ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా భారతదేశం మీద దండయాత్ర ప్రకటించినట్లు కనిపిస్తుంది. వరుస బెట్టి స్మార్ట్‌ఫోన్స్‌ను మొబైల్ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తాజాగా మీడియాటెక్ ప్రాసెసర్, వెనుక ట్రిపుల్ కెమెరా యూనిట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ గల కొత్త స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ31'ను మోటోరోలా మార్కెట్లోకి లాంఛ్ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి.
ఒకటి 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్, దీని ధర ₹12,999గా ఉంది. రెండవది 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్, దీని ధర ₹14,999గా ఉంది. మోటో జీ31 కూడా అన్నీ మోటోరోలా మొబైల్స్ మాదిరిగానే సమీప స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది యాడ్ ఫ్రీ, దీనిలో ఎటువంటి బ్లోట్ వేర్ ఉండదు. దీని ఫస్ట్ సేల్ ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 6 నుంచి అందుబాటులోకి వస్తుంది.
మోటో జీ31 ఫీచర్స్:
- డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ రిజెల్యూషన్(1,080 X 2,400), ఓఎల్ఈడీ హోల్-పంచ్ డిస్ ప్లే
- ఆపరేటింగ్ సిస్టమ్: స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
- ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్
- ర్యామ్, స్టోరేజ్: 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు
- బ్యాక్ కెమెరా: 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా
- ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
- బ్యాటరీ: 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
- కనెక్టివిటీ: ఎఫ్ఎమ్ రేడియో, 3.5మిమి ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 802.11 , యూఎస్‌బీ టైప్-సి పోర్ట్
- సెన్సార్లు: యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్
(చదవండి: జియో నుంచి స్మార్ట్‌టీవీలు, టాబ్లెట్స్..! లాంచ్ ఎప్పుడంటే..!)
Comments
Please login to add a commentAdd a comment