Moto E40 India Launch Teased: భారత మార్కెట్లలోకి మోటోరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఈ40 లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లలోకి వస్తోందని మోటోరోలా ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోటో ఈ40 ‘ది పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ట్విటర్‌లో టీజ్ చేసింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌ను ప్రకటించలేదు. మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల చివరలో లేదా నవంబర్ తొలి వారంలో రిలీజ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక మోటో ఈ40 ధర విషయానికి వస్తే ఈ డివైజ్ భారత్‌లో రూ 10,000లోపు లభించనున్నట్లు తెలుస్తోంది. మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్ గ్రే, పింక్ కలర్ వేరియంట్ ఆప్షన్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!
మోటో ఈ40 ఫీచర్స్(అంచనా)
- 6.5-అంగుళాల హెచ్‌డి+ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే
- 1,600x720 పిక్సెల్స్ రిజల్యూషన్ విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- ఆండ్రాయిడ్ 11
- యునిసోక్ టీ700 ప్రాసెసర్
- 4జీబీ ర్యామ్+ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 42+2+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా
- 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- ఫింగర్ ప్రింట్‌సెన్సార్
- 4000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
- టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్
Fuel your imagination with the #PerfectEntertainer and color the world with your ideas! Can you guess what we're talking about? pic.twitter.com/NZXAr5QLkh
— Motorola India (@motorolaindia) October 6, 2021
చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..!
Comments
Please login to add a commentAdd a comment