సాక్షి,వెబ్‌డెస్క్: చైనా టెక్ దిగ్గజం లెనోవాకు చెందిన మోటరోలా భారీ కెమెరాతో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే 108 ఎంపీ బిగ్ కెమెరా ప్రధాన ఫీచర్‌గా ‘మోటోజీ 60’ ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా మరో డివైస్‌ను ఆవిష్కరించనుంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఏ52కి పోటీగా మిడ్ రేంజ్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మోటరోలా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు ఒకటి అంతకంటే ఎక్కువ ఫోన్లను మార్కెట్‌లోకి తేవాలని లెనోవా భావిస్తోంది.
టెక్నిక్ సంస్థ న్యూస్ ప్రకారం.. మోటరోలా ఎడ్జ్ బెర్లిన్, మోటరోలా ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎ, మోటరోలా ఎడ్జ్ క్యోటో, మోటరోలా ఎడ్జ్ పిస్టార్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో లాంచ్ కానున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన మోటో ఎడ్జ్, మోటో ఎడ్జ్ + ఫోన్ల తరహాలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయనే ప‍్రచారం జరుగుతోంది.
మోటో ఎడ్జ్ బెర్లిన్: స్పెసిఫికేషన్స్
టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం యూరోపియన్ మోడల్, నార్త్-అమెరికన్ మోడల్‌తో మోటో ఎడ్జ్ బెర్లిన్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778 g soc తో పాటు 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 265 జీబీ వేరియంట్లతో రావచ్చు.
మోటో ఎడ్జ్ బెర్లిన్, ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎలలో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్రధానంగా 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. యూరోపియన్ వేరియంట్లో 16 మెగాపిక్సెల్, సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్, మూడు కెమెరా సెన్సార్లు ఉంటాయని అంచనా. నార్త్ అమెరికన్ మోడల్‌లో 8 ఎంపీ సెకండరీ సెన్సార్, 2 ఎంపీ మూడు సెన్సార‍్లతో రానుంది. 32 ఎంపీ సెల్ఫీకెమెరాను జోడించినట్టు సమాచారం.
మోటరోలా ఎడ్జ్ పిస్టార్: ఫీచర్స్
మోటరోలా ఎడ్జ్ పిస్టార్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ లేదంటే స్నాప్ డ్రాగన్ 870 సాక్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాదు 6GB + 128 GB, 8 GB + 265 GB తో సహా రెండు ర్యామ్ వేరియంట్‌లతో అందుబాటులోకి రానుంది. మోటో ఎడ్జ్ బెర్లిన్ మాదిరిగానే వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్, ప్రైమరీ సెన్సార్‌తో పాటు 16 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ 2 కెమెరా సెన్సాలతో భారత్ లో విడుదల కానుంది.
చదవండి: పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment