మోటరోలా నుంచి మరో పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్‌..! | Moto G Power 2022 With MediaTek Helio G37 Launched | Sakshi
Sakshi News home page

మోటరోలా నుంచి మరో పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్‌..!

Published Thu, Nov 18 2021 10:35 PM | Last Updated on Thu, Nov 18 2021 10:35 PM

Moto G Power 2022 With MediaTek Helio G37 Launched - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం మోటరోలా సరికొత్త మోటో జీ పవర్ 2022 స్మార్ట్ ఫోన్ లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ 2021 అప్‌గ్రేడ్‌గా రానుంది. 50-మెగాపిక్సెల్  సెన్సార్‌తో ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌, హోల్-పంచ్ డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరా, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటుచేసింది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ధరలు సుమారు రూ. 14 వేల నుంచి 18 వేల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ యూఎస్‌ మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లలోకి వచ్చే ఏడాదిలో రానున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 11తో పనిచేయనుంది. 

మోటో జీ పవర్‌ స్పెసిఫికేషన్స్‌

  • 6.5-అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • మీడియా టెక్‌ హెలియో జీ37 ప్రాసెసర్‌
  • 4జీబీ+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 50ఎమ్‌పీ ప్రైమరీ కెమెరా
  • 8 ఎమ్‌పీ ఫ్రంట్‌ కెమెరా
  • ఆండ్రాయిడ్‌ 11
  • 5000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ
  • ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
  • టైప్‌ సీ సపోర్ట్‌

చదవండి: భారతీయులు ఎక్కువగా వాడుతున్న పాస్‌వర్డ్‌ ఇదే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement