
మొబైల్స్ తయారీ దిగ్గజం మోటరోలా భారత్‌లో ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్ ధ్రువీకరణతో ప్రపంచంలో అతి పలుచని స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. 7.79 మిల్లీమీటర్ల మందంతో దీన్ని తయారుచేశారు.
ఇందులో ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 6.67 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్–5, క్వాల్‌కామ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. డాల్బీ అట్మోస్ సౌండ్, 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి హంగులు ఉన్నాయి. మార్కెట్‌లో దీని ధర రూ.27,999గా ఉంది.
ఇదీ చదవండి: భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడే విభాగం..!
Comments
Please login to add a commentAdd a comment