సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ మోటారోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. జీ సిరీస్‌లో మోటో జీ62 5 జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌నుతీసుకొచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే,స్నాప్‌డ్రాగన్ 695 SoCతో దీన్ని విడుదల చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరాలో నైట్ విజన్, సినిమాగ్రాఫ్, పోర్ట్రెయిట్, లైవ్ ఫిల్టర్, డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్ లాంటి ఫీచర్లను జోడించింది.అలాగే ఫ్రంట్ కెమెరా ఫేస్ బ్యూటీ , స్లో మోషన్ వీడియోలకు సపోర్ట్ చేసే సెల్ఫీకెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ)
భారతదేశంలో మోటో జీ62 5జీ ధర,ఆఫర్లు
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. వీటి ధరలు ధర రూ.17,999, రూ. 19,999గా ఉంచింది.
హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంక్ నుండి బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 1500 తగ్గింపు. అంటే ఈ ఫోన్‌ను దీని తుది రూ. 16,499 సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న కొనుగోలుదారులు రూ. 1,750 వరకు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మిడ్‌నైట్ గ్రే ,ఫ్రాస్టెడ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది ఆగస్ట్ 19 మధ్యాహ్నం 12 PM తొలి సేల్ ఉంటుంది.
మోటో జీ62 5 జీ ఫీచర్లు
6.55 అంగుళాల పంచ్-హోల్ LCD డిస్‌ప్లే
2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కం స్నాప్ డడ్రాగన్ 695 సాక్
1 టీబీవరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం
50+8 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5,000mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment