‘మోటరోలా స్మార్ట్ఫోన్లు లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్లుతో పాటు వేగవంతమైన 5G అనుభవాన్ని అందిస్తాయి. తమ కస్టమర్లకు ట్రూ 5జీ అందించాలనే మా నిబద్ధతకు కంపెనీ కట్టుబడి ఉంది. మోటరోలా కంపెనీ భారత్‌లోని తన కస్టమర్లకు అత్యంత సమగ్రమైన, ఎక్కడా కూడా రాజీ లేకుండా 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 13 5G బ్యాండ్లకు సపోర్ట్ ఇస్తోందని’ మోటరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి తెలిపారు. జియో ట్రూ 5 జీస్టాండ్‌లోన్ (ఎస్ఎ) నెట్ వర్క్‌ను యాక్సెస్ చేసుకోవడానికి కస్టమర్లు తమ మొటోరోలా స్మార్ట్ ఫోన్ స్టెట్టింగ్‌లలో ఇష్పడే నెట్ వర్క్‌ను 5జీకి మార్చుకోవాల్సి ఉంటుంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
200ఎంపీ కెమెరా, మోటరోలా కొత్త వేరియంట్, భారీ లాంచింగ్ ఆఫర్
సాక్షి,ముంబై: మోటరోలా తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌ను తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 65,000 గా నిర్ణయించింది. (Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్‌లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా?) ధర, లాంచింగ్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ సహా, ఇతర ఆన్లైన్స్టోర్లలో రూ. 64,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్‌గా 56,999 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు ఎస్బీఐ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపుకూడా లభ్యం. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 8జీబీ వేరియంట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండియాలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్) మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్స్ 6.67 FHD+ OLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1500నిట్స్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen1, ఆండ్రాయిడ్ 12 200+50+12ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 60 ఎంపీ సెల్ఫీ కెమెరా 4610 mAh బ్యాటరీ 125 వాట్ ఛార్జింగ్ -
మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్, ధర తక్కువ, ఇక జియో ఆఫర్ తెలిస్తే!
సాక్షి, ముంబై: మోటరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో ఈ32 పేరుతో కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. మీడియా టెక్ హీలియో జీ 37 ప్రాసెసర్‌ను ఇందులో జోడించింది. ఇంకా IP52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్తో స్టాక్ ఆండ్రాయిడ్ 12తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర, ఆఫర్లు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక వేరియంట్లో లభిస్తుంది. ధర రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో కొనుగోలుదారులకు రూ. 2,549 విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలను ఉచితం. రూ. 2వేల రూపాయల క్యాష్‌బ్యాక్, వార్షిక Zee5 సభ్యత్వంపై రూ. 549 తగ్గింపు ఇందులో భాగం. మోటో ఈ32 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 2MP డెప్త్ సెన్సార్, 50MP రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ,10W ఛార్జింగ్ -
Motorola Moto G72: అదిరిపోయే ఫీచర్లతో మోటరోలా జీ72
న్యూఢిల్లీ: మోటరోలా ‘మోటో జీ72’ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ముందుగా భారత మార్కెట్లో ఆవిష్కరించడం గమనార్హం. ఇది 10 బిట్, 6.6 అంగుళాల 120 గిగాహెర్జ్ పీవోఎల్ఈడీ డిస్ప్లే, 576 హెర్జ్ శాంప్లింగ్ రేటు, 1.07 బిలియన్ షేడ్స్ కలర్‌తో వచ్చిన తొలి ఫోన్. దీన్ని ప్రీమియం డిస్ ప్లేగా చెప్పుకోవాలి. వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. 5జీ టెక్నాలజీ విస్తరణకు ఇంకా సమయం ఉన్నందున, 4జీ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం ఫీచర్లతో జీ72 ఫోన్‌ను అందుబాటు ధరకే అందిస్తున్నట్టు మోటరోలా ఎలిపింది. ఈ ఫోన్ 7.99 ఎంఎం మందంతో, 166 గ్రాముల బరువు ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ99 6 ఎన్ఎం చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ టర్బోపవర్ చార్జర్‌తో వస్తుంది. దీని ధర రూ.18,999. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1,000 డిస్కౌంట్‌కు తోడు, ఫోన్ ఎక్సేంజ్‌పై రూ.3000 అదనపు డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
సంచలనం, భారత్‌లోకి మొదటి 200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే!
అమెరికా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా (Motorola) అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రెండు మొబైల్స్‌ని భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra), మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ (Motorola Edge 30 Fusion) పేరుతో ఈ రెండు సెప్టంబర్ 13న ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా 200 మెగాపిక్సెల్ కెమెరా కావడం.. ఈ ఫోన్ ప్రత్యేకతని చెప్పచ్చు. మరోరకంగా చెప్పలంటే ఇంత భారీ స్థాయిలో పిక్సల్ కెమెరాతో దేశంలో లాంచ్ కానున్న తొలి మొబైల్ కూడా ఇదే. అదిరిపోయే దీని ప్రత్యేకతలు, ఫీచర్లను ఓ లుక్కేద్దాం. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రత్యేకతలు ►క్వాల్కామ్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్. ►ఎడ్జ్ 30 అల్ట్రా ట్రిపుల్ కెమెరా సెటప్, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ సెన్సార్. ముందు భాగంలో, 60-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ►6.67-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ►4,160mAh బ్యాటరీ, 125వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ చార్జింగ్. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు. మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ప్రత్యేతలు ►స్నాప్‌డ్రాగన్ 888+ (Qualcomm Snapdragon) ప్రాసెసర్, ►6.55 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ pOLED డిస్ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్. ►Motorola Edge 30 Fusion వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. కెమెరా పరంగా, ఎడ్జ్ 30 ఫ్యూజన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ►4,400mAh బ్యాటరీ, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. ఇప్పటికే ఈ రెండు స్మార్ట్ఫోన్లు యూరోపియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఎడ్జ్ 30 ప్యూజన్ ఐరోపాలో 600 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 48,000) ఉంటుందని అంచనా. ఇది ఫ్యూజన్ కాస్మిక్ గ్రే, అరోరా వైట్, సోలార్ గోల్డ్, నెప్ట్యూన్ బ్లూ వంటి కలర్స్‌లో లభ్యమవుతుంది. అదేవిధంగా, ఎడ్జ్ 30 అల్ట్రా ధర 899.99 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 72,900) ఉంటుందని అంచనా. ఈ మొబైల్ స్టార్‌లైట్ వైట్, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ రంగులలో వస్తోంది. చదవండి: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్ -
మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటో తెలుసా?
సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ మోటారోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. జీ సిరీస్‌లో మోటో జీ62 5 జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌నుతీసుకొచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే,స్నాప్‌డ్రాగన్ 695 SoCతో దీన్ని విడుదల చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరాలో నైట్ విజన్, సినిమాగ్రాఫ్, పోర్ట్రెయిట్, లైవ్ ఫిల్టర్, డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్ లాంటి ఫీచర్లను జోడించింది.అలాగే ఫ్రంట్ కెమెరా ఫేస్ బ్యూటీ , స్లో మోషన్ వీడియోలకు సపోర్ట్ చేసే సెల్ఫీకెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) భారతదేశంలో మోటో జీ62 5జీ ధర,ఆఫర్లు 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. వీటి ధరలు ధర రూ.17,999, రూ. 19,999గా ఉంచింది. హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంక్ నుండి బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 1500 తగ్గింపు. అంటే ఈ ఫోన్‌ను దీని తుది రూ. 16,499 సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న కొనుగోలుదారులు రూ. 1,750 వరకు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మిడ్నైట్ గ్రే ,ఫ్రాస్టెడ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది ఆగస్ట్ 19 మధ్యాహ్నం 12 PM తొలి సేల్ ఉంటుంది. మోటో జీ62 5 జీ ఫీచర్లు 6.55 అంగుళాల పంచ్-హోల్ LCD డిస్ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డడ్రాగన్ 695 సాక్ 1 టీబీవరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 50+8 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000mAh బ్యాటరీ -
Moto G31: మోటోరోలా నుంచి మరో శక్తి వంతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా భారతదేశం మీద దండయాత్ర ప్రకటించినట్లు కనిపిస్తుంది. వరుస బెట్టి స్మార్ట్‌ఫోన్స్‌ను మొబైల్ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తాజాగా మీడియాటెక్ ప్రాసెసర్, వెనుక ట్రిపుల్ కెమెరా యూనిట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ గల కొత్త స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ31'ను మోటోరోలా మార్కెట్లోకి లాంఛ్ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్, దీని ధర ₹12,999గా ఉంది. రెండవది 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్, దీని ధర ₹14,999గా ఉంది. మోటో జీ31 కూడా అన్నీ మోటోరోలా మొబైల్స్ మాదిరిగానే సమీప స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది యాడ్ ఫ్రీ, దీనిలో ఎటువంటి బ్లోట్ వేర్ ఉండదు. దీని ఫస్ట్ సేల్ ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 6 నుంచి అందుబాటులోకి వస్తుంది. మోటో జీ31 ఫీచర్స్: డిస్ప్లే: 6.4 అంగుళాల ఫుల్-హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్(1,080 X 2,400), ఓఎల్ఈడీ హోల్-పంచ్ డిస్ ప్లే ఆపరేటింగ్ సిస్టమ్: స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ర్యామ్, స్టోరేజ్: 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు బ్యాక్ కెమెరా: 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా బ్యాటరీ: 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ కనెక్టివిటీ: ఎఫ్ఎమ్ రేడియో, 3.5మిమి ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 802.11 , యూఎస్బీ టైప్-సి పోర్ట్ సెన్సార్లు: యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ (చదవండి: జియో నుంచి స్మార్ట్‌టీవీలు, టాబ్లెట్స్..! లాంచ్ ఎప్పుడంటే..!) -
భారత మార్కెట్లపై దండయాత్ర చేయనున్న మోటరోలా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటరోలా భారత మార్కెట్లపై కొత్త మోడళ్లతో దండయాత్ర చేయనుంది. మోటరోలా జీ సిరీస్‌లో భాగంగా ఏకంగా ఐదు మోడళ్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జీ200, జీ71, జీ51, జీ41, జీ31 స్మార్ట్ఫోన్లను మోటరోలా త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మోటో జీ200 స్మార్ట్‌ఫోన్ అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రానుంది. అంతేకాకుండా 144హెర్జ్ డిస్ప్లే ర్రిఫెష్ రేట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వద్ద కనిపించినట్లు తెలుస్తోంది. అన్ని మోడల్‌లు 5,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాలతో రానున్నాయి. మోటో జీ200 స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌తో, మోటో జీ71 స్నాప్‌డ్రాగన్ 695, మోటో51 స్నాప్ డ్రాగన్ 480+తో మోటో జీ41 మీడియా టెక్ హెలియో జీ85 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. మోటరోలా జీ200 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 37900, మోటో జీ71 ధర సుమారు రూ. 25,300, మోటో జీ51 సుమారు రూ. 19,372 కు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మోటో జీ41 ధర 21 వేలకు మోటో జీ 31 ధర రూ. 16,900 గా ఉండనుంది. చదవండి: మెర్సిడెస్ బెంజ్ నుంచి అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్ కార్..! ధర ఎంతంటే..? -
మోటోరోలా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్..!
Moto E40 India Launch Teased: భారత మార్కెట్లలోకి మోటోరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఈ40 లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లలోకి వస్తోందని మోటోరోలా ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోటో ఈ40 ‘ది పర్ఫెక్ట్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ట్విటర్లో టీజ్ చేసింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌ను ప్రకటించలేదు. మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల చివరలో లేదా నవంబర్ తొలి వారంలో రిలీజ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక మోటో ఈ40 ధర విషయానికి వస్తే ఈ డివైజ్ భారత్‌లో రూ 10,000లోపు లభించనున్నట్లు తెలుస్తోంది. మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్ గ్రే, పింక్ కలర్ వేరియంట్ ఆప్షన్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...! మోటో ఈ40 ఫీచర్స్(అంచనా) 6.5-అంగుళాల హెచ్డి+ ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే 1,600x720 పిక్సెల్స్ రిజల్యూషన్ విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ 11 యునిసోక్ టీ700 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్+ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 42+2+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫింగర్ ప్రింట్సెన్సార్ 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్ Fuel your imagination with the #PerfectEntertainer and color the world with your ideas! Can you guess what we're talking about? pic.twitter.com/NZXAr5QLkh — Motorola India (@motorolaindia) October 6, 2021 చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..! -
మోటో ట్యాబ్ జి20, ట్యాబ్లెట్ మార్కెట్లోకి మోటరోలా ఎంట్రీ
మోటరోలా ట్యాబ్లెట్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. మోటో ట్యాబ్ జి20ను విడుదల చేసింది. 8 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో, టీడీడీఐ టెక్నాలజీతో మెరుగైన టచ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్‌తో కూడిన ట్యాబ్లెట్లో మీడియా టెక్ హీలియో పీ22టీ ఆక్టాకోర్ ప్రాసెస్‌ను ఏర్పాటు చేసింది. ఈనెల 2వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై బుక్ చేసుకోవచ్చని.. ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ, యాక్సిస్ కా ర్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. -
ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే?
న్యూఢిల్లీ: మోటరోలా కంపెనీ వేగవంతమైన ఇంటర్నెట్ కోసం అత్యాధునిక మెష్ సిస్టమ్ ‘ఎంహెచ్7020’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని హోల్ హోమ్ వైఫై సిస్టమ్‌గా కంపెనీ పేర్కొంది. వైఫై రూటర్, వైఫై శాటిలైట్, పవర్ అడాప్టర్లతో ఈ ప్యాక్‌లు లభిస్తాయి. 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిలో అన్ని ప్రాంతాలకు వైఫై కవరేజీ వేగవంతంగా, నాణ్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనికితోడు అధిక భద్రత కూడా లభిస్తుందని పేర్కొంది. ఒక మెష్రెడీ రూటర్, ఒక అడాప్టర్, ఎథర్నెట్ కేబుల్, క్విక్స్టార్ట్ ఫ్లయర్, మోటోమ్యానేజ్ యాప్ ప్యాక్ ధర రూ.7,999గా నిర్ణయించింది. ఒక హోల్హోమ్ వైఫై రూటర్, ఒక వైఫై శాటిలైట్, రెండు పవర్ అడాప్టర్లు, రెండు ఎథర్నెట్ కేబుళ్లతో కూడిన ప్యాక్ రూ.13,999గాను, ఒక హోల్హోమ్ వైఫై రూటర్, 2 శాటిలైట్లు, మూడు పవర్ అడాప్టర్లు, మూడు ఎథర్నెట్ కేబుళ్ల ప్యాక్ ధర రూ.19,999గా నిర్ణయించింది. చదవండి: రికార్డు సృష్టించిన స్టార్‌లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే.. -
భారీ కెమెరాతో : మోటరోలా మరో అద్భుత స్మార్ట్‌ఫోన్
సాక్షి,వెబ్‌డెస్క్: చైనా టెక్ దిగ్గజం లెనోవాకు చెందిన మోటరోలా భారీ కెమెరాతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే 108 ఎంపీ బిగ్ కెమెరా ప్రధాన ఫీచర్‌గా ‘మోటోజీ 60’ ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా మరో డివైస్‌ను ఆవిష్కరించనుంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఏ52కి పోటీగా మిడ్ రేంజ్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మోటరోలా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లు ఒకటి అంతకంటే ఎక్కువ ఫోన్లను మార్కెట్లోకి తేవాలని లెనోవా భావిస్తోంది. టెక్నిక్ సంస్థ న్యూస్ ప్రకారం.. మోటరోలా ఎడ్జ్ బెర్లిన్, మోటరోలా ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎ, మోటరోలా ఎడ్జ్ క్యోటో, మోటరోలా ఎడ్జ్ పిస్టార్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో లాంచ్ కానున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన మోటో ఎడ్జ్, మోటో ఎడ్జ్ + ఫోన్ల తరహాలో ఈ స్మార్ట్ఫోన్లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. మోటో ఎడ్జ్ బెర్లిన్: స్పెసిఫికేషన్స్ టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం యూరోపియన్ మోడల్, నార్త్-అమెరికన్ మోడల్‌తో మోటో ఎడ్జ్ బెర్లిన్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778 g soc తో పాటు 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 265 జీబీ వేరియంట్లతో రావచ్చు. మోటో ఎడ్జ్ బెర్లిన్, ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎలలో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్రధానంగా 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. యూరోపియన్ వేరియంట్లో 16 మెగాపిక్సెల్, సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్, మూడు కెమెరా సెన్సార్లు ఉంటాయని అంచనా. నార్త్ అమెరికన్ మోడల్లో 8 ఎంపీ సెకండరీ సెన్సార్, 2 ఎంపీ మూడు సెన్సార్లతో రానుంది. 32 ఎంపీ సెల్ఫీకెమెరాను జోడించినట్టు సమాచారం. మోటరోలా ఎడ్జ్ పిస్టార్: ఫీచర్స్ మోటరోలా ఎడ్జ్ పిస్టార్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ లేదంటే స్నాప్ డ్రాగన్ 870 సాక్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాదు 6GB + 128 GB, 8 GB + 265 GB తో సహా రెండు ర్యామ్ వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. మోటో ఎడ్జ్ బెర్లిన్ మాదిరిగానే వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్, ప్రైమరీ సెన్సార్‌తో పాటు 16 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ 2 కెమెరా సెన్సాలతో భారత్ లో విడుదల కానుంది. చదవండి: పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారంటే.. -
సూపర్ ఫీచర్లతో మోటరోలా మరో అద్భుతమైన ఫోన్
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటరోలా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. రెడ్మి, రియల్మీ తరహాలో 108 మెగా పిక్సెల్ భారీ రియర్ కెమెరాతో ఫోన్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. జీసిరీస్లో భాగంగా జీ 60 పేరుతో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో ఆవిష్కరించనుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ డిస్ప్లేతోసాటు, డ్యుయల్ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా రానుందని అంచనా. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సిసి) నుండి ధృవీకరణ లబించినఅనంతరం ఈ ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 870 చిప్సెట్తో కూడిన మరో మోటరోలా ఫోన్ ఇది కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే జీ సిరీస్‌లో మోటో జీ100 ను మార్చి 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే పలు ఊహాగానాలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. (ఐటెల్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేశాయ్!) మోటో జీ 60 ఫీచర్లు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డి + డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 108 మెగాపిక్సెల్ శామ్సంగ్ ఐసోసెల్ హెచ్ఎం 2 ప్రైమరీ సెన్సార్ 16 ఎంపీ, 8 ఎంపీ సెన్సార్ 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ 32 +16 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీని -
అద్భుతఫీచర్లు, బడ్జెట్ ధర: రెండు స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. మోటరోలా జీ సిరీస్‌లో మోటో జీ10పవర్, మోటో జీ 30పేర్లతో బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మంగళవారం లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు స్టాక్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తాయనికంపెనీ తెలిపింది.అలాగే మాలావేర్,, ఫిషింగ్ ఇతరసైబర్ దాడుల నుంచి వ్యక్తిగత డేటాను రక్షించే విషయంలో నాలుగు పొరల భద్రతను అందించే మొబైల్ టెక్నాలజీ కోసం థింక్‌షీల్డ్‌తో తీసుకొచ్చినట్టు మోటరోలా ప్రకటించింది. అలాగే బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మోటో జీ10 పవర్ 6.5 అంగుళాల మాక్స్ విజన్ హెచ్డీ + డిస్ప్లే. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ 48+ 8+ 2+2 రియర్ క్వాడ్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 1 టీబీ జీబీ వరకు విస్తరించుకునేఅవకాశం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మోటో జీ 30 6.5 అంగుళాల మ్యాక్స్ విజన్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 1 టీబీ జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64+8+2+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు, లభ్యత మోటో జీ 10 పవర్ మార్చి 16, మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకం. అరోరా గ్రే, బ్రీజ్ బ్లూ కలర్లలో లభ్యం. ధర రూ. 9,999. మోటో జీ 30 మార్చి 17, మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. డార్క్ పెర్ల్, పాస్టల్ స్కై కలర్లలో లభ్యం. ధర రూ. 10,999 -
మరో బడ్జెట్ ఫోన్ : మోటో ఈ7 ప్లస్
సాక్షి, ముంబై: మోటోరోలా కంపెనీ మోటో ఈ7 ప్లస్ పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. బిగ్ స్క్రీన్, బారీ కెమెరా, 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో పది వేల రూపాయల ధరలో దీన్ని అదుబాటులోకి తీసుకొచ్చింది. మోటో ఈ7 ప్లస్ ఫీచర్లు 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 48+ 2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ధర, లభ్యత: మోటో ఈ7 ప్లస్ ధర 9,499 రూపాయలు మిస్టీ బ్లూ, ట్విలైట్ ఆరెంజ్ కలర్స్ లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 30 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. ✔️ 48 MP f/1.7 dual camera ✔️ Night Vision technology ✔️ Ultra-fast Snapdragon™ 460 with 4GB RAM ✔️ 5000 mAh battery ✔️ 6.5" HD+ display ✔️ Stock Android experience Get these & more in #motoe7plus. Available for ₹9,499 from 30th Sep, 12PM on @flipkart! https://t.co/7vqOwIiL6n pic.twitter.com/by6nbFYFuh — Motorola India (@motorolaindia) September 23, 2020 -
సమ్‌థింగ్ బిగ్ : మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు మోటరోలా త్వరలో భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. అద్భుతమైన పనితనం, అద్భుతమైన కెమెరా.. సిద్ధంగా ఉండండి అంటూ ఒక టీజర్ రిలీజ్ చేసింది. దేశంలో తమ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా లాంచ్ చేయనున్నామని ట్వీట్ చేసింది. ఆగస్టు 24 న లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ పేరు, ఫీచర్లను స్పష్టం చేయనప్పటికీ, మోటో ఈ7 ప్లస్ పేరుతో దీన్ని తీసుకు రానుందని అంచనా. బిగ్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పీకర్ గ్రిల్‌ను టీజర్లో గుర్తించవచ్చు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 64 జిబి స్టోరేజ్ , డ్యూయల్-రియర్ కెమెరా ప్రధాన ఆకర్షణీయంగా ఉండనున్నాయని భావిస్తున్నారు. Gear up for a spectacular performance and stunning camera! Launching soon on @Flipkart. pic.twitter.com/SWMv26zTOG — Motorola India (@motorolaindia) August 20, 2020 -
మోటో జీ8 ప్లస్ : బడ్జెట్ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్తయారీదారు మోటరోలా జి సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో జీ8 ప్లస్‌ను తీసుకొచ్చింది. కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ పింక్ రంగుల్లో, అక్టోబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. జియో ఆఫర్ : వినియోగదారులకు 2200 తక్షణ క్యాష్‌బ్యాక్ సదుపాయంతో పాటు రూ. 3వేల క్లియర్ ట్రిప్ కూపన్, రూ. 2వేల జూమ్ కార్ వోచర్ లభిస్తాయి. ధర రూ. రూ.13,999 మోటో జీ 8 ప్లస్ ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 9పై క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీమ స్టోరేజ్ 512 వరకు విస్తరించుకునే అవకాశం 25 ఎంపీ సెల్ఫీ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా 48+16 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ డెప్త్ సెన్సర్ 4000 ఎంఏహెచ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్, డాల్బీ స్టీరియో స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, టైప్ సీ ఛార్జర్ ఇతర ప్రత్యేకతలు. The next g is here! Get ready for anything with the all-new #motog8plus. 😎 The class-leading Quad Pixel camera system delivers 4x low light sensitivity, making sure you #DontMissAThing. Available soon on @Flipkart for ₹13,999. pic.twitter.com/pYmeCeYRsN — Motorola India (@motorolaindia) October 24, 2019 -
షావోమికి షాక్ : మోటరోలా స్మార్ట్‌టీవీలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్స్ తయారీదారు లెనోవా సొంతమైన మోటరోలా భారత మార్కెట్లో చవక ధరలకే పలు ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ సహకారంతో 32, 43, 50, 55, 65 ఇంచుల డిస్ప్లే పరిమాణాల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలనునేడు (సోమవారం) లాంచ్ చేసింది. భారతదేశంలో స్మార్ట్‌టీవీలకు పెరుగుతున్నఆదరణ నేపథ్యంలో స్మార్ట్‌టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టడానికి వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త వ్యూహంతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. ప్రధానంగా షావోమికి షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ సందర్భంగా సెప్టెంబర్ 29 నుంచి ఈ టెలివిజన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. దాదాపు షావోమి ఎంఐ టీవీల మాదిరి ఫీచర్లు, అదే ధరతో వీటిని తీసుకొచ్చింది. మరోవైపు షావోమి రేపు భారతదేశంలో 65 అంగుళాల టీవీని విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. మోటరోలా తీసుకొచ్చిన ఆరు టీవీలు ఆండ్రాయిడ్ 9 ఆధారంగా, నిరంతరాయమైన గేమింగ్ అనుభవం కోసం గేమింగ్ కంట్రోలర్ సపోర్ట్‌తో పనిచేస్తాని కంపెనీ తెలిపింది. స్క్రీన్ షిఫ్ట్, ఆటోటూన్ఎక్స్ డిస్ప్లే టెక్నాల. జీ10 బిట్ కలర్ డెప్త్ లాంటి ఫీచర్లు జోడించింది. 49, 55 అంగుళాల టీవీలు 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, మాలి-450 జిపియు, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. 32, 43-అంగుళాల ఫుల్హెచ్డీ టీవీలు 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 20 డబ్ల్యూ సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయి 32 అంగుళాల హెచ్డీ రెడీ టీవీ ధర రూ.13,999 43 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీ ధర రూ.24,999 43 అంగుళాల 4కె టీవీ ధర రూ.29,999 50 అంగుళాల 4కె టీవీ ధర రూ.33,999 55 అంగుళాల 4కె టీవీ ధర రూ.39,999 65 అంగుళాల 4కె స్మార్ట్ టీవీ ధరను రూ.64,999 -
సూపర్ ఫీచర్లతో మోటరోలా వన్ విజన్ లాంచ్
సాక్షి, ముంబై : మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియామార్కెట్లోలాంచ్ చేసింది. ఇటీవల గ్లోబల్ గా లాంచ్ చేసిన ‘వన్ విజన్’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇక్కడ విడుదలచేసింది. దీని ధరను రూ. 19,999 గా నిర్ణయించింది. ఆధునిక ఫీచర్లు, ప్రధానంగా సినిమా విజన్ డిస్ప్లే, నైట్ విజన్ ఫీచర్‌తో 48, 5 మెగా పిక్సెల్ సామర్ధ్యం గల డబుల్ రియర్ కెమెరా లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటరోలా వన్ విజన్ ఫీచర్లు 6.3 ఇంచ్ డిస్ప్లే శాంసంగ్ ఎగ్జినోస్ 9609 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 1080x2520 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+5 ఎంపీ డబుల్ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
మెగా బ్యాటరీతో మోటరోలా జీ7 పవర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆకట్టుకునే ఫీచర్లతో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 5వేల ఎంఏహెచ్ మెగా బ్యాటరీతో మోటరోలా జీ7 పవర్ మొబైల్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. 15వాట్స్ టర్బోపవర్ సపోర్ట్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రత్యేక ఫీచర్లని కంపెనీ చెబుతోంది. మొదటిసారిగా ఇండియాలో ఆఫ్‌లైన్ స్టోర్లల్లో కూడా ఈ ఫోన్ విక్రయానికి లభ్యం. మోటరోలా.ఇన్ వెబ్సైట్, మోటో స్టోర్ లేదా మోటో హబ్, సిటీ, స్టేట్ ఎంచుకొని ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. మోటరోలా జీ7 పవర్ ఫీచర్లు 6.24 అంగుళాల ఫుల్ హెచ్డీ+డిస్ప్లే 720x1570 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: రూ.13,999 -
ప్రీమియం ఫీచర్లతో మోటరోలా 4 స్మార్ట్ఫోన్లు
మోటరోలా స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌కు కొనసాగింపుగా జి 7, జి 7 ప్లే, జి7 ప్లస్, జి 7 పవర్‌ను స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరికి భారతీయ మార్కెట్లో లభ్యం కానున్నాయి. నాచ్ డిస్ప్లే లాంటి ప్రీమియం ఫీచర్లతో, ప్రీమియం ధరల్లో వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు సుమారు ఇలా ఉండనున్నాయి. మోటో జి 7 ధర రూ. 30,748 మోటో జి 7 ప్లే ధర రూ. 19,210 మోటో జి 7 పవర్ ధర రూ.26, 899 మోటో జి 7ప్లస్ ధర రూ. 19వేలు రూ.36,517 మోటో జి 7 ఫీచర్లు 6.24 అంగుళాల డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 632 ఆండ్రాయిడ్ 9.0 పై 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 12+5ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా మోటో జి 7 పవర్ ఫీచర్లు 6.24 అంగుళాల డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 636 16+5ఎంపీ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బిగ్ స్క్రీన్, మాసివ్ బ్యాటరీ : బడ్జెట్ ధర
సాక్షి,ముంబై: మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్ చేయనుంది. మోటో ఈ5ప్లస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేయనుంది. అనంతరం మోటోఈ5ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ట్విటర్లో వరుసగా టీజర్లు వదులుతోంది. పాక్డ్ విత్ మాసివ్ బ్యాటరీ, బహుమతులూ అంటూ ఊరిస్తోంది. మోటో ఈ4 ప్లస్ సక్సెసర్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు 10వేల రూపాయలుగా నిర్ణయించవచ్చని సమాచారం. జూలై మాసంలోనే లాంచ్ కానుందని భావిస్తున్న ఈ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు ఇలా ఉన్నాయి: మోటో ఈ5ప్లస్ ఫీచర్లు 6.6 అంగుళాల డిస్ ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 720x1440పిక్సెల్స్‌రిజల్యూషన్ 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5 ఎంపీ సెల్ఫీకెమెరా 12ఎంపీ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ Love watching what you love, all day, every day!? Tell us which of these situations best describes you by sharing a screenshot with #helloentertainment. Stand a chance to win the soon to be launched #motoe5plus, packed with a massive battery! ( T&C - https://t.co/gvLvh3ESo6 ) pic.twitter.com/HFoSte6Qrb — Motorola India (@motorolaindia) June 30, 2018 BIG battery. BIG screen. For BIG entertainment. The #motoe5plus is on its way. Get set to say #helloentertainment! Stay tuned. pic.twitter.com/eGKxElhLmY — Motorola India (@motorolaindia) June 29, 2018 -
మోటో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: మోటరోలా ఇండియా కూడా మోటో డే సేల్ ను ప్రారంభించింది. ఈ స్పెషల్ సేల్‌లో మూడు స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను అమలు చేస్తోంది. ఆన్లైన్ రీటైల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ ఏప్రిల్ 12 నుంచి 14వరకు అందుబాటులో ఉంటుంది. మోటో ఎక్స్ 4, ఈ4 ప్లస్, జెడ్ 2 ప్లే స్మార్ట్ఫోన్లపై గరిష్టంగా రూ.8వేల దాకా రాయితీ ధరలను ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఈ సేల్ ప్రారంభమవుతుంది. మోటో ఈ 4ప్లస్ 3జీబీ ర్యామ్ (ఫైన్ గోల్డ్, ఐరన్ గ్రే) రూ. 8,999 లకే లభ్యం. దీని అసలు ధర రూ. 9,999గా ఉంది. మోటో జెడ్ 2 ప్లే భారీగా 8,000 రూపాయలు డిస్కౌంట్ అనంతరం రూ. 19,999కే అందుబాటులో ఉంది. మోటో ఎక్స్ 4 (3జీబీ / 4జీబీ / 6జీబీ ర్యామ్ ) అన్ని వేరియంట్స్ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఖచ్చితమైన ఆఫర్ ఇంకా బహిర్గతం చేయలేదు. ఈ మూడు స్మార్ట్ఫోన్లపై ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. -
మోటో కొత్త ఫోన్ : టర్బో పవర్ మోడ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా సరికొత్త ఫ్లాగ్‌షిప్‌స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో లిమిటెడ్ ఎడిషన్‌గా మోటో జెడ్2 ఫోర్స్‌ను లాంచ్ చేసింది. భారత్‌లో దీని ధరను రూ.34,999గా నిర్ణయించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్లు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటో హబ్ స్టోర్లలో గురువారం అర్ధరాత్రి 11.59 నిమిషాల నుంచి లభించనున్నాయి. షట్టర్ ప్రూఫ్ స్క్రీన్, సూపర్ స్లీక్ బాడీ, క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, టర్బో వపర్‌తో 6220 ఎంఏహెచ్ పవర్ దీని సొంతమని కంపెనీ చెబుతోంది. మోటో జెడ్2 ఫోర్స్ ఫీచర్స్ 5.5 అంగుళాల క్వాడ్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 1440x2560 పిక్సెల్ రిజల్యూషన్ 6జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 2టీబీ దాకా విస్తరించుకునే అవకాశం 12+12ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2730 ఎంఏహెచ్ బ్యాటరీ ( టర్బో పవర్ ప్యాక్)